టపా తేదీ జూన్ 27, 2007 ద్వారా జ్యోతి
తెలుగు నిఘంటువులు చాలా వచ్చాయి. అయితే అన్నింటిలోనూ గ్రాంధిక, కావ్యభాషా పదాలే అధికంగా వుంటాయి. ప్రత్యేక నిఘంటువులు, పదకోశాల్లో పారిభాషిక పదజాలానికి, వృత్తి సంబంధమైన పదాలకు, పద బంధాలకూ కూడా అర్ధాలుదొరుకుతాయి. నానార్ధ పదకోశాలు, పర్యాయపద నిఘంటువులు,మాండలిక పద నిఘంటువులు, వృత్తికోశాలు, పాత్రికేయ పదకోశాలు ఈ కోవకు చెందుతాయి. కాని వాడుక తెలుగును వీటి నుంచి ఆశించలేం. అది నిజంగా పెద్ద లోటే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి వాడుక తెలుగు కోశాన్ని రూపొందించారు. [...]
: నందు ఉంచబడ్డది; పుస్తకాలు | 2 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జూన్ 14, 2007 ద్వారా జ్యోతి
వాజ్మయ సుధా తరంగాలు
అరిషడ్వర్గాలను జయించవలసిన ఆవశ్యకతను , ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి వుండాలని సంస్కృత సూక్తులతో సులభశైలిలో చక్కగా వివరించే వ్యాస సంకలనమిది.
రచన : సముద్రాల శఠకోపాచార్య
పుటలు : 81
వెల : రు.25
ప్రతులకు :
సముద్రాల వెంకటా నర్సింహాచార్యులుగారు,
శ్రీనివాస నిలయం, 2-5-318
నక్కలగుట్ట, హన్మకొండ - వరంగల్ జిల్లా
పాత్రికేయ పాళి
ఆచార్య తిరుమల రామచంద్ర, ఆలపాటి రవీంద్రనాథ్,ఎ.బి.కె ప్రసాద్,టంకశాల అశోక్, పొత్తూరి వెంకటేశ్వరరావు,కె.రామచంద్రమూర్తి, ఎం.వి.ఆర్.సాస్త్రి తదితర పాత్రికేయ ప్రముఖులు, సంపాదకుల రచనల నుంచి చేసిన విశ్లేషణల మాలిక ఇది.
రచన: నాగసూరి వేణుగోపాల్
పుటలు [...]
: నందు ఉంచబడ్డది; పుస్తకాలు | అభిప్రాయాలు లేవు »