పొద్దు రచనలు
టైమ్ మెషిన్….
ఈ కథ మొత్తం చదివి చివరలో అడిగిన ప్రశ్నకు జవాబివ్వగలరేమో ప్రయత్నించండి….
1975 జనవరి 1
ఉదయం ఐదు గంటలైంది. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. చీకటిగానే ఉంది.అది బాపూ అనాథాశ్రమం. దాని నిర్వాహకుడు ప్రకాశం అప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా ఏళ్ళయింది. దానికి ప్రకాశమే వ్యవస్థాపక నిర్వాహకుడు. ఇంతలో బయటనుండి కలకలం వినిపించింది. ప్రకాశం ఏంటా అని బయటకెళ్ళి చూసాడు.
అనాథాశ్రమం మెట్లపైన చీరలో చుట్టిన ఒక పసిపాప. ఆడపిల్ల. [...]
శ్రీనివాసుడికి సామెతల సుమ మాల
ఆ తిరుమల వేంకటేశ్వరుడికి రోజూ పూలతో అలంకరించుకుని కాస్త విసుగెత్తిందేమో ..
మనం సాహిత్యాభిషేకం చేద్దామా! తలా రెండు సామెతల సంపెంగలో, సన్నజాజులో
సమర్పించండి. మాల చేసి స్వామిని అలంకరిద్దాం!
తొలి ప్రచురణ పొద్దులో..
అంకెలతో పద్య సంకెలలు
అంకెలతో సాహిత్యానికి చాలా సంబంధం ఉంది. (ఈ మహా సృష్టిని అంకెల ఆధారంతోనే గుర్తిస్తాము.) జ్ఞానానికి సంఖ్య ఆధారం. కాని అంకెకు ప్రత్యేక అస్థిత్వమంటూ లేదు. అసలు అంకెల ఆధారిత పేర్లు, పదబంధాలు ఎన్నో ఉన్నాయి. ఏకావ్రతుడు, త్రివిక్రముడు,చతుర్ముఖుడు, పాంచాలి, సప్తాశ్వుడు, అష్టావక్రుడు, నవనాధుడు, దశకంఠుడు మొదలైనవి. మన కవులు కవితలల్లడానికి ఇదీ అని ఒక వస్తువు కాని, విషయం కాని ఆలోచించరు. కనపడ్డ ప్రతి దానిపై చమత్కార పద్యాలల్లగల ధీమంతులు.
ఆద్యుడున్న యప్పు డందరు పూజ్యులే
లెక్క మీద [...]
గ్యాస్ కొట్టండి
వేసవి సెలవులు. పిల్లలందరూ అందరి ఇళ్ళలో గోల గోల చేస్తున్నారు. ఓ రోజు మా కాలనీలో ఒక విచిత్రమైన పోటి పెట్టారు. ఒక ఖాళీ గ్యాస్ సిలిండరు తెచ్చి పెట్టి అందరిని తాము కోసిన కోతలుగానీ,చెప్పిన అబద్ధాలు , బడాయిలు, కొట్టిన గ్యాసు కాని చెప్పమన్నారు. ఇది విచిత్రమైన సిలిండరట. ఇలా చెప్పిన గ్యాసుతో మెల్లిగా నిండుతుందంట. ఎవరైతే ఎక్కువ, అదరగొట్టే గ్యాస్ కొడతారో,లేదా కోతలు కోస్తారో వారికే ఈ సిలిండరు ఇవ్వబడుతుంది. అది ఖాళీ అయ్యాక [...]
Read Full Post | Make a Comment ( None so far )

