శ్రీధర్ సంపాదకీయాలు

బరువుగా చేస్తే భారమే మరి..

Posted on నవంబరు 2, 2007. Filed under: శ్రీధర్ సంపాదకీయాలు |

అనునిత్యం మనం అనేక పనుల్ని చేస్తుంటాం.. వాటిలో కొన్ని పనుల్ని చేసేటప్పుడు చాలా ఆనందాన్ని పొందుతుంటాం, కొన్నింటిని విధిలేక ఈసురోమంటూ ఎలాగో పూర్తి చేస్తాం. నచ్చని పనుల్ని చేసేటప్పుడు శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో వత్తిడికి లోనవుతుంటాం…. ఆనందంగా చేసే పనులు మాత్రం అప్పుడే పూర్తయిందా అన్నంత హుషారుతో నిర్వర్తించడం జరుగుతుంది. ఒకే పని, ఇలా వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలను ఎందుకు మిగుల్చుతోంది అన్నది ఆ పనిని వారు స్వీకరించే మానసిక స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. [...]

Read Full Post | Make a Comment ( None so far )

మానసిక కాలుష్యం..

Posted on అక్టోబర్ 29, 2007. Filed under: శ్రీధర్ సంపాదకీయాలు |

 తుఫాను సమయంలో కారుమేఘాలు వడివడిగా పరుగిడే మాదిరిగా నాభి నుండి ఉద్భవించే మన ఆలోచనా తరంగాలు మనసు పొరలపై కామక్రోధాదులనే అరిషడ్వర్గాలను వర్షిస్తూ సాగిపోతుంటాయి. ప్రతీ ఆలోచన మనసుపై తనదైన ముద్ర మిగుల్చుతూ పోతుంది. ప్రస్తుతపు ఆలోచన కన్నా బలీయమైన, మనసుకు ఇంపైన అలోచన ప్రస్తుతపు ఆలోచనని హరించి మనసులో తాత్కాలికంగా ఆవరించుకుంటుంది. మన ఆలోచనలు మంచివైనా, చెడ్డవైనా మన బుద్ధిని అనుసరించే అవి నిర్ధిష్ట రూపం సంతరించుకుంటాయి. ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఆలోచనాలను మాత్రమే మనసు [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

నవ్వుల కరువు

Posted on అక్టోబర్ 23, 2007. Filed under: శ్రీధర్ సంపాదకీయాలు |

                             
దురదృష్టవశాత్తు గంభీరంగా ఉండడమే పెద్దరికం అన్న అపోహ సమాజంలో పాతుకుపోయింది. అందుకే చాలామంది వివిధ సందర్భాల్లో అవసరం లేకపోయినా కష్టపడి మరీ మేకపోతు గాంభీర్యాన్ని , కప్పుకుని తామెంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు ఫోజులు ఇస్తుంటారు. నిజమే…. గాంభీర్యం మన వ్యక్తిత్వాన్ని ఇనుమడింపచేస్తుంది. అవసరం అయిన సంధర్భాల్లో అధికప్రసంగం లేకుండా గంభీరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం కూడా!  అయితే దానిని ప్రదర్సించవలసింది కొద్ది సందర్భాల్లో మాత్రమే . అంతే తప్ప, ఏవో కొంపలు మునిగిపోయినట్లు కన్పించిన ప్రతీ [...]

Read Full Post | Make a Comment ( 7 so far )

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...