సాహిత్యం
తెలుగు కవుల హృదయాలలో పెల్లుబికిన గోదావరి…1
పుష్కరాల సమయంలో ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. రచన : సన్నిధానం నరసింహ శర్మ.
గోదావరి వంటి పరమ ప్రాకృతికమైన రస వస్తువుకంటే కవితా రచనకు మరొకటి తగి ఉంటుందా !.. గోదావరి గంగ కన్నా ప్రాచీనమైనది. అంతటి పవిత్రమైనది.
సుదీర్ఘ ప్రవాహ ప్రయాణాలు, కొండల స్నేహపరిమళాలు సంతరించుకోవడం , కలుపుగోలుతనంతో ఉపనదుల్ని విలీనం చేసుకోవడం, అటనట అటవీ ప్రాంతవిహారాలు బహుబాషల్ని ప్రతిధ్వనించడం, ఇలా గోదావరి దర్శనీయ కోణాలు ఎన్నో. బహు సంస్కృతుల అనుపానుల పరిణామాల ప్రత్యక్ష సాక్షి [...]


