హాస్యపుణుకులు
పుణుకులు…
1.
ఒకరోజు సుధాకర్ తన స్నేహితుడు కిరణ్ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి టీ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. చాలా సేపటినుండి సుధాకర్ గమనిస్తున్నాడు కిరణ్ ఇంట్లో ఒక ఎలుక
పిల్లిని అన్ని గదులలో తరుముతుంది.
అది చూసి ఆశ్చర్యపోయి అడిగాడు.”ఏరా! సాధారణంగా పిల్లి ఎలుకను తరుముతుంది కదా?
మరి ఇదేంటి? మీ ఇంట్లో అంతా రివర్స్ గా ఉంది.” .
దానికి కిరణ్ నింపాదిగా సమాధానమిచ్చాడు.” ఏం లేదురా! పిల్లిని నేను పెంచుకుంటున్నాను.
ఎలుకను మా ఆవిడ [...]
ఆరోగ్యమే మహాభాగ్యం…
లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజయ్. ఆ డాక్టర్ అదో టైపు.
సంజయ్ : సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?
డాక్టర్: ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే.
సం: వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
డా. ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?
సం: వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
డా: అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి [...]
గయ్యాళి సోమిదేవమ్మ….
అన్నం పెడితే అరిగిపోతుంది.
చీర పెడితే చిరిగిపోతుంది.
వాత పెడితే కలకాలం ఉంటుంది.
ఇది ఒక చమత్కారం . ఎలా వచ్చిందో చూద్దామా!!
ఒక ఊర్లోని అగ్రహారంలో ఒక సోమిదేవమ్మా ఉండేది. పరమ గయ్యాళి. ఎవరికీ పెట్టదు. రాక రాక ఎవరైనా వస్తే మాటలతో వాతలుపెడుతుంది. అందుకే ఆ ఊర్లోని ఆడాళ్లు ఆవిడ ఇంటికి వెళ్ళడానికి సాహసించరు. పిలిచి అన్నం పెట్టదు. చీర పెట్టదు. వాతలు మాత్రం పెడుతుంది అని పుకారు మాత్రం ప్రాకింది ఊరంతా. ఒకరోజు ఒకావిడ ధైర్యం చేసి ఈ [...]
ధైర్యం !!!!…
1. ఒక రోజు సింహం భోజనం చేసి తీరిగ్గా రేడియోలో పాటలు వింటు కూర్చుంది.
ఇంతలో ఒక ఎలుక వచ్చింది.
“ఏం కావాలి ?” అని సింహం అడిగింది.
“డార్లింగ్ ! నువ్వంటే నాకు చాలా ఇష్టం. లవ్ ఐంది. మనం పెళ్ళి
చేసుకుందామా?
“మనమిద్దరం పెళ్ళి చేసుకోవడమా?? ఒకసారి నీ శరీరం , నా శరీరం
చూసావా? పిచ్చిదానా!!”
” రాజా! ఇక్కడ శరీరం ముఖ్యం కాదు. మనసు, ప్రేమను గెలిపించుకునే
ధైర్యం ఉండాలి. అది [...]
మరో మతం
ప్రతి మనిషి తన మతం నుండి ఇంకో మతంలోకి కనీసం ఒక్కసారైనా
తప్పకుండా వెళతాడు . వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు… ..
ఏంటా మతం???
« Previous Entries


