general
రాజాధిరాజ భూపతిరాజా….
మన తెలుగు బ్లాగ్లోక ఆస్థాన విదూషకుడు మన నవ్వుల విహారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు….
మనకందరికీ నవ్వులు పంచే విహారి ఆరు రోజుల క్రింద పుట్టిన రోజు జరుపుకున్నాడని ఇవాళే తెలిసింది. ఇది నిజమైతే మనమందరం కలసి అతనికి శుభాకాంక్షలు అందజేద్దాం…
విహారి నువ్వు ఇలాగే ఎప్పటికీ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.
Read Full Post | Make a Comment ( 4 so far )
జన్మదిన శుభాకాంక్షలు
ప్రవీణ్ గార్లపాటికి జన్మదిన శుభాకాంక్షలు
శనివారం 30..06..07
ఘల్లు ఘల్లు సెల్లు….
ఈ హైటెక్ యుగంలో…
’సెల్’ ఈజ్ మోస్ట్ పవర్‍ఫుల్లు
వితౌట్ సెల్, లైఫే నిల్లు
ఎంతటివారైనా సెల్లుకు మోకరిల్లు
గుప్పెడు సెల్లు
ఇస్తుంది బోలెడు థ్రిల్లు
బిల్లు వచ్చాక గుండె జల్లు
సెల్లు చేతిలో ఉంటే చాలు
తిరిగినట్టే తెలీదు గడియారపు ముల్లు
’బోరు’ అనే మాటకిక చెల్లు
రింగ్‍టోన్‍తో సంగీతాన్ని సైతం వెదజల్లు
మితిమీరి వాడితే మాత్రం…
అతిగా వస్తుంది బిల్లు
జేబుకు పడుతుంది చిల్లు
దాంతో తిరుగుతాయి కళ్ళు
అందుకే ఆచీ తూచీ వాడాలి సెల్లు
వాడేటప్పుడు దగ్గరుండాలి ఒళ్ళు..
ఆదాబర్సే…..
ఇది హైదరబాదీయుల మధురమైన భాష. వినడానికి తికమకగా ఉన్నా ఎంతో ఆత్మీయంగా ఉంటుంది. ఇందులో హిందీ , ఉర్దూ కలగలసి ఉంటుంది…
యహీచ్ హై : ( ఇక్కడే ఉంది ). హైదరాబాదులో ముఖ్యంగా పాతబస్తీలో దారికోసం ఎవ్వరినడిగినా తెలీదు అనరు . యహీచ్ హై సీదా జాకే దాయే ముడ్‍నా( ఇక్కడే ఉంది. నేరుగా వెళ్ళి కుడివైపుకి తిరుగు) అని చెప్తారు . ఆ స్థలం కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే అది సందు మూలలోనే [...]
కప్ప వైద్యుడు
ఇది పాతికేళ్ళ క్రిందటి ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించబడింది. ఎవరు రాసారో తెలీదు మరి….
అనగనగా ఒక కప్ప
అది తానొక గొప్ప
వైద్యుడని భావించింది
వైద్యం చేస్తానని చాటించింది.
అడవికి వెళ్ళిందా కప్ప
అమాంతంగా ఒక గొప్ప
వైద్యుడైనట్టు తన మెప్పు
చాటింది (బెక బెకల డప్పు).
అరణ్యమృగాలీ చోద్యం
చూశాయి “సెబాస్, వైద్యం
చేసే తమాషా కప్ప
ఎక్కడా చూడలేదప్ప!”
అనుకున్నాయి జంతువులు పాపం.
“నిజంగా ఈ కప్పరూపం
ధరించిన వైద్యు“డని మృగాలు
నమ్మాయి కప్పగప్పాలు!
అయితే ఒక నక్క మాత్రం
’కప్పేమిటి? వైద్యమేమిటి?’ చిత్రం
ఇందులో ఎదో మోసం
ఉండాలి ముప్పాతిక మువ్వీసం!’
అనుకుని వెళ్ళింది కప్ప
దగ్గరికి నక్క ఒక పెంటకుప్ప
కన్నా అసహ్యంగా ఉన్న
ఈ [...]
« Previous Entries


