వాహ్ తాజ్ !!!!….

              
ఈ తాజ్‍మహల్ గొడవేంటి బాబు!! ఎస్.ఎమ్.ఎస్ లు చేయమంటారు. ఫోన్లు చేయమంటారు..అసలు ప్రపంచంలో ఏడు వింతలే ఎందుకు? ఎక్కువ ఉండకూడదా?. కొత్త కొత్త వింతలు ఎన్నో పుట్టుకొస్తుంటాయి.. మన తాజ్‍మహల్‍ను ఆ వింతలలో నిలబెట్టడానికి ఇంత బలవంత తాపత్రయం ఏంటంట. రేడియోలలో,టీ.వీ ప్రోగ్రాములలో ఇప్పటికే ఎస్.ఎమ్.ఎస్ ల గోలతో తల వాచిపోతుంది. ఇప్పుడు ఈ తాజ్‍మహల్ కోసం..
 
 
అసలు తాజ్‍మహల్ ఆ ఏడు వింతలలో లేకపోతే మునిగిపోయేది ఏంటంట? వింత కాకుంటే జనం తాజ్ ను చూడటానికి [...]

వానా వానా వల్లప్పా!!!!!

ఈ వానని చూస్తుంటే మీకేమనిపిస్తుంది??????????

సందడి

బ్లాగు గుంపులో బ్లాగులగురించి మాత్రమే మాట్లాడాలి.సాహిత్యం గుంపులో సాహిత్యమ్ గురించి మాత్రమే చర్చలు. మరి మిగతా విషయాలు మాట్లాడుకోవాలి , చర్చించుకోవాలి అంటే ఎలా??? దాని కోసమే  ఉంది సందడి గుంపు..ఇందులో సినిమాలు, పాటలు, అంత్యాక్షరి, పుట్టినరోజు శుభాకాంక్షలు, సరదా ఆటలు  ఎదైనా పంపండి, చర్చించండి. కాని చెత్త మెయిల్స్, అసభ్యమైనవి కాదు. ప్రకటనలు ఇవ్వరాదు. కాని ఒక్క విషయం మీరు పంపే మెయిల్స్ అన్నీ తెలుగులోనే ఉండాలి. మీదగ్గర ఇంగ్లీషులో ఉంటే తెలుగులో మార్చి పంపండి.
 రండి మరి సందడి [...]

తండ్రికో నమస్కారం

dad.pps 

తండ్రుల దినోత్సవం సంధర్భంగా చిన్న సమర్పణ…..

 
 
 
పిల్లల పెంపకంపై  Spenser Johnson రాసిన బెస్ట్ సెల్లర్ The One Minute Father లోని కొన్ని విషయాలివి.
తండ్రిగా మారిన , మారబోయే ప్రతి వ్యక్తి తెలుసుకోవలసినవి.
 
1.  తండ్రిగా మీ పిల్లల్ని నిరంతరం సంరక్షించదలచుకున్నారా? పిల్లలు తమని తాము
     సంరక్షించుకునేలా  పెంచదలచుకున్నారా?
 
2.  పిల్లవాడు తమకు అనుగుణంగా ప్రవర్తించడమే క్రమశిక్షణ అని చాలామంది తల్లితండ్రులు
     అనుకుంటారు.  కాని ఇది  తప్పు.  మీరు క్రమశిక్షణ అని దేన్ని భావిస్తారో అది తమకు [...]

అన్నా. ఓ! చికెన్ గున్యా!!!!

మళ్ళీ పొంచి ఉన్న చికెన్ గున్యా
ఈ రోజు ఈనాడులో ఈ వార్త చదవగానే గత సంవత్సరం ఈ వ్యాధితో నేను, మా ఇంట్లో వారు, తెలిసినవారు అందరూ పడిన కష్టాలు మళ్ళీ గుర్తొచ్చాయి…పోయినేడాది ఆ వ్యాధి బారిన పడినప్పుడు రాసుకున్న కవిత…మీరైనా జాగ్రత్త పడండి.
 
 
దోమతో వచ్చావు గున్నలా పెరిగావు
గున్యాలా మారావు
మనుష్యుల్ని నుజ్జు నుజ్జు చేసావు
ఎముకల గుజ్జంతా తిన్నావు.
 
 
కాళ్ళు తిన్నావు కీళ్ళు తిన్నావు
మొకాళ్ళు కూడా తిన్నావు
కోడిపేరు పెట్టుకున్నావు
వాటికే మచ్చ తెచ్చావ్ .
 
జ్వరమంటూ మొదలెట్టి
దవాఖానా కీడుస్తావ్
పిల్లల్ని తల్లుల్ని [...]