నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఆనందోబ్రహ్మ

“సిరిమల్లెపువ్వల్లె నవ్వు… చిన్నారి పాపల్లె నవ్వు..” అంటూ ఎన్ని రకాలుగా బతిమాలుకున్నా నవ్వొచ్చినప్పుడే నవ్వుతాడే గాని ఊరకూరకే ఉత్త నవ్వులు ఎవ్వరూ నవ్వరు. ‘నవ్వూ అని మనమందరం పిలుచుకునే ఆహ్లాదకరమైన భావం వదనాన్ని వెలిగించాలంటే మనసు సంతోషంగా ఉండాలి. ఎన్ని జోకులు పేల్చినా డిప్రెషన్లో మునిగి ఉన్న వ్యక్తి నుంచి చిరునవ్వు కూడా రాబట్టలేం. కావట్టి దరహాసానికైనా వికట్టట్టహాసానికైనా మూలకారణం మానసికానందమేనన్నది నిశ్చయం.

“ధనమేరా అన్నిటికి మూలం” అని పాడుకుంటూ ఆనందించేవాళ్ళు తమ ఆనందాన్ని పక్కన పెట్టి కాసేపు విచారించాల్సిన తరుణం ఆసన్నమైంది. కనీసావసారాలు తీర్చుకోగలిగి కాస్త సౌకర్యవంతమైన జీవితం గడిపేంతవరకూ మాత్రమే సంపాదన పూర్ణానందాన్ని ఇవ్వగలదు.అబ్దుల్ కలాం లాగానో ఐన్ స్టీన్ లాగానో అపరిమిత ప్రతిభాపాతవాలు కలిగినవారంతా ఆనందగానే ఉంటున్నారా అంటే లేదనే సమాధానమే వస్తుంది. ఆశల్ని నెరవేర్చుకోలేకపోతున్నామనే బాధ వీరీని అనుక్షణం కుంగదీస్తు ఉంటుంది.

ప్రపంచంలో అన్ని బాధలకూ ఆశలు, కొరికలే మూలకారణాలని గౌతమ బుద్దుడు చెప్పింది అక్షరాలా నిజమనుకోవచ్చు. ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడూ తెలుసుకోవడానికి అతను రోజుకు ఎన్నిసార్లు మనస్పూర్తిగా నవ్వుతున్నాడో లెక్క వేస్తే సరిపోతుంది. ఒంతరిగా ఉన్నప్పటికంటే జనంలో ఉన్నప్పుడు మనం 30 రెట్లు ఎక్కువగా నవ్వుతామట.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆడవాళ్ళు మగవాళ్ళకంటే ఎక్కువసారులు నవ్వుతారట. మనసు దోచుకున్న మగువను నవ్వించడానికి మగవళ్ళు నానా తంటా పడితే, తాము మెచ్చిన మరుడి సన్నిధిలో అతివలు అధికంగా నవ్వులు కురిపిస్తారట. తమమీద తామే జోకులు వేసుకుని నవ్వుకోగలిగేవాళ్ళకు ఆత్మవిశ్వాసం అత్యధిక స్తాయిలో ఉంటుందంట. తమ మీద ఇతరులు పేల్చే జోకుల్ని తట్టుకోలేని వళ్ళు ఆత్మ న్యూనతతో బాధపడుతున్నట్టే లెక్క.

పెళ్ళి పేరు చెబితె స్వేచ్చా స్వాతంత్ర్యాలకు తిలోదకాలివ్వాల్సివస్తుందేమో అని భయపడేవాల్లంతా ఇక హ్యాపీగా సప్తపదికి సై అనవచ్చు. పెళ్ళి తర్వాత కొద్దోగొప్పో ఆనందం పెరుగుతుందే తప్ప తగ్గదని పరిశోధకులు అంటున్నారు.

చేసే ఉద్యోగం కూడా ఓ వ్యక్తి ఆనందాన్ని నిర్ణయించే అంశాలోకే వస్తుంది.స్వేచ్చ నిర్ణయాదికారం ఎక్కువగా ఉన్న భాధ్యతలను నిర్వర్తించే ఉద్యోగులు మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి.మొత్తంగా చూస్తే ఉద్యోగాలు చేసేవాళ్ళకంటే స్వయం ఉపాధి మీద ఆధారపడి బతికే వళ్ళే ‘జీవితమే మధురమూ’ అని పాడుకుంటూ ఎక్కువ హాయిగా గడపగలరట. ఉద్యోగం చేసేవారికంటే ఎక్కువ పని చేస్తు వారికంటే తక్కువ సంపాదించినా ఆలస్యంగా రిటైరైనా సంతోషంలో మాత్రం వీరు ఒక అడుగు ముందే ఉంటారంట.

ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మహిళలకు సమస్యలెక్కువ. అణచివేత, స్వాతంత్ర్యలేమి, అనారోగ్యం వంటి సమస్యల్ని ఎదుర్కుంటూనే మొత్తం మీద వనితలే మగవాళ్ళకంటె ఆనందంగ ఉన్నారంటా. ఇరవై నాలుగు గంటలూ టీవీకే అతుక్కుపోయి గడిపేవాళ్ళు శోకదేవతలకు ప్రతిరూపాలంట. మితంగా రోజుకు ఒకటో రెండో పెగ్గులు బిగించే మగరాయుళ్ళు మిగతా వారికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారంటా.

మొత్తంగా చూస్తే ఇతరులతో కలివిడిగా ఉందే మనస్తత్వం, ఆత్మ విశ్వాసం,ఆశావాదం, సర్దుకుపోయే స్వభావం, పరిస్తితులు మన నియంత్రణలో ఉన్నాయన్న భావన, కోరికలకు పరిమితి లాంటి సద్గుణాలు ఉంటే ఆనందకరమైన వాతావరణం మన చుట్టూ పరిభ్రమిస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. ఇంతకీ మీరు ఏమాత్రం ఆనందంగా ఉన్నారు?

ప్రకటనలు

Comments on: "ఆనందోబ్రహ్మ" (7)

 1. బాగా గుర్తుచేశారు. థ్యాంక్స్.

 2. ఎంత బాగా రాశారు? రాసింది జ్యొతేనా అన్న అనుమానం వచ్చేంత బాగా? ఇలాగే రాస్తూ ఉండండి. మంచి బ్లాగరిత అవుతారు. మీనుంచి మరిన్ని టపాలు రావాలని ఆశిస్తూ…

 3. “బ్లాగరిత” అంటూ మళ్ళీ బాషా వివాదానికి తెర తీస్తున్నారు. ఆడైనా, మగైనా “బ్లాగరి” అని నిర్ణయించేశాం కదా! 🙂

  –ప్రసాద్
  http://charasala.com/blog/

 4. జ్యొతి గారూ,

  “మొత్తంగా చూస్తే ఇతరులతో కలివిడిగా ఉందే మనస్తత్వం, ఆత్మ విశ్వాసం,ఆశావాదం, సర్దుకుపోయే స్వభావం, పరిస్తితులు మన నియంత్రణలో ఉన్నాయన్న భావన, కోరికలకు పరిమితి లాంటి సద్గుణాలు ఉంటే ఆనందకరమైన వాతావరణం మన చుట్టూ పరిభ్రమిస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు.”

  చాల చక్కగా చెప్పారు. ఈ విషయం లో ఎవరైన అంగీకరించక పోతే…ఆ మాట వచ్చే పరిస్థితే లేదు.

  “ఇంతకీ మీరు ఏమాత్రం ఆనందంగా ఉన్నారు? ”

  చెప్పాలంటే చాంతాడంత…

 5. జ్యోతి గారూ, మీ బ్లాగు రూపును మార్చండి. అప్పుడు నేను మీ టపా చదివి ఆనందిస్తాను

 6. జ్యోతి గారూ,
  చాలా బాగా వ్రాశారండి, మీ తెలుగు చాలా బాగుంది. మీనుంచి మరిన్ని టపాలకోసం చూస్తాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: