నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

తి తి తి తి తికమకలు

మా నాన్న పేరు                                      చలపతి

ఆయన పదేకరాలకు                               అధిపతి

మా అమ్మ పేరు                                     వసుమతి

ఆమె ఎంతో                                            సహనవతి

మా పెద్దక్క పేరు                                    సుమతి

ఆమె చాలా                                           సుగుణవతి

ప్రస్తుతం ఆమె                                      గర్భవతి

మా బావ పేరు                                    జగపతి

అతను వట్టి                                       మందమతి

మా రెండో అక్క పేరు                         మధుమతి

చూడచక్కని                                     రూపవతి

ఇంకా పెళ్ళీ కాని                               శీలవతి

మా పెద్దన్నయ్య పేరు                       వెంకటపతి

ఎప్పుడు అతడికి                               గుండే గతి

ఎందుకంటే ఎప్పుడూ వెళ్తుంటాడు      తిరుపతి

ఆయనే చూస్తాడు మా పొలాల          అతీగతి

మా రెండో అన్నయ్య పేరు                 కాశీపతి

ఊళ్ళో ఇతనికి చాలా                        పరపతి

ఎందుకంటే అతని వృత్తి                    హొమియోపతి

ఇంతకీ చెప్పలేదు కదూ నా పేరు     జ్యొతి

నేను చదివేది   పదిహేనో                 తరగతి

నా మాటలతో పోయిందా                మీ మతి

అసలు విషయం చెప్పనా
ఒక్కటి కోసుకోనా మీ చెట్టుకున్న    చామంతి

Comments on: "అక్షరాలతో అల్లరి" (8)

  1. మీ అల్లరి చాలా బాగుంది జ్యోతి గారు.

  2. చాలా బాగుంది జ్యోతి

    అందుకే అందుకోండి నా బహుమతి

    ఓ వాసంతి

    తి తి తి తి తికమకతో పోగొట్టారండీ నా మతి

    ఒక్క చామంతి ఏంటి?

    కోసుకోండి పూబంతి

    నేవెళ్ళి చేయించుకొస్తా నా మతికి మరమ్మతి

    ఎవరవుతారో గానీ మీ పతి జాగ్రత్త సుమతీ!

    సరదాకి వాసుగాడు

  3. మీ అల్లరి / పదవల్లరి బాగానే వుంది కాని, రెండో అక్కయ్య అంటూ “ఇంకా పెళ్ళీ కాని – శీలవతి” అనటము మాత్రము ఎమీ బాగాలేదు. నిర్మొహమాటం గా చెప్పినందుకు ఏమి అనుకొవద్దు.

  4. జ్యోతీ
    సౌభాగ్యవతీ
    పోలేదు గానీ మా మతి
    వచ్చింది మరింత నవ్వుల కాంతి
    తీసుకోండి అభినందన చామంతి
    –ప్రసాద్
    http://blog.charasala.com

  5. మాకో చెట్టునే (మీ వంశ వృక్షాన్ని) ఇచ్చి, మీరు అడిగింది కేవలం ఒక పువ్వునా!!

  6. హా పదిహేనో తరగతి చదువుతున్నారని చెప్పకనే చెప్పారుగా.

  7. హ హ నాది కుడా మీ లాంటి అబి ప్రాయమె జొతి గారు.. ఈ జీవితం చాలా చిన్నది, ఒక 60 లెక 70సం!! రాల విహర యాత్ర లాంటిది అని నా అబిప్రాయం, సొ ఆనందంగా అందరితొ గడపాలి, ఉండాలి. మీ అల్లరి ఇలాగె సాగించండి…
    దిలీప్.

Leave a reply to చదువరి స్పందనను రద్దుచేయి