నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఏ పుర్రెకు పుట్టిన బుద్దో గానీ, బీడీల కట్టల మీద పుర్రె బొమ్మ

ఆలోచన ఇప్పుడు రాజకీయ పార్టీలకి చలీ జ్వరం తెచ్చేసింది.

ముగ్గేసి, దాని మీద క్షుద్రపూజల కోసం పెట్టిన పుర్రెను చూసి

అంతా బెదిరిపోయినట్టు, జడుసుకున్నట్టు బీడీ కట్టల మీద

కపాలం బొమ్మ ఆలోచనకు కరీం నగర్ ఉప ఎన్నికల ముగ్గులోకి

దిగిన నేతలంతా వణికి పోతున్నారు. ఆ భయం ఖరీదు

అక్షరాలా రెండు లక్షల ఓట్లు మరి!  అయితే ఆ కపాలానికి,

ఇప్పుడు ఎన్నికల ముగ్గులోకి దిగిన నాలుగు ప్రధాన పార్టీలకి

ఎదో ఒక రకంగా చుట్టరికం ఉంది. కపాల మోక్షానికి మీరంటే

మీరని ప్రతి పార్టీ ఎదుటి పార్టీని ముందుకు తోస్తున్నాయి.

కలికి కామాక్షి కథలో “నేనెరుగ… నేనెరుగ… మీ మామనడుగు”

 అన్నట్టు బీడీ కట్టల మీద పుర్రెను చిత్రించి పొగరాయుల్లను

భయపెట్టాలన్న నిర్ణయం మాది కాదు మాది కాదని ప్రతివారూ

 పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.ఇదే ఇప్పుడు కరీం నగర్

 ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణ.
“చూడండి పొగ తాగడం వల్ల కేన్సర్ వస్తుందంట. ఊపిరి తిత్తులు

 చెడిపోతాయంట చూశారా పేపర్లో రాశారు.” అంది భార్యామణి.

“అందుకే మానేసా” అన్నడా మొగుడు మహాశయుడు.”ఏమిటీ

 పొగ తాగడమే” ఆశ్చర్యంగా అడిగిండి ఆ ఇల్లాలు. “కాదు

 పేపర్ చదవడం”.అని ఆ  మొగుదుగారు నిదానంగా చెప్పారు. 

పుర్రె మార్కు వల్ల వీడీలు తాగడం ఆగిపోతుందా? ఎలాంటి

శషభిషలు లేకుండా చెప్పవచ్చు. ఆగిపోదు. కాని అలాటి తీవ్ర

ప్రచారం వల్ల తమ పరిశ్రమకు కొంత నష్టం జరుగుతుందని

బీడీ కార్మికుల భావన కావచ్చు.  దేశంలో ఎన్నో ప్రమాదకర

వస్తువులు ఉండగా బీడీలపైనే పుర్రె గుర్తు ఎందుకు వెయాలి 

 అంటున్నారు వాళ్ళు. సిగరెట్లపై కూడా అలానే ముద్రించొచ్చుగా.

అందుకే మన ప్రజానాయకులు ఓట్ల మీది ప్రేమతో పుర్రె గుర్తును

 మొత్తం తీసేయకున్నా కాస్త చిన్నగా వేస్తామంటున్నారు.మద్యం

మీద వచ్చే ఆదాయంతో నడుస్తున్న ప్రభుత్వాలు దానిని

నిషేధించడానికి సాహసించవు. మాఫియాల చేతిలో ఉన్న మత్తు

మందుల రవాణా గురించి సర్కార్లకు అసలే పట్టదు. కొన్ని రాష్ట్రాలైతె

 వ్యభిచారానికి లైసెన్సులు కూడా ఇస్తున్నాయి.సిగరెట్లు కూడా

బీడీతో సమానమే కాని వాటిమీద పుర్రె మార్కు ఎందుకు

వేయడంలేదు. అయినా దేశంలో ఇంకా ఈ మార్కును

 తగిలించడానికి అర్హమైనవి ఎన్నో ఉన్నాయి. ఈ సంగతి రాజకీయ

 పార్టీలు కూడా ఆలోచించాలి.

ప్రకటనలు

Comments on: "కపాలమోక్షం ఎవరికో" (1)

  1. nijamea avasaram leani vaatike raddamtam ekkuva ceastaru manavaallu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: