నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

Blush
ఈ సంవత్సరం 2006 నాకు చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులనుండి మామూలు గృహిణి లా వంట, పిల్లల చదువులు, ఖాళీ దొరికితే టి వీ లో చెత్త సీరియల్స్ చూడటం,ఇలా రోజులు గడిచిపోయేవి. అసలు నాకు ఏం చేయాలనే ఆలోచనే లెకుండా కాలం వెల్లబుచ్చాను.  ఇంతకంటే ఎమి చేయాలి వేరే పనేముంది అనుకునేదాన్ని. కాని అనుకోకుండా ఈ తెలుగు సమూహముల గురించి తెలుసుకుని బ్లాగు సమూహంలో చేరాను అసలదేంటో తెలీకుండానే. నాకు మొదటినుందీ సరదాగా ఉండటం, తెలుగు అంటే ఇష్టం,ఇంకా పాటలంటే ప్రాణం, వంటల గురించి తెలుసుకోవడాం అంటె ఆసక్తి. బ్లాగు అంటే ఎంటో అస్సలు తెలీదు. కాని కొందరు బ్లాగు మిత్రులు నన్ను ప్రోత్సహించి ఈ బ్లాగు మొదలుపెట్టేలా చేసారు. అలా అలా నా ఆసక్తి, అన్వేషణ మొదలై ఒకటి ఒకటి అనుకుంటూ మొత్తం నాలుగు విభిన్న బ్లాగులు మొదలుపెట్టి విజయవంతురాలను ఐనాను అనుకుంటున్నాను.

ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది నేనేనా ఇలా చేయగలిగింది అని. నాలో ఉన్న అభిరుచులు నాకే తెలీకుండా ఇలా బ్లాగుల రూపంలో బయటకొచ్చాయి. ఇప్పుడు నాకు పూర్తి సంతృప్తిగా ఉంది ఇలా నా వంటల బ్లాగు వల్ల కొందరికైనా ఉపయోగం కలుగుతున్నందుకు. ఇంకా నా సరదా బ్లాగుతో కనీసం మందహాసం తెప్పిస్తున్నందుకు. నన్ను ప్రోత్సహించి అన్నివిధాలా నాకు సహకరిస్తున్న బ్లాగుమిత్రులందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.   

ప్రకటనలు

Comments on: "" (2)

  1. మీ బ్లాగు కొత్త సంవత్సరంలో మరిన్ని వంటలతో మరిన్ని సరదాలతో నిండాలని ఆశిస్తూ…
    –ప్రసాద్
    http:blog.charasala.com

  2. good to know about your progress in 2006 year.wish you the same in this new year also. All the best. keep writing more and more…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: