నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మాటకు పాట

విన్నారా విన్నారా ఈ వింతను విన్నారా (సంబరాల రాంబాబు)
‘కౌగలించుకుందాం రా’ సీరియల్ చూడొద్దాన్నడాని మా పక్కింటి బామ్మగారు వాళ్ళాయనపై   ‘గృహహింస ‘ కేసు పెట్టందంట.
దీపాలు వెలిగే (పునర్జన్మ)
అమ్మయ్య ! ఈ వీధిలో ఆ చిన్నప్పుడెప్పుడో వెలగడం మానేసిన వీధి దీపాలు ఇన్నేళ్ళకు మళ్ళీ వెలిగాయి.

ఇదేనా! మన సంప్రదాయమిదేనా ? (వరకట్నం)
పనీపాటా మానేసి, రేయింబవళ్ళు పోసుకోలు ‘సీరియల్శ్ చూస్తూ కూర్చోడమేనా?

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ (అంతులేని కథ)
లేకపోతే చెత్తాచెదారం ఎక్కడ పారబోసేది?

మానవుడే మహనీయుడు (బాలభారతం)
అందితే ఆకాశాన్ని కూడాఅ కబ్జా చేసి పారేస్తాడు.

నీవు రావు నిదురరాదు (పూలరంగడు)
పోనీ నిద్ర మాత్రలు మింగుదమంటే అవీ సరిగ్గా దొరికి చావడం లేదు.

గోదారీ గట్టుంది (మూగమనసులు)
కబ్జా చేసేందుకు భలే వీలుంటుంది

ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే ( మంచివాడు)
ఎంచక్కా పైసా ఖర్చుండదు.
 
తెలుగుజాతి మనదీ  (తల్లా పెళ్ళామా)
తెలుగులో మాట్లాడడానికి మాత్రం నామోషీ.

జన్మమెత్తితిరా అనుభవించితిరా (గుడిగంటలు)
ఇంక చస్తే మనిషి జన్మ ఎత్తను.

పదే పదే పాడుతున్నా పాడిన పాటే (సీతామాలక్ష్మి)
ఒకేపాట లక్షసార్లు పాడి గిన్నీస్ బుక్లో ఎక్కుదామని 

ప్రకటనలు

Comments on: "మాటకు పాట" (2)

  1. మీకు చమత్కారం బాగానండి…యింతకు ముందు కూడా మీరు రాసిన పోస్టులు చాలా చూసా…బాగా నవ్విస్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: