నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

                                     సంక్రాంతి వచ్చెనమ్మ సరదాల సంక్రాంతి
                                     సంతోషమిచ్చెనమ్మ జగతిలో కొత్త కాంతి 

తెల్లారేసరికి నేలనిండుగా ముగ్గులు ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటే ‘పెద్ద పండుగ ‘

వస్తుందన్నమాటే. నిద్ర లేస్తున్నవేళ హరినామ కీర్లన హరిదాసు కంఠం

 వినిపిస్తుందంటే ‘ మకరసంక్రమణ పర్వదినం ‘ దగ్గర్లో ఉందన్నమాటే.
రాళ్ళూ రప్పలూ లేకుండా పేడతో ఓ పద్దతిలో  అలకబడిన నేల, మేఘాలు

లేకుండా స్వచ్చంగా ఉన్న ఆకాశానికి సంకేతం. ఓ చక్కని పద్ధతిలో పెట్టబడిన

చుక్కలు ఆకాశంలో రాత్రివేళ కనిపించే నక్షత్రాలకి సంకేతం.ఈ చుక్కల చుట్టూ

 తిరుగుతూ చుక్కలను భద్రంగా గళ్ళలో ఇమిడ్చిన ఆ ముగ్గు ఖగోళంలో

ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకి సంకేతం.

ఎంత పెద్దదైనా, చిన్నదైనాగాని ఆ ముగ్గుకి ఎటు చూసినా మధ్యగా కనిపించే చుక్క

వున్న గడి సూర్యస్థానానికి సంకేతం సూర్యుడు కూడా ఓ పెద్ద చుక్కే (నక్షత్రమే) అని

 చెబుతుందనటానికి సంకేతం. ఇక తెల్లవారుఝామున లేచి నడుంవంచి ముగ్గుల్ని

 వేస్తుండ వల్ల శరీర వ్యాయామ ఫలితం లభించడమే కాక రేపటి రోజున ఎవరు ఏ

ముగ్గుని వేయబోతారా అనే ఒక ఎదురుచూపుగా, గొప్పగా వెయ్యాలనే పట్టుదలా,

ఈ కారణంగా ఓ ఆనందం..ఇవన్నీ ఓ జ్ఞాపికలుగా జీవితాంతం గుర్తుండిపోతాయి.

గొబ్బెమ్మలు

పెద్ద వయసు స్త్రీలు ముగ్గుల్ని పెడితే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసిపెట్టే

గుండ్రని ముద్దలు కృష్ణుని భక్తురాండ్రైన గోపికలకి సంకేతం. ఆ గొపికస్త్రీల రూపాలకి

సంకేతమే ఈ గోపి+బొమ్మలు=గొబ్బెమ్మలు చుట్టూ గుండ్రంగా వున్న గొబ్బెమ్మల

 మధ్య వున్న పెద్ద గొబ్బెమ్మ, గోదాదేవికి సంకేతం. ప్రతిరోజు వీటి చుట్టూ తిరుగుతూ

 పాటలు పాడుతూ నృత్యం చేస్తుండే బాలికలంతా తమకి కూడా కృష్ణభక్తి కలగాలని

 ప్రార్థిస్తున్న భక్తురాండ్రకి  సంకేతం.ఇందరు భక్తిభావంతో ప్రదక్షిణం చేస్తున్న ఆ

ప్రదేశమంతా నిజానికి మన ఇంటి ముంగిలి భాగమే అయినా బృ0దావనానికి సంకేతం.

హరిదాసు

ఇప్పటికి మన ఇంటి ముంగిలి భాగం ఆకాశం అయింది. కృష్ణ భక్తురాళ్ళతో

బృందావనం అయింది. ఈ దశలో ‘ కృష్ణస్తు భగవాన్ స్వయం ‘ సాక్షాత్తు కృష్ణుడే

శ్రీహరిరూపంలో మనింటికి రావాల్సివుంది.అతడే.. హరిదాసు రూపంలో  ఆయన

 తలమీద వున్న మంచి గుమ్మడికాయ ఆకారంలో వున్న గిన్నె, గుండ్రంగా

వున్న భూమికి సంకేటం దాన్ని తలమీదే పెట్టుకుని వుండడాం గుండ్రంగా వున్న

 భూమికి సంకేతం. శ్రీహరి అయిన తానే ఈ భూమిని ఉద్దరిస్తున్నానని

(ఉత్+ధరించు= తలమెద పెట్టుకుని ఉండడాం )చెప్పడాఅనికి భూభారాన్ని

 మోస్తున్నానని చెప్తుండడానికి సంకేతం. హరినామ సంకీర్తన చేస్తూ రావడ0,

తాను ఎంత ధనమిచ్చినా వచ్చేవదిని కానని నామస్మరణకి లొంగిపోయి వచ్చే

వాదినేనని చెప్పడానికి సంకేతం.ఆయన తలమీద భూమిలో మనం వేసే ధాన్యం

లేదా బియ్యం అనేవి భూమిలో వేయబడే విత్తనాలకి సంకేతం. ఆయన మెడలో

వున్న పూమాల శ్రీహరి మెడలోని వనమాలకి సంకేతం.

శివ కేశవులకు భేధం లేదని సూచిస్తూ, మన దగ్గరికొస్తుంది గంగిరెద్దూ, ఆ ముందు

వెనుకల చెరో ప్రమధునితో.ఆ ఎద్దు నడుం ముందు భాగంలోని ఎత్తైన మూపురం

అచ్చం శివలింగాకృతిలో కంపిస్తూ, శివుడు తన నంది వాహనమ్మీద వచ్చాడనేంధుకు

 సంకేతం. సంబత్సరం పాటు శ్రమించగా వచ్చిన్న ధాన్యాన్ని మన ఇంటికి చేర్చి

నందుకు మనం ఆనందంతో కప్పే వస్త్రం ఎప్పటికప్పుడు ధరిస్తూ విడిచివేస్తున్న

ఈ శరీరానికి సంకేతం.మనకి భస్మాన్ని అందిస్తూ శంఖనాదాన్ని చేసే జంగందేవర

‘జీవికి చివరకు మిగిలేది కేవలం భస్మమే’ అని చేసే వేదాంత భోదకి సంకేతం.

బుడక్ బుడక్ అంటు ధ్వని చేసే డమరుకం – సుఖం, దుఖం అనే రెండు పార్ఘాల

మధ్య అటూ ఇటూ కొట్టుకుంటూ సుఖానికి పొంగుతూ, దుఃఖానికి  క్రుంగుతూ

 అంతలోనే జీవితాన్ని అంతం చేసుకునే క్షణకాలపు జీవివి నువ్వు కాబట్టి

సుఖదుఖాల కంటే దానం ధర్మం అనే పార్ఘ్యాల మధ్య జీవించడ0 సబబు అనే

ఉత్తమ బోధకి సంకేతం.

భోగిమంట

మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటిరోజున నాలుగు మార్గాల

కూడలిలో వేయబడే పెద్ద మంట- రేపటినుంచి ఇంతకంటే మరింత వేడిమితో మరో

 పెద్ద నిప్పుముద్దలా ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడని రోజురోజుకీ ఉష్ణతని

పెంచుకుంటూ సాగుతాడనీ చెప్పడానికి సంకేతం.

తిల తర్పణం

సంవత్సరంలో మిగిలిన రోజుల్లో నల్లనువ్వుల్ని వాడకూడదు. సంక్రాంతి పర్వదినం

నాడు మాత్రం ఏనాడో మరణించిన పితృదేవతలందరికీ ఈ నల్లనువ్వులతో తర్పణాల

నియ్యడం మరవకూడదు.  ఓ చుట్టం వస్తుంటే అతనికి మనం ఎదురేగి స్వాగతం

చెప్తాం. కొత్త సూర్యుడు ఉత్తరాయణ రూపంలో వస్తుంటే మానవమాత్రులమైన

 మనం అంత ఎత్తుకి వెళ్ళలేం కాబట్టి, మనం ఎగురవేస్తున్న గాలిపటాలు సూర్యునికి

  స్వాగతాన్ని పలుకుతుండడానికి సంకేతం. అవి ఎగురుతున్న విధానం, గాలి

 ప్రవాహం, పారుదల ఎటుందో తెలుసుకోడానికి సంకేతం.

రథం ముగ్గు 

భోగి, సంక్రాంతి పండుగరోజులైనాక మూడోరోజున వచ్చేది ‘కనుమ ‘ పండుగ. కనుము

 అంటే పశువు అని అర్ధం. పరమేశ్వరునికి మానవులమైన మనం మాత్రమే సంతానం

 కాదు కాబట్టి పశుపక్ష్యాదుల పూజ కూడా సాగుతుంది
పొలంలో పండిన ధాన్యపు కంకుల్ని ఇంటిముంగిటిలో ద్వారబంధానికి పైభాగాన

కట్టడ0, పెద్దలకి ఆహారాన్ని నైవేద్యాలిచ్చాక కొంత అన్నాన్ని కాకులకి వేయడం,

 ఇంటి పశువులని కడిగి పసుపు రాసి ఆ పైన కుంకుమ బొట్లు పెట్టి మెడలలో

 పూదండల్ని వేసి కడుపునిండుగా వాటికి ఆహారాన్ని పెట్టడం ఇదంతా శ్రీహరి

ఇతర సంతానానికి చేస్తున్న సేవకి సంకేతం.
పండుగని సాగనంపుతూ వేసే రథం ముగ్గు, మనిషి శరీరం ఒక రథం వంటిదని

 ఆ శరీరపు హృదయంలో పరమేశ్వరుడుంటే అతడు సజ్జనుడవుతాడని సంకేతం

.ఒక రథం ముగ్గుతో మరో ఇంటివారి రథం ముగ్గుకి ముగ్గుతో తాడుని వేస్తూ

కలుపుతూపోవడ0 – అందరం ఒకరికి ఒకరంగా వుంటూ ఐకమత్యంగా వుంటూ

 జీవిద్దామని చెప్పడానికి సంకేతం.

ప్రకటనలు

Comments on: "సంక్రాంతి రహస్యాలు" (8)

  1. పండుగ మొత్తాన్నీ మీ బ్లాగులోనే చూపించారు. భేష్!

  2. ఎందుకండీ ఇంత శ్రమ పడ్డారు!!!

  3. oh sorry! ఈ కామెంట్ మీ సెల్ కథ గురించి…పొరపాటున ఇక్కడ పోస్ట్ చేసా!

  4. naaku teleeyani caalaa vishayaalu ii post valla telusukunnanu.thanks andi

  5. very nice. i liked it so much

  6. HI I thanujajarathi. so nice. పండుగ మొత్తాన్నీ మీ బ్లాగులోనే చూపించారు. భేష్. I liked it. thanks for remember we that Telugu.

  7. chinnapudu ammama chebite vinevallam epudu chepataniki thelusukovataniki ummadi kutubale levu enni vishayalu theliya parichinanduku thanks

  8. chala baga cheparu , sankranthi rojuna atau gurinchi rai unte eenka bagaundedhi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: