నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మనసు

 
మల్లె మనసు

విడవకముందే అమ్మ ఒడికి దూరమౌతాను
దేవుని చెంత చేరతానో ?
కాంతల కురుల్లో కూరుకుంటానో ?
కల్యాణ వేదికల్లో కట్టబడతానో ?
రాజకీయ నాయక్కుల మెడలలో మలినమౌతానో ?
అంతా అయోమయం గడ్డిపూవునైనా కాకపోతిని.

 

గడ్దిపూవు మనసు

పుడితే మల్లెపూవుగా పుట్టాలా
విడువకముందే అపురూపంగా కోసి తీసికెళ్తారు.
వాసన చూసి తన్మయత్వం చెందుతారు
భగవంతుని పాదాల చెంత చేరుస్తారు
మనసారా ముడులలో ముడుస్తారు
ఉన్న ఒక్క రోజు జీవితంలో వెలుగు నింపుతారు
నా జీవితం అడవి గాచిన వెన్నెలే
ఎవ్వరూ నన్ను కొయ్యడానికి రారు. వచ్చినా ‘ పసిరి కంపు ‘అని తృంచి పడేస్తారు.
 
పువ్వుల విషయమే ఇలా ఉంటె ఇక మనుష్యుల సంగతి ?
మల్లె పూవు గడ్డిపూవుగా
గడ్దిపూవు మల్లెపూవుగా మారలేకపోయినా
మనసున్నమనుష్యులు మనసు పెట్టి ప్రయత్నిస్తే
అనందాలని కొంతవరకైన సొంతం చేసుకోవచ్చు
ఏ సుఖమైన ఎదుటివారిలో చూసినప్పుడే అనందంగా కనపడుతుంది అనుభవానికి వస్టే అలవాటుగా పరిణతి చెంది ఆనందం కరిగిపోతుంది. అందుకే అన్నారు. ‘ దూరపు కొండలు నునుపు ” అని.

ప్రకటనలు

Comments on: "మనసు" (5)

 1. జ్యోతి గారు

  చాలా బాగా చెప్పారు….

  ప్రపంచములో ప్రతి వారు…”నేను ఇంకొకరిలా వుంటె?”…అని అనుకొంటారు…

  అదే మన బలహీనత…

  పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అంటె ఇదే.

  -అనిల్ చీమలమఱ్ఱి

 2. చాలా బాగా చెప్పారు..మిమ్మల్ని ప్రశంసించడానికి రెండు ఇంగ్లీషు ముక్కలు అవసరం …రియల్లీ వండర్ ఫుల్.

  దూరపుకొండలు నునుపు అన్న విషయాన్ని భావనాత్మకంగా చెప్పారు.నాకైతే నచ్చింది.

 3. భలే భలే! చక్కగా చెప్పారు.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 4. adbhutam.cinna post loa goppa bhaavaanni ceppaaru.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: