నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అందరికి నమస్తే చెప్తున్న.మొన్న పండగ రోజు అన్నీ స్పెషల్ సినిమాలేసారు టీవీల

.ఈ మధ్య కొన్ని సినిమాలు జూస్తుంటే నాకైతే పిచ్చి లేస్తుంది. వీళ్ళకసలు దమాక్

 పనిచేస్తుందా లేక మనను హౌళ గాళ్ళను జేస్తుండ్ర. అన్ని పిచ్చిపాటలు,ఎర్రగడ్డ

 దవాఖానల ఇలానె పాడుతుంటరు.రాసేటోల్లా,పాడెటోల్లా ఎవరు పాగల్ గాళ్ళు.

 ఆడెవడో గురుకిరణ్ అంట కన్నడోడు తిరుపతి ఎంకన్న సామి సుప్రభాతాన్ని

 ఖూనీ చేసిండు మహారథి సినిమాలో. ప్రతి శనివారం తానం జేసి పాడుకునే

 పాటను అలా జేయొచ్చా.ఎవరిని తిట్టాలి.ఇంకో సినిమా ఖతర్నాక్ అంట

 ఆడేమో చికన్ గున్య అంటడు.నీ యవ్వ చీపురు తీసుకుని తన్నాలనిపించించి.

ఈ బాలక్రిష్ణ సినిమాలైతే అసలు ఎందుకు తీస్తరో అర్ధం కాదు. పైసలెక్కువయ్యా.

 అల్లరిపిడుగు సినిమాలో హీరో ఆడి అయ్య,అన్నను విలన్ కట్టేసి బాంబ్ ఎట్టి

 పోతాడు. కాని బాలయ్య నోట్ల బుల్లెట్ పెట్టుకుని గట్టిగ ఊదితే అదెల్లి బాంబ్

ఖట్కకి తాకి ఆగిపోతుంది. ఎమన్నా సమజ్ ఐందా.
మళ్ళీ కుంటి బాలయ్య పేద్ద లోయలో పడికూడా నాన్నోయ్ అని వచ్చేస్తాడు

.గాల్లో ఎగిరి విలన్ ని తంతాడు.  ఇంకో సినిమాలో బాలయ్య మోటర్

 సీకిల్ తో ఎగిరి రైలు మీది కెక్కుతాడు. మనదేశంలో హెలికాప్టర్ నుండి

దూకి (అదే పారచూటు అంటరు గద అదే) పాకిస్తాన్ లో దిగుతాడు.

అత్తగారింటికెల్లినట్టు దొంగోడి ఇంటికెల్లి తంతాడు. అది చూసి నా దమాక్ ఐతె

ఖరబ్ ఐంది. చెప్పొద్దు కాని పాత సినిమాలైతె మస్తుగుంటయి. పండగరోజు

ఈటీవీ లో గుండమ్మ కథ ఏసారు. దిల్ ఖుష్ ఐపోయింది.  మస్తు ఎండలో

 ఉంటే సల్లని సెంటు నీల్లతో తానం జేసినట్టైంది నాకైతె.ఏం పాటలు, ఏం

యాక్టింగు అందరిది. నిజంగా పండగ జేసుకున్నట్తుగా ఉండింది. నా

మనసులో ఉంచుకోలేక మీకు చెప్తున్న.
మళ్ళి అసుంటి సినిమాలు వస్తయా. అంత నసీబ్ ఉందా మనకు

 అనిపిస్తుంది.ఎమో.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: