నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అందరికి నమస్తే చెప్తున్న.మొన్న పండగ రోజు అన్నీ స్పెషల్ సినిమాలేసారు టీవీల

.ఈ మధ్య కొన్ని సినిమాలు జూస్తుంటే నాకైతే పిచ్చి లేస్తుంది. వీళ్ళకసలు దమాక్

 పనిచేస్తుందా లేక మనను హౌళ గాళ్ళను జేస్తుండ్ర. అన్ని పిచ్చిపాటలు,ఎర్రగడ్డ

 దవాఖానల ఇలానె పాడుతుంటరు.రాసేటోల్లా,పాడెటోల్లా ఎవరు పాగల్ గాళ్ళు.

 ఆడెవడో గురుకిరణ్ అంట కన్నడోడు తిరుపతి ఎంకన్న సామి సుప్రభాతాన్ని

 ఖూనీ చేసిండు మహారథి సినిమాలో. ప్రతి శనివారం తానం జేసి పాడుకునే

 పాటను అలా జేయొచ్చా.ఎవరిని తిట్టాలి.ఇంకో సినిమా ఖతర్నాక్ అంట

 ఆడేమో చికన్ గున్య అంటడు.నీ యవ్వ చీపురు తీసుకుని తన్నాలనిపించించి.

ఈ బాలక్రిష్ణ సినిమాలైతే అసలు ఎందుకు తీస్తరో అర్ధం కాదు. పైసలెక్కువయ్యా.

 అల్లరిపిడుగు సినిమాలో హీరో ఆడి అయ్య,అన్నను విలన్ కట్టేసి బాంబ్ ఎట్టి

 పోతాడు. కాని బాలయ్య నోట్ల బుల్లెట్ పెట్టుకుని గట్టిగ ఊదితే అదెల్లి బాంబ్

ఖట్కకి తాకి ఆగిపోతుంది. ఎమన్నా సమజ్ ఐందా.
మళ్ళీ కుంటి బాలయ్య పేద్ద లోయలో పడికూడా నాన్నోయ్ అని వచ్చేస్తాడు

.గాల్లో ఎగిరి విలన్ ని తంతాడు.  ఇంకో సినిమాలో బాలయ్య మోటర్

 సీకిల్ తో ఎగిరి రైలు మీది కెక్కుతాడు. మనదేశంలో హెలికాప్టర్ నుండి

దూకి (అదే పారచూటు అంటరు గద అదే) పాకిస్తాన్ లో దిగుతాడు.

అత్తగారింటికెల్లినట్టు దొంగోడి ఇంటికెల్లి తంతాడు. అది చూసి నా దమాక్ ఐతె

ఖరబ్ ఐంది. చెప్పొద్దు కాని పాత సినిమాలైతె మస్తుగుంటయి. పండగరోజు

ఈటీవీ లో గుండమ్మ కథ ఏసారు. దిల్ ఖుష్ ఐపోయింది.  మస్తు ఎండలో

 ఉంటే సల్లని సెంటు నీల్లతో తానం జేసినట్టైంది నాకైతె.ఏం పాటలు, ఏం

యాక్టింగు అందరిది. నిజంగా పండగ జేసుకున్నట్తుగా ఉండింది. నా

మనసులో ఉంచుకోలేక మీకు చెప్తున్న.
మళ్ళి అసుంటి సినిమాలు వస్తయా. అంత నసీబ్ ఉందా మనకు

 అనిపిస్తుంది.ఎమో.

ప్రకటనలు

Comments on: "వారెవ్వా క్యా సినిమా హై" (18)

 1. మంచిగా చెప్పినావ్ బిడ్డా! మంచి సిల్మాలు రాటానికి ఏదైన వ్రతం ఉందేమో కనుక్కుని చెప్పరాదే!

 2. జ్యోతి గారు

  మీరు కనీసం కథల దాకా వెళ్ళారు…వాటికి ముందే…సినిమా పేర్ల గురించి చెప్పుకోవాలి…

  పోరంబోకు
  పోకిరి
  దేశముదురు

  వీటి గురించి ఏమంటారు?

  ఇక పాటలు గురించి…

  యోగి నన్ను నమిలైరా…కొరికైరా..

  ఎందుకులేండి…ఇంకా చాలా ఉంది..

  మన దౌర్భాగ్యం…అంతే…

  నేనైతే సినిమలు చూడాడం మానుకొన్నాను..(కొందరివి తప్ప)

  -అనిల్ చీమలమఱ్ఱి

 3. ఆ యోగిలో అన్ని అలాగే ఎడ్చాయి..కొరికేయ్ రో,నమిలేయ్ రో…యింకా గిల్లి గిల్లి గిచ్చి గిచ్చి అంట ..

  ఏం పాటలో ఏమో వాటికి పిండం పెట్ట!

 4. అవునండి జ్యోతిగారూ!మీరు ఒకేసారి లాంగ్వేజీ మార్చేసారు…ఈ విషయాలను యిలా చేబితేనే బాగుంటుంది అనుకున్నారా ఏంటి?

  అయినా మీ శైలి అక్కడక్కడ కాస్త కృతకంగా కనబడింది…మన యాసలో(భాష) యిలాంటి పదాలు దాదాపుగా పడవ్…

  ఏసారు,ఇలానె,ఎవరు,అలా,పోతాడు,ఆగిపోతుంది,తంతాడు….యింకా వున్నాయి…

  యిలా చెప్పానని ఎమీ అనుకోవద్దు! మీరు మరోసారి రాసినప్పుడు మరింత సహజంగా వుండాలని అంతే!(మా/మన భాష కదా!)…

  ఏమీ అనుకోవద్దు!

 5. గదేందన్నా బాలకృష్ణ అంత మస్తుగా కామెడీ సేస్తాంటే… సూసి మస్తుగా ఎంజాయ్ చెయ్యాలె.

 6. మా బాగా చెప్పారు. ఈలాంటి సినిమాలు ఎక్కువ కాలం ఆడవు. జనం కొద్ది రోజులలొనే మరిచిపొతారు. ఈతరహా సినిమాలకి ఎవరైన పూనుకుని, చెత్త / అతిచెత్త / పరమచెత్త సినిమాలుగా వర్గికరించి అల్టర్నెట్ నంది అవార్డు లు, అదెనండి వరాహ విగ్రహం తొ “పంది” అవర్డులు ఇవ్వాలి.

 7. మీరింకా బాలయ్య సినిమాలు చూస్తున్నారా?!! నేను మానేసి చాలాకాలం అయ్యింది.
  “పంది అవార్డుల” విషయమేదో చాలా బాగుంది. ఇదేదో మనమే బ్లాగరుల గుంపు నుంచి మొదలెడదామా?

  –ప్రసాద్
  http://blog.charasala.com

 8. నేను బాలకృష్ణ సినెమాలు సినెమా హలుకెళ్లి చుసింది 3 మాత్రమే. అవి, 1. ఖర్మకాలి చూసింది అనసూయమ్మగారి అల్లుడు, 2. అదిత్య 360, 3. సమరసింహారెడ్డి.
  కంటి చూపుతో కాదు తిక్కపనులతో కూడా జనాల్ని హింసించొచ్చు అని నిరూపిస్తున్న బాలయ్యకి నమస్తే!!

 9. బాలయ్య అనే కాదు మన తెలుగు సినిమాలన్నీ ఇలాగే ఉన్నాయి. తేడా అల్లా సినిమా హిట్టయితే ఇవన్నీ కనిపించవు,హిట్టు కాకపోతేనే సమస్య.

 10. nijam cepparamdi.kaani nenu ippati paatalani enjoy cheyagalugutunnaanu.movie lo himsa ni maatram bharimcaleakapoatunnaanu.

 11. నేను బయట థియేటర్లో సినిమా చూసి ఆరేళ్ళయింది ఆఖరుది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఎవైనా మంచివి టీవీలోనే చూడడం.ఈ బాష అంటే హైదరాబాదులో వాడుకలో ఇలానే ఉంటుంది. కోపం ఎక్కువై ఎవరినన్నా తిట్టాలంటే ఉర్దు తిట్లు కలిపి మరీ తిడతారు జనాలు.అవి మరీ దారుణంగా ఉంటాయి. ఎవో చెత్త సినిమాలు డబ్బులెట్టి మరీ చూడాలా.చాలా రోజులుగా నాలో నేనే అనుకుంటూ ఉన్నా. కాని గుండమ్మ కథ సినిమా చూసాక ఆగలేక ఇలా చెప్పా.అందులో ఏది బాలేదు అని చూస్తే ఎదీ లేదు. సంగీతం, నటన, పాటలు,సాహిత్యం అన్నీ సహజంగా మనసును మైమరపించాయి.

 12. ఈ పోస్టు మీద బాలయ్య అభిమానుల దాడికి కాచుకోండి.

 13. ori naayano. chachanu navvaleka.

 14. Hey Jyothi yu made an old but still very valid statement.

  Telugu Movies are loosing da grace they used to hve one time. But doesnt mean that we dnt hve gud movies at all. Morning Raga, Godavari, Bommarillu ……list is not long but we de hve some gud movies.

  Well One more thing i wuld like to add is , lot of guys these days taking sides and then slandering Bala Krishna’s Movies. I agree that, most of the movies are senseless. But what about Chiranjeevi, Nagarjuna, Mahesh and other big wigs?

  I still remember one scene in stalin. We are shown dat chiranjeevi jumps comfortably frm one running car to another and then the nxt moment all the guys in the car cme out flying !

  He alone will kill ‘n’ Trucks load of pple.

  Mahesh babu will kick sme one and he goes flying in the Air for atleast 100 Mts.

  Balayya can Stop a Train with his Eyes.

  Nagarjuna can create a Mini Twister with a Simple leg moment [MASS].

  I like rai teja’s Action , But all his movies provoke Audiences to do sth stupid and dat becomes trend 😦

  Old is Gold But New Can be Gud Too. It’s Time pple stop seeing stupid movies and demsnd for da best.

  **** sorry i dnt knw how to type da same msg in Telugu****

 15. దేశముదురు గనక వజయవంతమైతే…ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయో ఊహిస్తే……
  * ఊర ముదురు
  * మహా ముదురు
  * వీడు చాలా ముదురు గురు
  * ముదురు మందారం
  * మావాడు ముదురు
  ఇక పోరంబోకు హిట్టైతే…ఆ వచ్చే పేర్లు ఊహించడానికే భయమేస్తోంది.

 16. […] వారెవ్వా క్యా సినిమా హై […]

 17. జయ సింహా రెడ్డి said:

  హాయ్ అక్క …బాలయ్య చేసే సాహససాలు అన్ని కామిడీ అయిపోయి నాయి …….బాలయ్య సినిమా అంటే నే బయంగా ఉంది : మీరు రాసిన తెలంగాణ బాష bagundi :జయ సింహా రెడ్డి

 18. language bagundi. telugu lo ela rayalo naaku nerpincharuu…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: