నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

 

 గుండమ్మ కథ

1962 లో విడుదలైంది.
కథ : చక్రపాణి
మాటలు: డి.వి.నరసరాజు
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు 

సంగీతం: ఘంటసాల
గానం : ఘంటసాల, సుశీల, జానకి , లీల.

నటీ నటులు ఎన్.టి.ఆర్,ఏ.ఎన్.ఆర్. సావిత్రి, జమున, సూర్యకాంతం,రమణారావు,

హరనాథ్,విజయలక్ష్మి,ఎస్.వి.రంగారావు మొదలైనవారు.

ఇందులో ప్రధానంగా కథ ఏంటంటే గుండమ్మ తన కూతురు సరోజ మరియు

 సవతి కూతురు లక్ష్మి గుమస్తా గంటయ్య తో ఉంటుంది.పెళ్ళిసంబంధం కోసం

వచ్చిన ఎస్.వి.రంగారావుతో అమర్యాదకరంగా మాట్లాడుతుంది.దాంతో గుండమ్మ

 తిక్క కుదర్చాలని అతని కొడుకులు  అంజి అతని తమ్ముడు రాజా మారువేషాల్లో

 గుండమ్మ ఇంటిలో చేరి ఆమే కూతుళ్ళని వలచి వాళ్ళని మారుస్తారు. ఈ సినిమా

 మొదటి నిమిషం నుండి చివరి వరకు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది.

ఇందులో పాత్రలు మాత్రమే కనపడాయి, అంజి, గంటయ్య, గుండమ్మ  ఇలా…

ఎన్.టి.ఆర్ ఇంకా సూర్యకాంతం అని కనపడరు. అప్పుడు వాళ్ళు అలా కథలో

 లీనమై నటించేవారు. మనకు కూడా అది సినిమా, నిజం కాదు అని కూడా

 అనిపించదు. అంతలా లీనమై ఆనందిస్తాము.ప్రతి పది నిమిషాలకు ఒక

పాట వచ్చినా విసుగు అనిపించదు. ఒక్కొక్కటి ఒకో ఆణీముత్యం వంటి

పాటలు.లేచింది నిద్ర లేచింది, కోలుకోలోయన్న కోలో నా సామి,

ప్రేమయాత్రలకు బృందావనము,ఇలా వింటూ ఉంటే ఇంకా కావాలనిపిస్తుంది.

 నిజంగా ఆ పాత్రలే పాడుతున్నాయేమో అనిపిస్తుంది అంత సహజంగా

ఉంటుంది చిత్రీకరణ కూడా.సినిమా మొత్తం చూసినా ఒక్క సన్నివేశం

కూడా కృత్రిమంగ ఉన్నట్టనిపించదు.  నేనైతే ఇందులో ఏదన్నా తప్పు

 కనపడుతుందాని వెతికా  ఒక్కటి లేదు. నటన, సంగీతం, పాటలు ,

సంభాషణలు,అన్ని సహజంగా ఉంటాయి. నిజంగా ఈ సినిమా చూస్తే

నాకైతే మనసు పులకరిస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.మళ్ళీ ఆ

నటులు పుడితే బావుండును అని అనుకుంటాను. వాళ్ళకు వారసులు

 ఎవరూ లేరేమో?  

ప్రకటనలు

Comments on: "తెలుగు సినిమా వజ్రోత్సవాలు" (1)

  1. మురళీ కృష్ణ కూనపరెడ్డి said:

    ఆ నటులకు వారసులున్నారు కానీ, వారి నటనకు కాదు. ఈరోజు ఈటీవీ౨ ప్రతిధ్వనిలో సినిమాల గురించి చర్చ వచ్చింది. అందులో ఆర్పీ పట్నాయక్ అనుకుంటా, ఇలా అన్నారు.

    “ఒకప్పుడు డైరెక్టర్ సెంటర్డ్ సినిమాలు వచ్చేవి. ఇప్పుడేమో హీరో సెంటర్డ్ సినిమాలు వస్తున్నాయి. అందువల్ల కథ మీద డైరెక్టర్ కు ఎటువంటి స్వేచ్చ లేదు….” అన్నీ నిజమే అనిపించింది.

    మీరు గుండమ్మ కథ అనగానే నాకు గుర్తుకొచ్చే ఇంకో సినిమా ‘మిస్సమ్మ’. మీరేమంటారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: