నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అంత బావోదు

*  జైలులో దొంగని జైలర్ గారు ఏం అన్నా  ఫర్వాలేదుగానీ “గెటవుట్”

    అంటే మాత్రం…

*  ఒక్కగానొక్క కూతురు, ఒక్కగానొక్క కొడుకు అంటే ఫర్వాలేదుగాని        

    ఒక్కగానొక్క తండ్రి అంటే మాత్రం…

* ఇంటికొచ్చిన అతిథి దేవుళ్ళు తిరిగి వెళ్ళీపోతున్నపుడు ” చాలా థాంక్స్   

   అండి” అంటే మాత్రం ….

* ” దయచేసి మళ్ళీ రండి ” అన్న బోర్డు ఎక్కడ పెట్టినా ఫర్వాలేదుగానీ

      స్మశానం గేట్ దగ్గర మాత్రం…

*   పెళ్ళి చూపుల్లో అమ్మాయిని ఏం అడిగినా ఫర్వాలేదుగానీ “అనుభవం

    ఉందా ” అనడిగితే మాత్రం …

* జ్వరమొచ్చి హాస్పిటల్లో చేరిన బాస్ని పలకరించడానికెళ్ళి ” ఏం సార్!

  ఒళ్ళెలా ఉంది ” అని అనడం మాత్రం…

* ఉరిశిక్ష పడ్ద ఖైదీని ఇంటర్వ్యూ చేయడానికెళ్ళి ” మీ ఫ్యూచర్ ప్లాన్స్

   ఏంటండీ” అని అడగడం మాత్రం…

* సినిమా హాల్లో కనపడ్డ ఫ్రెండుని ఎలా పలకరించినా ఫర్వాలేదుకాని

  “సినిమా కొచ్చావా ” అని పలకరించడం మాత్రం …
 
* కొత్తగా పెళ్ళయిన స్నేహితుడు మర్యాద కోసం తన భార్యని పరిచయం 

   చేసినప్పుడు ” వావ్! సూపర్ గురూ! నీ సెలక్షనే సెలక్షన్ గురూ !”

   అంటూ రెచ్చిపోయి పొగిడెయ్యడం మాత్రం…

* రూలు ప్రకారం “సిస్టర్” అన్నాడు కదా అని రాఖీ పండుగ నాడు

   నర్సులందరూ రాఖీలు కట్టమని కుర్ర డాక్టరు వెంటపడటం మాత్రం… 

* తిరుమల కొండమీద దువ్వెనలమ్మే షాప్ పెట్టి, సేల్స్ లేవని బాధపడటం

  మాత్రం…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: