నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఆదర్శ కుటుంబం

ట్రింగ్ ట్రింగ్
“హలో ఏవండి ! ఆ నేనే మాట్లాడుతున్నాను. ఈ రోజు సాయంత్రం

 మా ‘టైగ్రస్ క్లబ్’లో ‘ఆదర్శకుటుంబం కాంటెస్ట్’ ఏర్పాటు చేస్తారంట.

దానికి మెంబర్స్ అంతా తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ

తీసుకుని రావాలని సెక్రట్రీగారు ఇప్పుడే ఫోన్ చేసి చేప్పారు. నేను

ప్రస్తుతం మిసెస్ రావ్ వాళ్ళతో ‘కార్డ్శ్ ఆడుతున్నాను. ఆట చాలా

 ఇంట్రస్టింగా ఉంది ఇది పూర్తయిన వెంటనే నేను ‘హాస్టల్ కి ‘

 వెళ్ళి మన పిల్లలిద్దరిని తీసుకుని వ్స్తాను. మళ్ళీ రేపుదయం

దించేసానని చెప్పి తెస్తాను. ఇదిగో వింటున్నారా? మీరు హాఫ్

 డే లీవ్ పెట్టి కాస్త ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి మీ అమ్మానాన్నని

మళ్ళి రేపు తెచ్చేస్తానని చెప్పి తీసుకురండి. సాయంత్రం అక్కడ

 ఎలా వుండాలో ఏం మాట్లాడాలో వివరంగా చెప్పాలి. మళ్ళీ

ఒకదానికొకటి చెబితె మన పరువు పోతుంది.
అయ్యో! అసలు విషయం చెప్పడం మరిచిపోయా. ఆట

 మంచి పట్టులో ఉంది. వంట మనిషి రాలేదు. కాబట్టి నిన్నట్లాగే

మీరు బయట తినేయండి. నేను మిసెస్ రావు, హోటల్

నుంచి ‘పార్సిల్ ‘తెప్పించేసుకున్నం. ఇదిగో నేను చెప్పిందంతా

మర్చిపోయి ఏ బార్లోనో కూర్చోకండి. ‘ఆదర్శకుటుంబం ‘

కాంటెస్ట్లో మనకే ‘ఫస్త్ ప్రైజ్ ‘ రావాలి. అర్ధం అయింది కదా

 వుంటాను.’ క్లిక్.

ప్రకటనలు

Comments on: "ఆదర్శ కుటుంబం" (4)

 1. మంచి చురక. ఇప్పుడు నడుస్తుంది అదేగా. “పెళ్ళయిన కొత్తలో” సినిమాలో ఇలాంటివే చూపించారు.

  విహారి
  http://vihaari.blogspot.com

 2. భలే చెప్పారండీ, ఆధునిక ఆదర్ష కుటుంబం గురించి.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. chaala baga chepparu.
  mana tv channels lo ilantivi mogudu pellam ani atta kodalu ani vallato gantulu veyinci veshalu veyinci vekili panulu cheyinchi best pair ga prize istharu..
  antha kanna test cheyyataniki manchi alochanu ravemo..
  idivariki gollapudi manasuna manasai ani oka programme nirvahincevaru. adi vitikanna nayam.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: