నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అదే మరి మండుద్ది.

ఎదో బొమ్మ బావుంది కదా అని చూడమని చెప్తే పెళ్ళాల మీద అన్ని జోకులా.పెళ్ళాలేమో తమ మొగుళ్ళకోసం ఉపవాసాలు,నోములు,వ్రతాలు చేస్తుంటే మీ మొగుళ్ళేమో తమ పెళ్ళాల వల్ల కష్టపడిపోతున్నట్టు బిల్డప్పులు.తన వాళ్ళందరిని వదలి మీ దగ్గరకొస్తుందే. పెళ్ళాలేమో తమ పుట్టింటి వారితో,ఇరుగుపొరుగు,ఊర్లో వాళ్ళతో మొగుడు  ఎలాంటివాడైనా(చాలా విశేషణాలు ఉన్నాయి) అవి చెప్పకుండా అన్ని గొప్పలు చెప్పి మా ఆయన బంగారం అని చెప్పుకుంటారు. మీరేమో మా ఆవిడా ఇంతే మీ ఆవిడా ఇంతేనా అని ఓ తెగ బాధపడిపోతుంటారు.ఇది న్యాయమా.మొగుళ్ళు చేసేది ఆఫీసు పని మాత్రమే. కాని పెళ్ళాలు మొగుళ్ళని పిల్లలను ఇల్లుని అన్నింటినీ చూసుకోవాలి కదా మీరు సాయం చేస్తే ఏంటంటా.ఎప్పుడన్న చేస్తే ఘనకార్యం చేసినట్టు ఫీలింగు.పైగా పెళ్ళి చేసుకున్న వాళ్ళూ ఎదో కష్టాలు పడిపోతున్నట్టు పెళ్ళి కాని బ్రహ్మచారులను హెచ్చరించడం. మొగుళ్ళందరు ఇలా పెళ్ళాల మీద చాడీలు చెప్ప్పుకుంటారే. మీ పెళ్ళాలు ఎప్పుడన్న మీ గురించి ఇల చెప్పుకుంటారా కనుక్కోండి. అసలైతే లేనివి కూడా చెప్పి మా ఆయన చాల గొప్ప వాడు అని గర్వపడతారు.చివరిగా అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళి కాక ముందు ఒకేలా పెరుగుతారు కదా చదువు, పెంపకం,స్నేహితులు,సరదాలు అన్నీ.మరి మీ మగాళ్ళె తమ స్వాతంత్ర్యం ఎదో పోయినట్టు చెప్పుకుంటారు. ఆడాళ్ళు పెళ్ళి కాగానే మీ పేరుతో కలిపి తమ పేరుని పిల్చుకోడం గర్వంగా ఫీల్ అవుతారు కదా. మరి మగాళ్ళు కూడా అలా చేయగలరా. ఒకవేళ ఎవరైన ఫలాన ఆవిడ మొగుడంటే మాత్రం ఉడుక్కుంటారు.
ప్రేమికుల రోజు సంధర్భంగా ఈ విధంగా సరదాగా చెప్పాను. ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.

ప్రకటనలు

Comments on: "అదే మరి మండుద్ది." (15)

 1. లాగి లెంపకాయ కొట్టి ఏదో సరదాకు కొట్టాను అంటున్నారా. అదే మరి మండుద్ది.

 2. మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకు చిన్నప్పటి నుంచే స్వేచ్ఛ తక్కువ. అందుకే పెళ్ళితో తమ స్వేచ్ఛను కోల్పోయినట్లు వాళ్ళకు అనిపించదనుకుంటున్నాను. (అనిపించినా ఎక్కువమంది మౌనంగా సర్దుకుపోతారు). మగవాళ్ళకు ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి గోలపెడతారు.

  పెళ్ళి గురించి మరిన్ని కొత్త జోకులు ఇక్కడ చదవండి 🙂

 3. త్రివిక్రమ్..నీ విశ్లేషణ బాగుంది. బహుశా పుట్టింటోళ్ళు వయసులో ఉన్న ఆడబిడ్డ్లకి జాగ్రత్తలు చెప్పి జైలు వాతావరణం కలిపిస్తారేమో, మెట్టినింటికి వచ్చేటప్పటికి తేడా తెలియదు. మగ బిడ్డ్లలు..అలా కాదు…అప్పటి దాక పూలరంగడిలా, రంగేళీరాజా లా ఫస్ట్ షోలకు, సెకండ్ షో లకు తిరిగిన అతనికి పెళ్ళితో బాధ్యతలు వస్తాయి. మందు కొట్టలేడు, సిగిరెట్టు తాకలేడు….ఇలా ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్ళే ఎప్పుడూ కంప్లయింట్ చేస్తారనుకొంటా.

 4. ఇన్ని మొట్టికాయలేసి సరదాగా వేసానంటారా? మీనుంచి మీ వాదన సబబే! మరి మా మగరాయుళ్ళేమంటారో చూడాలి.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 5. ఎన్ని చెప్పినా ఆడైనా మగైనా అందరూ కుటుంబాధారిత జీవులే. కుటుంబమే మన నిజమైన ఆస్తి. స్వేచ్ఛకి పరిమితమైన అర్థం మాత్రమే ఉంది. మగవారు వినపడేలా జోకులేస్తారు.ఆడవారు వినపడకుండా జోకులేస్తారు. అంతే తేడా !

 6. అడ్డడ్డడ్డే…..చొ..చొ.చ్చొ
  జ్యొతక్క గారికి కోపమొచ్చిందండి.
  అట్టగనుకుంటే ఎట్టా అక్కా?
  ఇబ్బుడు ఆడోళ్ళకేం ఒచ్చిందంటా.
  ఏందో ఓ బుడ్డోడు పెళ్ళి చెసుకుంటావుండాడు కొంచెం సరదాగా అందామని మా ఇంట్లో(నా బ్లాగులో) అంటే.
  ఇంకో బుడ్డోడు (ప్రవీణ్) “నా పెళ్ళి నిరవధిక వాయిదా” అని రాస్తే మాత్రం పెళ్ళి చేసుకోకుండా పోతాడా ఏంది?
  ఎబ్బుడు ఎవురేమన్నా గానీ ఆడోళ్ళే గొప్ప అని నేనంటా. అందులో మా ఆవిడే గొప్పంటా ఏంటంట?

  ఇట్లా గొద్దు గానీ.. అడోళ్ళు మొగోళ్ళు ఇద్దురూ సమానమే కొంచెం అటూ..ఇటుగా.

  గమనిక: కొర్రు కాల్చి వాత పెట్టేసి. వెన్న రాసినట్టు సరదాగ అన్నా అంటారా..ఆయ్ 🙂

  విహారి
  http://vihaari.blogspot.com

 7. ఆడవాళ్లు తమ భర్తలగురించి గొప్పలుపోవడం వెనుక కారణం ఏమయుంటుందీ!? అనుభవజ్ఞులు విశ్లేషిస్తే తెలుసుకోవాలనుంది.

 8. ఇక్కడ మెజారిటీ పోస్టులు మగవాళ్ళవే ఎక్కువ వున్నట్టున్నాయి….కానీయండీ.
  ఆడవాళ్ళు వున్నదానిలోనే సంతోషం వెతుక్కుంటారు.[నిజమేనా?]మగవాళ్ళేమో దూరమైపోతున్నదంతా ఆనందం,దగ్గరవుతున్నదంతా భారం అనుకుంటారు.[కాదా?]

 9. ఇక రానారే గారు అడిగిన విషయానికి వస్తే మగవాళ్ళు డబ్బు సంపాదించడం,ఆస్తులను కలిగివుండడం స్టేటస్ గా ఫీల్ అవుతూ వుంటారు.అదే ఆడవాళ్ళు తమ భర్తనే గొప్ప స్టేటస్ గా భావిస్తూవుంటారు.ఆడవాళ్ళు ఇష్టం గా చేసే మొదటి పని తమ వద్దనున్న గొప్ప వస్తువులను,విషయాలని అందరిముందూ ఇంకా గొప్పగా ప్రదర్శించడం.అందుకే తమ తమ భర్తలగురించి అంత గొప్పగా చెప్పుకుంటూ వుంటారు.

 10. Jyothi garu,

  Vihaari blog ki ghaatu ga reply ichaaru. Naa personal opinion.. abbayilu paatha rojuluni gurthu chesukoni feel aipotaru.. ammayilu pelli ayyaka vunna happiness ni self dabba kottukontu vuntaru.. andukenemo ee vyatyasam.

  PS: chaala kasta paddanu aa comments lo profile ni track back cheyyadaaaniki..

  Mee permission tho, I am adding your blog url in my website.

 11. మగవాళ్ళ మెంటాలిటీ గురించి చాలా బాగా చెప్పారు జ్యోతిగారు. ఐనా వున్నా మాట చెపితే ఉలుకెందుకు ఈ మగవాళ్ళకి.

 12. ఇదేంటీ, ఈ డైలాగులన్నీ మా ఆవిడ డైలాగుల్లా ఉన్నాయి :-/

 13. Hello Jyothi garu!

  Mee blog chaala bagundi.. konni posts choosthe acham swathi book chaduvutunnatlu undi. thanks please keep posting.

 14. anni nijaale ,inta manchi charchalu ikkada jarugutayani eeroje telisindi , jyothi garu vishayaanni balanganu chakkaganu chepparu .

 15. అరె నేను ఈ టపా మిస్సయిపోయానా ! మీరన్నవన్ని అచ్చంగా నిజాలే చివరలో జోకుగా అన్నాను అని అన్నాకూడా…కాక పోతే కొద్దిగా తేడా ఉంది.
  స్త్రీలు స్వతహాగా మేనేజ్‍మెంటు గురులు. కాబట్టి వారు ఒక మంచి సాంప్రదాయం పాటిస్తారు. పదుగురిలో పొగుడు…ఏకాంతంలో ఏడిపించు…అని ఒక గొప్ప మేనేజ్‍మెంటు సూత్రం ఉంది. అది పాటిస్తారు. ఇదొక్కటే తేడా మగాళ్ళ ఏడుపులకు, ఆడాళ్ళ గొప్పలకు తేడా 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: