నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఆంధ్రా ఇస్ఫెషల్

ముద్దబంతి పూవులో  పాటకు కాస్త సరదా అనుకరణ…..

  ………………………………………….. 
ముద్దపప్పు కూరలో ములక్కాడ పులుసులో
తెలుగువారి టేస్టులు ఎందరికీ తెలుసులే..? 11ముద్ద11

మిరపకాయలో కారం దాగుందని తెలుసును
గోంగూరను జోడిస్తే ఎమౌనో తెలుసునా..?ఆ..
చూసినా రుచి చూసినా కన్నీళ్ళూ వస్తాయి..
ఏ కన్నీటి వెనకాల ఏకారముందో తెలుసునా…? 11ముద్ద11

‘రసం ‘ అరవదే కాని ఘాటున్నది దానికి
లంకణాలు చేసిన మనిషికే తెలుస్తుందా రుచి
వడియాలను జత చేసి పదిలంగా తీసుకో
తిన్నాక హాయిగా కమ్మగా నిదురపో… 11ముద్ద11

ఆవకాయ మాగాయలే ఆంధ్రులకు రక్ష
సున్నుండలు జంతికలు శ్రీరామరక్ష
తిన్నోళ్ళు తిననోళ్ళు తీపి తీపి గురుతులు
నీరులొలికే మంటలూ మన తెలుగువారి వంటలూ 11ముద్ద11

ప్రకటనలు

Comments on: "ఆంధ్రా ఇస్ఫెషల్" (4)

 1. జ్యోతి గారు! శివరాత్రి రోజున ఏమిటండీ ముద్దపప్పు, ములక్కాడ పులుసునూ. ఏందుకండీ, మా ఉపవాస దీక్షని భంగం చేయదలుచుకున్నారు.

 2. Thanks for this Jyothi garu. We people who are living outside the state are really missing our “nOrUrinchE” food.

 3. “ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరీ” కి పేరడీ.

  కూరేసు కోబోయి చారేసుకున్నా హరీ
  కుక్కెత్తుకెళ్ళింది కూర గిన్నే.
  నేను కర్రెత్తుకుని దాని వెంట బడితే.
  అది భౌ..భౌ.

  ఆ.దే.ఈ.శు. విహారి
  http://vihaari.blogspot.com

 4. chaala bavundi.. navvaleka chachanu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: