నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

స్త్రీ


ఆడదానిగా పుట్టడం ఒక వరం.ఇది నా అభిప్రాయం.మళ్ళీ జన్మలో కూడా నేను స్త్రీలా పుట్టాలనే కోరుకుంటాను. నేను చెప్పేది ఒక సగటు భారతీయ స్త్రీ అనుభవాలు.ఎక్కువాగా నావే అనుకోండి.నా చుట్టూ ప్రపంచంలో నేను చూసిన అనుభవాలు.

మగవాళ్ళు పెళ్ళి కాకముందు ఏ బాదరబందీ,ఆంక్షలు

లేకుండా పెరుగుతారు,తిరుగుతారు.అందుకే పెళ్ళి కాగానే

 తమ స్వాతంత్ర్యము కోల్పోయామని ఫీలవుతారు.కాని

ఆడపిల్లలకు అసలు స్వాతంత్ర్యము ఉండదు.ఇవాళ కొత్త

 తరంలో  మార్పు ఉంది.పెళ్ళి  కాక ముందు తల్లితండ్రులు,

పెళ్ళి అయ్యాక భర్త,వృదాప్యంలో పిల్లలు చెప్పినట్టు ఉండాల్సి

 వస్తుంది.ఐనా వాళ్ళు అది సంతోషంగా నిర్వహిస్తారు.పెళ్ళి

 అనేది ఇద్దరినీ కలిపేది, వాళ్ళు మరో కుటుంబాణ్ణి,వంశాన్ని

వృధ్ధి పరచాలి.ఇది పరస్పర ప్రేమ,అనుబంధముతో నిర్వహించే

ప్రక్రియ.దీనికి బాదరబందీ అని ఎందుకనుకోవాలి.

నిజమే మగవాళ్ళు ఆడవాళ్ళంత ఓపికగా సహనంగా ఉండలేరు

.స్త్రీ జీవితంలో కూతురిగా,భార్యగా,తల్లిగా,అత్తగా ఇలా ఎన్నో

దశలు ఉన్నాయి.అటు పుట్టింటివారిని,అత్తింటివారిని మెప్పిస్తూ

 ఎవ్వరితోను మాటపడకుండా,తన సంసారాన్ని చక్క

దిద్దుకుంటుంది స్త్రీ.ఒక మగవాడు చదువుకుంటే అతడు

మాత్రమే చదువుకున్నట్టు,కాని ఒక స్త్రీ చదువుకుంటే

మొత్తం కుటుంబం చదువుకున్నట్టు అంటారుకదా. ఐనా

ఎవరైన క్రింద పడి దెబ్బతాకితే అమ్మా అంటారు కాని

అయ్యా అనో నాన్నా అనో అనరు కదా.ఆ బాధలో అమ్మ

 మాత్రమే గుర్తొస్తుంది కాబట్టి. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు

 కాబట్టే అమ్మను సృష్టించాడంటారు. పిల్లలకు కూడా అమ్మ

 దగ్గర ఉన్నంత చనువు నాన్న దగ్గరుండదు కదా.నాన్న

 అంటే గౌరవము భయము  ఉంటుంది.నాన్నను ఎదైనా

అడగాలనుకుంటే అమ్మ రికమెండేషన్ తప్పనిసరి.

భార్య స్తానంలో కూడా స్త్రీ తన బాధ్యతను సమర్ధవంతంగా

నిర్వహిస్తుంది.కొంతమంది తప్ప.కార్యేషు దాసి,కరణేషు

మంత్రి,భోజ్యేషు మాతా,శయనేషు రంభా అని ఊరకే అన్నారా

 పెద్దలు. మగవాళ్ళు సంపాదించడము, ఇంట్లోవాళ్ళకు అన్ని

 సమకూర్చడము తమ బాధ్యత అనుకుంటారు.అంతేనా

ఇంకా వేరే ఎమీ వుండవా? నిజంగా చెప్పండి. ఒక్కసారి

మీ అమ్మను గుర్తుకు తెచ్చుకుని, స్త్రీ జన్మ గొప్పదా,పురుష

 జన్మ గొప్పదా? ఎవరికెక్కువ బాధ్యతలు,ప్రేమ,సహనము,

స్వాతంత్ర్యము ఉన్నాయి.నేను ఎవరినీ ఉద్దేష్యించి అనటం

లేదు.భర్తకు అనుకూలంగా ఉంటూ,పిల్లలను సక్రమమైన

మార్గములో నడిపిస్తూ,ఎవ్వరినీ నొప్పింపక, తానొచ్చినా

ఎవ్వరికీ తెలియనివ్వక నడుచు స్త్రీ జన్మ ధన్యము !…………….

ప్రకటనలు

Comments on: "స్త్రీ" (4)

  1. స్త్రీ జన్మ గొప్పదా?
    పురుష జన్మ గొప్పదా?

    ఈ ప్రశ్నకు నా సమాధానం ‘స్త్రీ’ జన్మనే!నేను కూడా స్త్రీ పక్షపాతినే…కానీ నా ప్రశ్న ఉద్దేశం(context) వేరు.అయినా మంచి విషయాలు చెప్పారు.కృతజ్ఞతలు!

  2. మీరు చెప్పినవి అన్ని ఒకప్పుడు నిజమే.కానీ ఇప్పుడు చాలా వరకు కాదు అనుకుంటున్నాను.ఇప్పటి పిల్లలు తండ్రి దగ్గరే కూడా ఎక్కువ చనువుగా వుంటున్నారు[మా అబ్బాయి].దెబ్బ తగిలితే,నిద్రలో ఉలిక్కిపడిలేస్తే నాన్నా అని పిలిచే పిల్లలని కూడా నేను చూసాను[మావాడు కాదులెండి].కానీ ఎప్పటికీ స్త్రీ ఏ గొప్ప.అదిమాత్రం కాదనలేని నిజం.

  3. నేను నా అభిప్రాయం మాత్రమే చెప్పాను కాని ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు.

  4. chaala baaga raasaru. mee abhiprayam tho ekabavinchalekunda vunnanu. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: