నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మాట

ఇది గత ఆదివారం ఈనాడు సంచికలో వచ్చిన కథకు నా

స్పందన.అది చదివాక అనిపించింది నిజమే కదా ఎందరు

 మగాళ్ళు తమ భార్యలతో మనస్ఫూర్తిగా మాట్లాడతారు.

నేను చెప్పేది ఇప్పటి తరం కాదు. గత తరం వాళ్ళు చాలా

 మంది మగవాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. భార్యకు మంచి

 బట్టలు, తిండి,నగలు ఇచ్చాం ఇంకేం అవసరముంటాయిలే

అనుకుంటారు. కాని ఆడదానికి కావల్సింది అంటేనా.ఇంకా

 ఎక్కువ చనువిస్తే నెత్తికెక్కుతారని భయంగా ఉండేటట్టు

 దూరంగా ఉంచుతారు. తమ విషయాలు కాని, ఇంటి

 విషయాలు కాని భార్యతో చర్చించరు.వాళ్ళ మనసులో

 ఎముందో కనుక్కోరు. నేను చాలా మందిని చూసాను.

నిజంగా ఎంత మంది మగాళ్ళు కాని ఆడాళ్ళు కాని

తమ జీవిత భాగస్వామికి ఏం కావాలో ఎప్పుడైనా

మాట్లాడారా.సంతోషంగానే ఉంటారు (కనపడతారు)

ప్రేమగా ఒక్కసారి మాట్లాడి చూడండి.తన తీరని కోరిక

 ఎదో ఉంటుంది.అది ఖరీదైన వస్తువులు అసలే కావు.

 ఎవో చిన్న చిన్న ఆసలు. పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులను

 జీవితాంతం భాగస్వాములను చేస్తుంది. అలాంటప్పుడు

వాళ్ళిద్దరి మధ్య ఈ భయం, దూరం ఎందుకుండాలి.

ఒక్కసారి మీ జీవితభాగస్వామితో కాని, మీ అమ్మతో

గాని నాన్నతో గాని మనసువిప్పి మాట్లాడండి.అరమరికలు

 లేకుందా . వాళ్ళ కోరిక తీరనిది ఉంటుంది..మనమే

తెలుసుకోవాలి. గట్టిగా అడిగితే ఎవరూ చెప్పరూ.మగవాళ్ళు

 కఠిన మనస్కులు. కాని ఆడవాళ్ళు చాల సున్నితంగా

 ఆలోచిస్తారు కాని భయటపడరు. భర్త ఎమంటాడో అని..

ఆ కథను ఒక్కసారి చదవండి అర్ధమవుతుంది…..

http://www.eenadu.net/htm/weekpanel2.asp

ప్రకటనలు

Comments on: "మాట" (10)

 1. ఈనాటి అనంత వైవిధ్య మయ ప్రపంచంలో సాధారణీకరణాల (generalizations)తో ఏ విషయాన్నీ ఖరాఖండీగా నిశ్చయించలేకపోతున్నాం.

 2. అవును. అది అప్పటి తరం. ఇప్పుడింకా ఇలాంటి వారున్నారంటే మనం వెంటనే ఆమెనొక బ్లాగు రాయమని ఆ లింకును ఆమె భర్తకు పంపించాలి.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. మార్పైతే చాలా వరకు వచ్చింది (సామాజికం గా)
  కాని కొందరి వ్యక్తిగత జీవితాల్లో ఇంకా దూరాలు ఉంటూనే ఉన్నాయి.
  ఇది ఎవరి జీవితానికి, బాంధవ్యాలకి వారు అన్వయించి అలోచించవలసిన విషయం.

 4. ఇదే విషయం మీద నేను నా బ్లాగులో రాసిన కవితకి లలిత గారు రాసిన కామెంట్ ఇది…”బ్లాగుల్లో ఎంతో మంది మగ వాళ్ళ సున్నితమైన
  భావ వ్యక్తీకరణ చూస్తుంటే నాకు అడగాలనిపిస్తుంది,
  వాళ్ళందరూ(పెళ్ళైన వాళ్ళు) భార్యతో అంతగానూ మనసు విప్పి మాత్లాడతారా అని.
  ఆమె చెప్పే మాటలను సావధానంగా వింటారా,
  ఓపికగా సమాధానం చెప్తారా అని.

  నాకు తెలిసిన మగ వాళ్ళలో ఇది చాలా అరుదైన
  లక్షణం. మరీ కనిపించదు అంటే కోప్పడతారేమోనని
  అలా రాస్తున్నాను. మగ వాళ్ళు చెడ్డ వాళ్ళు అని నా
  అభిప్రాయం కాదు సుమండీ. కాకపోతే, “మాట్లాడుకోవడం”
  ప్రాముఖ్యత వాళ్ళకు ఎందుకు అర్థం కాదు అని?”
  ఇక నా స్పందన …నిజమే ఇప్పుడు అలా లేదు.వింటున్నారు.కానీ ఎలా వింటున్నారు?ఇక్కడ ఎంతమంది మగాళ్ళు భార్య మాట్లాడుతున్నప్పుడు ఏ పనీ చేయకుండా సావధనం గా వింటున్నారు?మా వారు అయితె సిస్టం ని టిక్కు టిక్కులాడిస్తూనో,టీవీ చూస్తూనో ఎదో వింటున్నానన్నట్టు గా వింటారు.ఇక్కడ అందరూ అంటున్న “వింటున్నాను” అనేది ఇలాగేనా?

  మిగిలిన వారి స్పందన కూడా ఇక్కడ చదవండి.
  http://snehama.blogspot.com/2007/02/blog-post_19.html

 5. radhika gaaru alaa anadam maree vidduram. andaru magaallu alaane untaarani enduku anukuntunnaru

 6. రాజేంద్ర కుమార్ దేవరపల్లి said:

  జ్యోతిగారూ,మీకు దిగువమధ్య తరగతి,ఇంకా దిగువున ఉన్న కుటుంబాలతో పెద్ద పరిచయం లేకపోవటం వల్ల ఆవిధంగా భావిస్తున్నారని నేను ఊహిస్తున్నాను.ఆ కుటుంబాలలో పరస్పర సంప్రదింపులు లేకుందా రోజువారీ జీవితం నడవలేదు.ఎన్నో inhibitions మరెన్నో భ్రమలు,భయాలు,ఊహాపోహలు,ఇంకొన్ని స్వైర కల్పనలు,ఇలా అనంతమైన కారణాలు కుటుంబసభ్యుల మధ్య,ముఖ్యంగా మధ్యతరగతి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషను గ్యాప్ తెస్తుంటాయి.మళ్ళ్ ఈపెద్దలే పిల్లలకు ఏవేవో నేర్పిస్తుంటారు.చెప్పాలనుకున్నది ఏదొ చెప్తే గదా అవతలివాళ్ళు విని అర్ధం చేసుకునేది లేనిదీ తెలిసేది.చెవులకు మూత లేదు.పెదవులు పలికితేనే ఎవరయినా వినగలిగేది.ఎంత కాళిదాసయినా భార్య చెప్తే తప్ప ఇంట్లోకి ఏకూర తేవాలో తెలుసుకోలేడు.పతిదేవుడి పాదాల చెంత ఇంత చోటు ఇస్తే చాలు,ఆయనగారి పాదధూళి శిరస్సున దాలుస్తాను అనే మాటలు,సినిమాల్లోనూ,పుస్తకాల్లోనూ కనిపించటం మానేసి చాలాకాలమయ్యింది.మనలో ఎదుటి వారిలో,పిల్లల్లో పర్ ఫెక్షను కోసం వెతకటం వల్ల ఇన్ని బాధలు.గుళ్ళూగోపురాలకు రద్దీ పెరగటం,యుక్తవయసు పిల్లలు స్నేహితుల మాటలకే ప్రాధ్హన్యత ఇవ్వటం దీని పర్యవసనాలే.మన ఆలోచన మనకు స్పష్టంగా ఉంటే అంత స్పష్టంగానే చెప్పగలుతాము.అందుకే ఒకటిరెండు సార్లు ఆలోచించుకుని మెల్లగానయినా చెప్పేయాలి.ఇప్పుడు ఫిక్సుడు డిపాజిట్లకే సరిగ్గా చెల్లిపులు లేవు,మరి మనమాటలకు మెదడులో పెరిగే వడ్డీ ఒత్తిడి,శారీరక రుగ్మతలు.

 7. నేను రాజేంద్ర గారితో ఏకీభవిస్తున్నాను. దేనినీ జెనరలైజ్ చేసి మాట్లాడలేం. అప్పటి తరమైనా ఇప్పటి తరమైనా…మగాళ్ళయినా ఆడాల్లయినా.

 8. anytime anywhere a common man can dominate his wife. he never thinks what her feelings are and what she wants to express. only he do what he wants. but it is necessary of sharing nature in life.without sharing there is no name for marriage and living together. if there is no sharing what is the use of living together.

 9. jyothi garu mee matalatho nenu ekibhavistanu adavariki kuda sontha manasu anedi untundi ani kani nadoka vinta samasya na wife ni nenu 3 months nundi adugutunnanu kani intavaraku naku tana manasulo mata cheppadam ledu tana manobhavalu evi kuda nato cheppadu,panchukodu mari nenu em cheyali. nenu tanameeda unna istani enno panula dwara chesi choopinchanu ante chala surprises dwara kani naku tana manasulo emundo teliyadam ledu marala nenu istapadi korukonna manishi ante tanu kuda istapade pelliki oppukundilendi meeru em anukonante na wife nato free ga undalante nenu inka em cheyali annatu nenu newly married.pls help me na mail address ichanu naku me suggestion istarani leda mee patakula dwaranina sare itlu vijay.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: