నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పాపం పదమూడు 13

                                                       

పదమూడు సంఖ్య అంటే భయం ప్రపంచమంతా ఉంది. ఉత్తర భారతదేశంలో 13 అంటే వణికిపోతారు.

 తీన్-తేరా,ఆఠ్-అట్టారహ్‌లు మంచివికావని చెప్పుకుంటారు.క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు 13

సoఖ్యను ఆటగాళ్ళు ఇష్టపడరు. 13 సంఖ్య మీద అపనమ్మకం మనదేశంలో తక్కువ .విదేశాలలో

అత్యధికం. 13ని అసలు తలుచుకోవడానికే ఇష్టపడరు.బ్రిటన్‌లో లాడ్జ్‌లలో 13వ రూం నెంబర్

ఉండదు. అంతేకాదు ఎత్తైన బిల్డింగులలో 13వ అంతస్తూ కట్టరు. 2 వ అంతస్తు తర్వాత 14వ

అంతస్తు అంటారు.ఆ దేశ విమానాలలో 13వ సీటు వుండదు. ఇక ఆసుపత్రులలో అయితే

13వ నెంబర్ బెడ్ వుండదు. 13వ వార్డు అనే మాట తలచే ప్రసక్తే వుండదు. ఎందుకంటే ఆ

బెడ్ మీద పడుకుంటే ఇంక అటునుండి అటే పైలోకంలోకి అనుకుంటారు. ఫ్రాన్స్ దేశంలో

13 కుర్చీలు ఒక చోట వేయరు. బల్ల చుట్టూ 13 మంది కూర్చుని భోఝనం చేయరు. 13

మంది ఉన్నట్టు తెలిస్తే, ఒకరు అక్కడినుండి లేచి మరో చోటుకు వెళతారు, లేదా మరో

కుర్చీ వేసి 14వ వారిని పిలిచి కూర్చోమంటారు. మనదేశంలో ముగ్గులు కలిసి వెళ్ళడం

 అశుభం అనుకుంటారు. ఈ 13 వ సంఖ్య మీద దురభిప్రాయం బలపడే సంఘటన

ఒకటి అమెరికాలో జరిగింది కూడా.1970లో అపోలో 13 ను అమెరికా కాలమానం

 ప్రకారం 13గంటల13నిమిషాలకు ప్రయోగించారు. ఆ ప్రయోగం విఫలమైంది. అపోలో

 అంతరిక్షనౌకలలో విఫలమైనది అపోలో 13 మాత్రమే.దీనితో 13 అంటే భయం

సామాన్యులనుండి శాస్త్రవేత్తల వరకు పాకింది. 

                                       

 13వ సంఖ్య క్రైస్తవులకు అసలు పడదు. జీసస్ శిలువకి ముందు తన ముఖ్య శిష్యులు

కలసి భోజనం చేశారు. అందులో 13వ వాడైన జోడాస్కి దుర్భుద్ధి పుట్టి జీసస్‌ని యూదు

రాజులకు పట్టించాడంటారు.ఆ లాస్ట్ సప్పర్ మరుసటిరోజు జెసస్‌ని శిలువ వేశారు. ఆ

తేది13 శుక్రవారం.అందుకే 13 శుక్రవారం అంటే క్రైస్తవులకు భయాందోళణలు కలుగుతాయి 

                                           
అమెరికాదేశపు ఆరంబంలో 13 మీద సదభిప్రాయమే వుండేదనుకోవాలి. ఎందుకంటే

అమెరికన్ డాలర్ మీద అన్నీ 13 లే వుండటం గమనించాలి..డాలర్ మీద 13 అంతస్తుల

 పిరమిడ్ బొమ్మ ముద్రించబడి వుంటుంది.ఆ నోటు మీద 13 నక్షత్రాలు, 13 బాణాలు,

13 చారలు, 13 ఆలివ్ ఆకులు… ఇలా అంతా 13 ఆధారంగానే ఆ నోటు రూపం వుండటం

గమనించగలం.13 మీద అంత భయం, అపనమ్మకం వుండివుంటే తొలిగా నోటు దిజైన్

 చేసినపుడు ఇన్నిరకాల పదమూడులను దానిమీద చూపేవారుకాదుకదా!
కాని ఈ భయం హైందవ సంస్కృతిలో లేదు. 13 సంఖ్య నూతన ఆరంభానికి

సంబంధించనదిగా భావిస్తారు. పన్నెండు రాశుల తరువాత వచ్చేది 13వది…అంటే తిరిగి

తొలిరాశి ఆరంభవుతుంది.సంవత్సరంలో వున్నది 12 నెలలు అవి పూర్తవగానే వచ్చే

 పదమూడవ నెల ఉగాది.అంటే కొత్త సంవత్సరం. హైందవ పురాణాలలో వర్ణింపబడిన

సుమేరు పర్వతానికి వున్నది 3 మెట్లు. దీనిలో శ్రీయంత్రంగా చిత్రీకరించారు.
మనిషి మరణీంచిన తర్వాత 13వ రోజును ప్రత్యేకదినంగా జరుపుతారు. బంధుమిత్రులంతా

 మరణించిన వ్యక్తికి కర్మకాండలు జరిపే రోజు అది. పదమూడవ రోజు నాడు భగవంతునిలో

ఐక్యమవుతారంటారు. మనిషి ప్రకృతిలో 13 సంఖ్య కీలకం మానవ శరీరంలో ముఖ్యమైన

 కీళ్ళ సంఖ్య 13. చంద్రుడు ఆకాశంలో ప్రతిరోజు 13 డిగ్రీలమేర ప్రయాణం చేస్తాడు. సంఖ్యా

 శాస్త్రం ప్రకారం 13 బేసి సంఖ్య దేనికి లొంగదు. ఏ రెండు అంకెల హెచ్చవేతతో ఇది రాదు

 దీనిని భాగించడం కుదరదు.

13 సంఖ్య సిక్కు మతస్థులకు ఒక్ ప్రత్యేక సంఖ్య. వారి భాషలో ‘తేరా’ అంటే ‘ మీదే ‘ అని అర్ధం

 వస్తుంది.ఎమైనా ఒక దురభిప్రాయం ఒకసారి ఏర్పడకూడదు. ఒకసారి ఏర్పడితే అంత

సులభంగా వదలదు. తమకున్న అభిప్రాయాన్ని బలపరుచుకునేందుకు వీలుగా కొత్త

సాక్ష్యాలను వెతుక్కుని రికార్డు చేస్తూనే వుంటారు. ఇదంతా 13 సంఖ్య దురదృష్టం 

అనుకోవాలా!

ప్రకటనలు

Comments on: "పాపం పదమూడు 13" (5)

 1. ఆమ్మో.. ఎంటండి. పదముడు కు అంత సీన్ వుందా? చాలా కొత్త విశయాలు చెప్పారు. బ్లాగుంది.

 2. 13 మీద పీ.హెచ్‌.డీ చేసినట్టున్నారే 🙂 విశాఖపట్నంలో మా ఇంటి నెంబరు 13 అండీ!

 3. ఇంకా కొన్ని…

  ఆఫీస్ 2007 (Office 12) తరువాత ఆఫీస్ 13 రావటం లేదు. తరువాయి వెర్షన్ ఆఫీస్ 14 🙂

  అపోలో 13 మాత్రం నాకు తెలిసి ఫలవంతమైన విఫల ప్రయోగం. అత్యంట
  ప్రమాదకర పరిస్థితులలో కూడా..అందరూ క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు.

  ఇంటి నంబరు పదమూడు అని ఒక భయానక చిత్రం కూడా ఆ మధ్య వచ్చింది

 4. 13 మీద సంపూర్ణ సమాచారమిక్కడ వున్నట్లుందే!
  –ప్రసాద్
  http://blog.charasala.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: