నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

కన్య

 

     (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2, పాదాలు)

ఆదాయం-11 వ్యయం-5 రాజపూజ్యం-4 అవమానం-5

 

రాశివారికి గురుడు నవంబరు 21 వరకు మూడింట లోహమూర్తి. తదుపరి నాలుగింట

తామ్ర మూర్తి. శని జులై 15 వరకు పదకొండింట లోహమూర్తి. తదుపరి ఏడాది అంతా

పన్నెండింట సువర్ణమూర్తి. రాహువు ఆరింట.కేతువు పన్నెండింట తామ్రమూర్తి. రాశి

వారికి జులై 15 నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతున్నది. అయితే రాశి అధిపతి

బుధునకు శని అత్యంత మిత్రుడు కాబట్టి మూర్తిమంత రిత్యా మొదటి రెండున్నర

సంవత్సరములు సువర్ణమూర్తి కాబట్టి కొన్ని ఇబ్బందులు తలెత్తినా సత్ఫలితాలు ఇస్తాడు.

ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నతికి

అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అయితే శనికి తైలాభిషేకం,శనివార

నియమం, గోసేవ, స్వయం భూలింగ దర్శన,వెంకటేశ్వర, నవగ్రహ ఆరాధనల వల్ల కష్టాలు

తొలగి అధిక ఫలితం సాధించే అవకాశం ఉంటుంది.

 

గురుడు శుభప్రదుడే అయినప్పటికి సెప్టెంబర్ వరకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం

ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యం పాలవుతారు. పనులు మందకొడిగా

సాగుతాయి. వృత్తి పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. వ్యవహారాల నిర్వహణ సామర్ధ్యం కొర

వడుతుంది. సోదర, బంధువర్గ వ్యతిరేకత మనస్తాపం కలిగిస్తుంది. వృధాప్రయాస అధికం.

నవంబరు తరువాత 4 స్థానమున గురుడు స్వక్షేత్రంలో సంచరిస్తాడు. అయితే ప్రయోజనం

మాత్రం పరిమితంగా ఉంటుంది. భూగృహ నిర్మాణం, పెట్టుబడులు, ఆస్తి వ్యవహారాలలో

కొన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో

చికాకులు తప్పవు. మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రుల నుంచి ఊహించని సమస్యలు

ఎదురయ్యే అవకాశం ఉంది.

 

రాశి వారికి ద్విస్వభావ తత్వం కలవారు, అందువల్ల వీరికి దైవబలం బాగా తోడ్పడుతుంది.

కంగారు, కోపతత్వం,  చిత్త చాంచల్య స్వభావాన్ని వదిలిపెట్టాలి విద్యార్థులు బాగా శ్రమిస్తే కాని

ఆశించిన ఫలితాలు సాధించలేరు. ఇంజనీరింగ్ విద్యార్థులకు కొంత ఊరట కలుగుతుంది. అన్ని

 రంగాల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాలు, కాంట్రాక్టర్లు, స్టాకిస్టులకు

అనుకూలమైన సంవత్సరం, మిల్లర్లు, యంత్రాల వ్యాపారులకు  అభివృద్ధి కనిపిస్తుంది.

కళాకారులు, కవులు, పండితులకు, శాస్త్రకోవిదులకు శుభయోగదాయకం, స్పెక్యులేషన్‌లు

లాటరీ చాన్సులు, షేర్ల లావాదేవీలు, కాంట్రాక్టులు కలిసి వస్తాయి. విద్యార్థులకు నూతన ఉద్యోగ

ప్రాప్తి, విదేశీ వ్యవహారాలు, కిరాణా, కలప, అపరాలు, ఫాన్సీ,ఫైనాన్స్ రంగాల వారికి మిశ్రమ

ఫలితాలు కనిపిస్తాయి.

కోళ్ళ ఫారాలు, మత్స్యం, వస్త్రాలు, బంగారం, ఫైనాన్స్ వంటి వ్యాపారాల

వారికి 1,2,3,4,5,6,9 నెలలు విశేషలాభం. న్యాయవాదులకు శాస్త్ర కళాకోవిదులకు

ప్రోత్సాహకరం, వ్యవసాయదారులకు ఫలితాలు మద్యస్థంగా ఉంటాయి. దుర్గ, శనీశ్వర, లక్ష్మీ,

గణేష పూజలు, తైలాభిషేకం, గురువార నియమాలు కలిసివస్తాయి. స్త్రీలు శుక్ర, గురువార

నియమాలు, లలితా, సుబ్రమణ్య, దుర్గా పూజలు సౌఖ్యప్రదము. ఉత్తరవారు కెంపు,

పుష్యరాగం,హస్తవారు ముత్యం, చిత్తవారు ముత్యం, పగడం ధరించిన మేలు. అదృష్ట సంఖ్య

5,1,3,4,6 ఆది, శుక్ర, సోమవారాలు కలసిన యోగ్యప్రదం. 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: