నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

కర్కాటకం

    (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

 

ఆదాయం-5 వ్యయం-2 రాజపూజ్యం-5 అవమానం-2

 

కర్కాటక రాశివారికి నవంబరు 21 వరకు గురుడు ఐదింట సువర్ణమూర్తి. తదుపరి ఆరింట

తామ్రమూర్తి, శని జన్మమందు జులై 5 వరకు తరువాత రెండింట సువర్ణమూర్తి. ఏడాది అంతా

 రాహువు ఎనిమిదింట, కేతువు రెండింట లోహమూర్తులు.ఉగాది నుంచి నవంబర్ వరకు

గురుసంచార ప్రభావం వల్ల కర్కాటక రాశివారికి విశేష శుభఫలితాలు కనిపిస్తాయి. గౌరవ

మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సఖ్యత

పెరుగుతుంది. సంకల్పం నెరవేరుతుంది. శని, రాహు, కేతు సంచార ఫలితంగా ఆరోగ్య,

ఆర్ధిక విషయాలలో కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి పై అధికారుల

నుంచి చిక్కులు ఎదురౌతాయి. అనుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. రుణబాధ

తప్పకపోవచ్చు. ధైర్యం వీడకుండా కృషి చేస్తే అని రంగాల్లో సత్ఫలితాలు సాధించే అవకాశం

ఉంది. కీలక విషయాల్లో ఇతరులను విశ్వసించకపోవడం సమయంలోమంచిది.

ఘర్షణల సమయంలో మౌనం మేలు.  వ్యవసాయం, కాంట్రాక్టులు, స్టాకిస్టులకు ఆశించిన

ప్రయోజనాలు సమకూరకపోవచ్చు. ఉద్యోగులకు ఒత్తిళ్ళు, స్థాన చలనం జరిగే సూచన

లున్నాయి. ఊహించని ఖర్చులు అధికం.

అయితే ఏడాది అంతా గురువు అనుకూలంగా ఉన్నందున సమస్యలు ఉన్నప్పటికీ వాటిని

అధిగమించి పురోగతి సాధిస్తారు. భూసేకరణ,గృహనిర్మాణం, శుభకార్యాల నిర్వహణలో

ఆటంకాలు ఎదురవుతాయి. గణితం, ఇంజనీరింగ్ విద్యార్థులకు పురోభివృద్ధి. భాషాకోవిదులు,

సైన్సు విద్యార్థులకు మొదట ప్రతికూలత కనిపించినా శ్రమిస్తే సత్ఫలితాలు కనిపిస్తాయి. వైద్యులు,

నటగాయకులకు, కళాకారులకు చేతి వృత్తిదారులకు ఫలితం మధ్యస్థం. వ్యవసాయ రంగంలోని

వారు కొత్త పద్ధతులు పాటించడం వల్ల సత్ఫలితాలు సాధిస్తారు.

 

పరిశ్రమలు, ధాన్యము, యంత్ర వ్యాపారులకు 3,4,8,11,12 నెలలు ప్రతికూలం. మిగిలిన నెలలలో

 ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫైనాన్స్, వస్త్ర, రసాయన వ్యాపారులకు సంవత్సర పూర్వార్ధము

మేలు. మత్స్య, కోళ్ళు, కలప అపరాలు, పేపరు, లోహము వ్యాపరులకు 2,5,6,10,12 కాక తక్కిన

మాసములు లాభకరం. పునర్వసువారు పుష్యరాగం ధరించుట మేలు. రాశివారికి అదృష్ట

సంఖ్య 2. ఏడాది మొదటి ఆరు మాసాల్లో శుభకార్యాలు కలిసివస్తాయి.

 

మంగళ, శుక్రవార నియమాలు, దుర్గా, లలితా స్తోత్ర పారాయణం, సుబ్రహ్మణ్య, నవగ్రహ,

 రుద్రాభిషేకం, ఆంజనేయ పూజలు, శివాలయూ సంధర్శనం చేయడంవలన శాంతి లభిస్తుంది.

స్త్రీలకు గణపతి, లక్ష్మీ, సాయి, మారుతి పూజలు చేయుట  వలన కుటుంబములో ఋణ

విముక్తి, ఆరోగ్య వృద్ధి, సంతాన పురోభివృద్ధి కలుగుతుంది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: