నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మకరం

( ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)

 

ఆదాయం-2 వ్యయం-8 రాజపూజ్యం-2 అవమానం-4

 

రాశివారికి గురువు నవంబరు 21 వరకు పదకొండింట లోహమూర్తి. తదుపరి పన్నెండింట

 సువర్ణమూర్తి. శని జులై 15 వరకు ఏడింటా లోహమూర్తి, తదుపరి సంవత్సరమంతా

ఎనిమిదింట తామ్రమూర్తి. రాహువు రెండింట,కేతువు మూడింట సువర్ణమూర్తులు.నవంబరు

 వరకు గురుడు లాభస్థానమున అనుకూల ఫలితాలు ఇస్తాడు.నవంబరు తరువాత గురుడు

 వ్యయంలో ఉన్నప్పటికీ స్వక్షేత్ర స్థితి కాబట్టి శుభకార్యాలకోసం ఖర్చు చేస్తాడు. బంధు

మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమయస్పూర్థితో లక్ష్యాలు సాధిస్తారు.  స్నేహశీలత,

పట్టుదలతో అనుకున్న పని సాధించడంలో వీరికి వీరే సాటి. ప్రతి పనిలోనూ మొదట కొన్ని

 అడ్డంకులు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు విశేష ఫలితాలు

సాధిస్తారు. సైన్సు, గణితం, ఉన్నత విద్య, న్యాయ, వైద్య రంగంలోని వారికి శుభఫలితాలు

 కనిపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు

పై అధికారుల సహకారం లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూల సమయం. నట

గాయకులకు, స్వయం ఉపాధి కలవారు ఏడాది ద్వితీయార్థంలో గౌరవ మన్ననలు

 అందుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, యంత్రాలు, స్టాకిస్టులు, ఆర్ధిక రంగాలవారికి

మొదట చిక్కులు ఎదురైనా చివరకు విజయం సాధిస్తారు.

 

శని కేతువుల సంచారం అంతగా అనుకూలంగా లేకపోవడంతో సంభాషణల్లో తొందరపాటు

 తగదు. శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. స్త్రీల వల్ల

 ఇబ్బందులు ఎదురౌతాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యాలు, చోరభయం అధికంగా ఉంటుంది.

 భూ, గృహ, వాహనాల విషయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. సెప్టెంబరు తరువాత

 ఆరోగ్యము, సంతానము, భాగస్వామి, ఆహార విషయాలలో ముందు జాగ్రత్త అవసరం.

పరిశ్రమలు, సాంకేతిక రంగమ, టెక్స్టైల్స్, నూనెలు, రసాయనాల వ్యాపారులకు పరిస్థితి

 కొంత నిరాశాజనకంగా ఉంటుంది. కోళ్ళూ, ఫైనాన్స్ రంగాలవారు మొదట ఇబ్బందులు

 ఎదుర్కొన్నా సంవత్సరాంతంలో సత్ఫలితాలు సాధిస్తారు. రిటైల్, ఫ్యాన్సీ, బంగారం, ధాన్యాల

వ్యాపారులకు 2,3,4,6,11,12 నెలలు విశేష లాభదాయకం.

 

రాశివారికి అదృష్ట సంఖ్యలు 3,4,5,8,9 సోమ మంగళ, శుక్రవారములు, రామచంద్రమూర్తి

 ఆరాధన, రుద్రాభిషేకములు శని, సోమవార నియమములు శుభప్రదం. వీటివల్ల మానసిక

 ఆనందము, కార్యసిద్ధి, సంతాన వృద్ధి కలుగుతుంది. నిత్యం స్వయం భూలింగదర్శనం విశేష

ఫలితములు ఇచ్చును. ఉత్తరాషాఢవారు పగడం,కెంపు, శ్రవణంవారు ముత్యం, నవరత్నాలు,

 ధనిష్ఠవారు పగడం ధరించుట మేలు. స్త్రీలు గురు,శనివారనియమం, దత్తాత్రేయ, సాయి,

 లలితపారాయణం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: