నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

కుంభ

 .

(ధనిష్ట 3,4 శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

 

ఆదాయం-2 వ్యయం-8 రాజపూజ్యం-5 అవమానం-4

 

రాశివారికి గురుడు నవంబరు 11 వరకు పదింట సువర్ణమూర్తి. తదుపరి పదకొండింట

రజితమూర్తి. శని జులై 15 వరకు ఆరింట. తదుపరి ఏడింట సువర్ణమూర్తి. ఏడాది

అంతా రాహువు జన్మమునందు,కేతువు ఏడింట రజితమూర్తులు. సర్వజిత్ నామ

సంవత్సరంలో కుంభరాశివారికి గురుబలం విశేషంగా ఉంది. నవంబరు వరకు 10

స్థానంలో సంచారం అంతగా అనుకూలం కాకపోయినా శుభమూర్తిమంతం చేత మొదట

పరీక్షలకు గురిచేసినా తరువాత సత్ఫలితాలనిస్తాడు. భారీ కార్యములు చేపట్టడం

వీరి స్వభావం. ఏడాది వీరు నెమ్మదిగా ప్రయత్నిస్తే సత్ఫలితాలు సాధిస్తారు.

నూతనోత్సాహంతో  ప్రతిపనిలో ముందడుగు వేయాలి. చేతి వృత్తుల వారికి శుభప్రదం .

వృత్తి వ్యాపారాల్లో లాభాలు అర్జిస్తారు. నూతన విద్యా వ్యాపారాలు ప్రారంభించి పురోగతి

సాధిస్తారు. వ్యవసాయ రంగంలోనివారు ముఖ్యంగా తోటల పెంపకందారులు లాభాల

నార్జిస్తారు. ఏజెన్సీలు, రవాణా, కాంట్రాక్టులు, ఫైనాన్స్, ఇనుము, నూనెలు, రసాయనాల

 వ్యాపారులు విశేషంగా లాభాలార్జిస్తారు. వైద్యులు, న్యాయవాదులకు శుభప్రదం.

 రాజకీయ రంగంలోని వారికి పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం

లభిస్తుంది. శాస్త్రవేత్తలకు అనుకూఉలమైన సంవత్సర. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న

 పనులు పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాల్లో చిక్కులు ఎదురైనా చివరకు చక్కటి

పరిష్కారం సాధిస్తారు.

 

శని, కేతువుల ప్రతికూల దృష్టి కారణంగా చర్మవ్యాధులు, అనవసరమైన అనుమానాల

కారణంగా అశాంతి, జగడములకు అవకాశం ఉంది. ప్రయాణాలలో మెలకువ అవసరం.

మోకాళ్ళ నొప్పులు, శారీరక రుగ్మతలు, జంతుభీతి,పుత్ర, కళత్ర అనారోగ్య, స్త్రీ వివాదం

వచ్చే అవకాశం ఉంది. కిరాణా, అపరాలు, చేపలు, కోళ్ళూ, బంగారం వ్యాపారులకు

1,2,3,4,5 మాసాలు మంగళ, గురువారమూ యోగప్రదం. ధనిష్టవారు పగడం,

పుష్యరాగం, శతభిషవారికి గోమేధికం, ముత్యం, పూర్వాభాద్రవారు పుష్యరాగాభరణం

ధరించుట అదృష్ట ప్రదం. సంవత్సరమున రాహు కేతు గ్రహాలకు జపం,

సుబ్రహ్మణ్యాభిషేకం, సర్వసూక్తి పారాయణ, చండీ హోమం చేయటం మానసిక

శాంతినిస్తుంది. మహాలక్ష్మీ, దుర్గా, సాయి, గణేశ పూజలు దైవదర్శనం, శనివార

నియమం, సంపూర్ణ నవగ్రహారాధన ద్వారా స్త్రీ సౌఖ్యం కలిగి జ్వర పీడలు తొలగిపోతాయి.

 స్త్రీలకు ఆది, శుక్రవారాలు, సాయి, లక్ష్మీ  పారాయణం విశేష ఫలితమునిచ్చును. 

ప్రకటనలు

Comments on: "కుంభ" (1)

  1. Hey thanks Jo
    I loved to read my raasi phalalu.

    Regards,
    S

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: