నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మిధునం

(  మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

 

ఆదాయం-11 వ్యయం-5 రాజపూజ్యం-2 అవమానం-2

రాశివారికి గురుడు అక్టోబరు 27 వరకు ఆరింట, తదుపరి ఏడింట, వత్సరమంతయు

తామ్రమూర్తి. శని జులై 15వరకు రెండింట తామ్రమూర్తి. తదుపరి వత్సరమంతయు

మూడింట రజితమూర్తి. ఏడాది అంతా రాహువు తొమ్మిదింట, కేతువు మూడింట 

సువర్ణమూర్తులు.. సర్వజిత్ నామ సంవత్సరమంతా రాశివారికి శుభాశుభ

మిశ్రమములు కనిపిస్తాయి. ఏలిననాటి శని బాధ తొలగి పోవడంతో ఆరోగ్యం మెరుగుపడి

ఉల్లాసంగా ఉంటారు. గురు సంచార ప్రభావంతో భూ వ్యవహారాల వల్ల ఆర్ధిక పరిస్థితి

ప్రోత్సాహకరంగ ఉంటుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. అయితే నరాల

బలహీనత, రక్తపోటు వంటి సమస్యలు కనిపిస్తాయి. సెప్టెంబరు తరువాత కొందరి

విషయంలో శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. ప్రత్యర్ధుల నుంచి ఇబ్బందులు

ఎక్కువవుతాయి. కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉన్నప్పటికి గురు ప్రభావంతో,

దైవ బలంతో దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో వివాహాది శుభకార్యములు జరుగుతాయి.

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన దంపతులు పొరపచ్చాలు రాకుండా

జాగ్రత్తపడాలి. ఉద్యోగులు, చిరువ్యాపారులకు ప్రభుత్వం, పై అధికారుల నుంచి

చిక్కులు ఎదురైనా పురోభివృద్ధికి ఢోకా ఉండదు.ఉమ్మడి వ్యాపారంలో

భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘాకాలిక పెట్టుబడులకంటే  స్వల్పకాలిక

పెట్టుబడులే లాభదాయకం. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు

కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి పదవీగండం కనిపిస్తున్నది. కోర్టు

వ్యవహారాలను తాత్కాలికంగా పరిష్కరించుకోవడం మేలు.

 శాస్త్రవేత్తలు, వైద్యులకు నిరాశ తప్పకపోవచ్చు. విద్యార్థులకు ఏడాది ప్రోత్సాహకరంగా

ఉంటుంది. షేర్లు, మత్స్యములు, కోళ్ళ ఫారాలు తదితర వ్యాపారస్తులు రాణిస్తారు. కవులకు,

నటగాయకులకు, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకరం  ఫైనాన్స్, లోహము,కిరాణా,

రసాయనిక , వస్త్ర ధాన్య వ్యాపారులకు 1,5,8,9,10,12 మాసాలలో సత్ఫలితాలు

కనిపిస్తున్నాయి. ఏడాది ద్వితీయార్థంలో జన్మకుజ సంచారం వలన రక్తపోటు,

రోడ్డు ప్రమాదాలు, సోదర బంధువర్గం కారణంగా అధికవ్యయం, ఆందోళన అధికం.

కుజ, గురులకు జపశాంతులచే కొద్ది ఉపశమనం కలుగవచ్చు. నూతన దంపతులు

కనక పుష్యరాగం ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

జన్మజాతకం చూపించుకొని శాంతి చేయించుకోవడం మంచిది. రాశి వారికి

అదృష్ట సంఖ్యలు 1,5,6,7,8 ఆది శుక్రవారాలు కలిసి వచ్చిన తేదీల్లో సత్ఫలితాలు

సాధిస్తారు. మృగశిరవారు పగడం, పుష్యరాగం,ఆర్ద్రవారు గోమేధికం, పచ్చ,

 పునర్వసువారు ముత్యము, పుష్యరాగము ధరించుట యోగదాయకం. మొత్తం మీద

  రాశివారికి సంపూర్ణ నవగ్రహశాంతులు,ఏకాదశ రుద్రాభిషేకములు, మహా

మృత్యుంజయ దీపం పెట్టడం, తరచు శివదర్శనము, మంగళ, గురువార నియమములు

ఆచరించుట సర్వత్రా శ్రేయస్కరం. శుభకార్యాలు, భూగృహనిర్మాణం, ఇతర వ్యవహారముల

 యందు వాయిదా వేయుట లేక ఆచితూచి అడుగిడుట శ్రేయస్కరము.  

   

 

 

ప్రకటనలు

Comments on: "మిధునం" (3)

  1. Good excellent site, Telugu site never saw

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: