నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మీనం

           (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

 

ఆదాయం-8 వ్యయం-5 రాజపూజ్యం-1 అవమానం-7

 

రాశివారికి గురువు నవంబరు 21 వరకు తొమ్మిదింట తామ్రమూర్తి. తదుపరి పదింట

సువర్ణమూర్తి. శని జులై 15 వరకు ఐదింట తామ్రమూర్తి తదుపరి సంవత్సరమంతా ఆరింట

రజితమూర్తి. రాహువు పన్నెండింట. కేతువు ఆరింట లోహమూర్తులు. 

 

రాశివారికి గురుడుభాగ్య స్థానంలో ఉండడంతో సజ్జన సహవాసం, బంధుమిత్ర

సమాగమం, త్యాగం. భోగం, దైవదర్శనం, వివాహాది శుభకార్యాలు, ఉద్యోగ, భూగృహాలలో

లాభాలు, ఆరోగ్యాభివృద్ధి జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శని, రాహు సంచార

ప్రభావంతో సంతానానికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే గురుని శుభ

దృష్టి కారణంగా సులువుగా సమస్య నుంచి బయట పడతారు. జులై తరువాత శని, కేతు

సంచారం వల్ల దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. భూగృహాది

నిర్మాణం,నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. మిత్రుల

సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.వ్యవసాయ రంగంలోని

 వారు కూడా సత్ఫలితాలు సాధిస్తారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. విద్యార్థుల,

విదేశాలకు వెళ్ళాలనుకొనే వారికి సంకల్ప సిద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సినీ

నిర్మాతలు, కళాకారులకు శుభఫలితాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత

 పదవులు లభిస్తాయి. ఇంజనీర్లు,ఉపాధ్యాయ వృత్తులవారికి బదిలీ  యత్నాలు ఫలిస్తాయి.

గౌరవ మర్యాదలు అందుకుంటారు. మత్స్య, కోళ్ళూ, రైస్ మిల్లర్లు , ఎరువులు, చిరు

వ్యాపారులకు కొద్దిపాటి ఇబ్బందులు, ఋణభారం, శతృపీడ ఉన్నప్పటికీ సంవత్సరాంతంలో

శుభప్రదం.నూతన పెట్టుబడులు కలిసి   వస్తాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. పూర్వాభాద్రా

 వారు పుష్యరాగం, పగడం ఉత్తరాభాద్రవారు నీలమణి, రేవతి వారు పచ్చ ధరించిన విశేషవృద్ధి

కనిపిస్తుంది, కుజ, గురు, రాహు జపాలు మంగళ, శని నియమాలు, విష్ణుసహస్రనామ

పారాయణం, ఆంజనేయ పూజ, దేవి పారాయణం చేసిన విశేషయోగం. రాశివారికి అదృష్ట

సంఖ్యలు 1,2,3,5,7,9 ఆది, సోమ, శనివారాలు కలిసిన యోగప్రదము.

ప్రకటనలు

Comments on: "మీనం" (3)

  1. Thank u very much

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: