నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మేషం

 ( అశ్వని, భరణి, కృత్తిక, మొదటి పాదం )

 

ఆదాయం-11, వ్యయం-14, రాజపూజ్యం-3, అవమానం-6

 

 

మేషరాశి వారికి శుభప్రదుడైన గురువు ఉగాది నుంచి అక్టోబరు 27వరకు ఎనిమిదింట

రజిత మూర్తి. తదుపరి సంవత్సరమంతా తొమ్మిదింట లోహమూర్తి. జులై 15 వరకు శని

నాలుగింట రజిత మూర్తి. తదుపరి సంవత్సరమంతా ఐదింట లోహమూర్తి. ఏడాది

అంతా రాహువు పదకొండింట, కేతువు ఐదింటా సువర్ణమూర్తులు. రాశివారికి

ఏడాది గురువు, శని, రాహు కేతువుల సంచార ఫలితంగా సెప్టెంబరు తరువాత శుభ

ఫలితాలు కనిపిస్తాయి. తృతీయ కుజుడు,భాగ్య గురుల సంచార ప్రభావంతో

మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్ధిక పరిస్థితి చక్కబడుతుంది. అన్ని రంగాల్లో

సత్ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబవృద్ధి కలుగుతుంది. ధర్మకార్యసిద్దికి

అనుకూలమైన కాలం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్నేహ

 పరిచయాలు లాభిస్తాయి. విద్యా, ఉద్యోగ రంగాల్లో విజయం సాధిస్తారు. విదేశీ

ప్రయాణానికి అనుకూలం. విద్యార్థులు కష్టించి పనిచేస్తేనే సత్ఫలితాలు సాధిస్తారు.

సైన్సు విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రాహువు శుభదృష్టి

కారణంగా ఉద్యోగులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. రాజకీయ నాయకులకు

మిశ్రమ ఫలితాలు వచ్చే సూచనలున్నాయి. షేర్ల లావాదేవీల్లో విశేషంగా లాభాలు

 అందుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. వ్యాపారులకు  నిల్వల వల్ల

పెద్దగా లాభం కనిపించదు. బంగారం, వస్తరాలు. ఫైనాన్స్, మత్స్యములు, రసాయన

వ్యాపారములకు 1,2,3,4,5,6 నెలలు విశేష ఫలితాలుంటాయి. అపరములు, కలప,

పేపరు, యంత్రాల వ్యాపారులకు సంవత్సరం ద్వితీయార్థంలో విశేషలాభాలు కనిపిస్తాయి.

నటులు, గాయకులు, వైద్యులు, శాస్త్రకోవిదులకు కృషి ఫలిస్తుంది.

 

సంవత్సరం మొదటి ఆరు మాసాలు గురు, శనుల ప్రతికూల దృష్టి కారణంగా

తటస్థ ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సంతానం,

కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఆస్పత్రి ఖర్చులు అధికం.

ఆదాయానికి మించిన ఖర్చులు తప్పకపోవచ్చు ప్రయాణ ఖర్చులు శక్తికి మించిన

భారంగా పరిణమించే అవకాశం ఉంది. ఆరాటం అధికంగా ఉంటుంది. గౌరవం కోసం

పాకులాడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధుమిత్రులు, సమాజం

నుంచి అనేక ఇబ్బందులు చికాకులు ఎదురయ్యే సూచనలున్నాయి. నడుము నొప్పి,

 చాతీతీపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సంతానం గురించి ఆందోళనలు

 అధికమవుతాయి. నిదానంగా పరిస్థితిలో మార్పు వస్తుంది, దైవారాధన మనసుకు

ఊరట కలిగిస్తుందని గ్రహించండి.

రాశివారు సుందరకాండ పారాయణ, శని, గురు, కేతు గ్రహములకు జపములు,

 రుద్రాభిషేకములు, మహాలక్ష్మి, దుర్గా పూజలు జరిపించడం సర్వదా శ్రేయస్కరం.

సోమ, గురువార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యం, సంతతి, మనోభీష్ట సిద్ధి

కలుగును.

 

అదృష్ట సంఖ్యలు 1,2,3,9 . ఆది, సోమ, గురువారములు కలిసిన మరింత మేలు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: