నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

వృషభం

   (కృత్తిక, 2,3,4 రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

 

అదాయం-5 వ్యయం-8 రాజపూజ్యం-6 అవమానం-6

 

 

రాశివారికి ఉగాది నుంచి గురుడు ఏడింట లోహమూర్తి తదుపరి వత్సరమంతా

ఎనిమిదింట సువర్ణమూర్తి జులై 15 వరకు శని మూడింట లోహమూర్తి. మిగిలిన

నెలలన్నీ నాలుగింట సువర్ణమూర్తి. వత్సరమంతా రాహువు పదింట. కేతువు

నాలుగింట రజితమూర్తులు. వృషభ రాశివారికి సంవత్సరం మొదటి ఆరు మాసాలు

మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. నవంబరు 7 నుంచి అష్టమ గురుడు కష్టాలను

కలిగించే వాడే అయినా శుభమూర్తిమంతము. స్వక్షేత్ర స్థితి ఫలితంగా చేపట్టిన

పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమను పట్టించుకోకుండా లక్ష్య సాధనకు కృషి చేస్తారు.

భూగృహాది వ్యాపారాల్లో స్థిరవృద్ధి కనిపిస్తుంది. విలువైన వస్తువు, ఆభరణాలు

సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు రాకపోవచ్చు.

జాయింటు వ్యాపారులు అన్నివిధాలా జాగ్రత్తలు పాటించాలి.సెప్టెంబరు నెల తరువాత

 వ్యవహారాల్లో  తొందరపాటు తగదు. రైస్‌మిల్లర్లు, పరిశ్రమల నిర్వాహకులు, యంత్రాల

 వ్యాపారులకు శుభప్రదము. హోల్‌సేల్ అపరాలు, కిరాణా, వస్త్ర, ఫ్యాన్సీ, రసాయన,

ఫైనాన్స్ వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆత్మీయులు దూరమయ్యే

సూచనలు కనిపిస్తున్నాయి. సినీ ప్రముఖులు, న్యాయవాదులు, రాజకీయవేత్తలు,

సొంతవ్యాపారాలు చేసుకునే వారికి పలు అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

 రియల్ ఎస్టేటు, బంగారం, కాంట్రాక్టు వ్యాపరులకు సంవత్సరం పూర్వార్థం అనుకూలంగా

ఉంది. వ్యవసాయదారులు ఆశించిన ఫలితాలు సాధించకపోవచ్చు. ముఖ్యమైన

విషయాల నుంచి తాత్కాలిక పరిష్కారం కనుకొని బయటపడడం మంచిది.షేర్ల

లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. నిల్వల వల్ల లాభంలేదని గ్రహించండి.

 

భూగృహాది నిర్మాణాన్ని జాగ్రత్తగా నిర్వహించడం లేదా ఏడాదికి వాయిదా వేయడం

మంచిది. ఏడాది పూర్వార్ధంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాహాది శుభ

కార్యాలలో చిక్కులు ఎదురయ్యే ఎదురయ్యే సూచనలున్నాయి. సప్తమ గురుదృష్టి,

తృతీయ శని ప్రభావాలచే ఎన్ని సమస్యలు ఎదురైన ఓరిమితో వ్యవహరించి బయట

పడతారు. ధీర, ధర్మ, దానశీలతతో కష్టమును, ఖర్చును లెక్క చేయకుండా లక్ష్యాలు

సాధిస్తారు. ఏడాది ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్త్తలు పాటించాలి. నేత్రములు,

నరములు, ఉదరము, శిరస్సు స్థానములందు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం

 ఉంది. విద్యార్థులు అధికంగా శ్రమించడం ద్వారానే సత్ఫలితాలు సాధిస్తారు.

 

కృత్తిక వారు కెంపు, ముత్యం, రోహిణి వారు ముత్యం, పుష్యరాగం, మృగశిరవారు

నీలం పగడం ధరించడం మేలు. వీరికి నవగ్రహ అభిషేకం, దత్తాత్రేయ, గణేశ, దుర్గా

పూజలు, మంగళ, శనివార నియమాలు యోగప్రదం, శివదర్శనం, గోసేవ అదృష్ట

ప్రదం. వీరికి అదృష్ట సంఖ్యలు 5,6,8,9 మంగళ, శుక్రవారములు యోగించును.

స్త్రీలు మంగళ,ఆదివారములు చేయుట గణేశ, సాయి, లలితా, నవగ్రహ స్త్రోత్ర

ధ్యానముచే ఋణవిముక్తి,ఆరోగ్యవృద్ధి, ఉత్సాహం, భర్తృ పుత్ర సౌఖ్యము కలుగును.   

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: