నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

                                        jjjj.jpg

 ముదిమిలో తమను చూసుకోవడానికి పనికొస్తారని పిల్లలను కనే తల్లిదండ్రులు వ్యాపారం చేస్తున్నట్టే. ఆ ఉద్దేశంతో కన్నవారు పిల్లల ఆలనా పాలనా చూడటం, పెంచి పెద్దచేయడం ఇవన్నీ పెట్టుబడి కిందికి వస్తాయి. పెట్టుబడి పెట్టినవారందరికీ లాభం రావాలనేం లేదుగా! “దంపతులు కలసి జీవించడం ఒక యాక్సిడెంటు, పిల్లలు కలగడం ఒక ఇన్సిడెంటు. నిన్ను నవమాసాలు మోసి, కని, పెంచీ, నీకు అదిజేసి ఇదిజేసి…. ఇలాంటి మాటలన్నీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. కనమని వాడడగలేదు. కన్నాక వాడిని పెంచడం ఆ తలిదండ్రుల బాధ్యత. వాడు తమకోసం కొన్ని వదులుకొని తమను పోషించాలని ఆశించడం తప్పు. మీకోసం వాడు విదేశాలు చూసే అవకాశం వదులుకోవాలనడం, మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చాడు అని వాపోవడం ఇవికూడా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగే. ఒక చిరుద్యోగి ఉంటాడు. నెలకు 3000 జీతం. ఈ మహానగరంలో ఏమూసకొస్తుందా సంపాదన. అమ్మ,నాన్న, చెల్లి అందరూ వాడిమీద పడటం. వాడి బతుకు ఏంకావాలి. వాడిని నమ్ముకున్న పెళ్లాం సంగతేంటి, పిల్లలసంగతేంటి, వాడు చూసుకోవద్దా!?”

క్రితం టపాలో రానారే రాసిన వ్యాఖ్య మొదట కొంచెం కోపం తెప్పించించి. కాని ఆలోచిస్తే మనము(తల్లిదండ్రులు) కూడా కొద్దిగా మారాలి అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబంలోనే కాదు. ఎవరి సంసారం వాళ్ళకున్నా ఇతరులు బాగుపడితే ఓర్వలేని మనుష్యులు ఎంతోమంది. అది నాకు స్వానుభవమే. కాని పిల్లలతో కూడా మనం ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదు. వాళ్ళకు మంచి చదువులు చెప్పించి ఉద్యోగం వచ్చేంతవరకే మన బాధ్యత. తరువాత వాళ్ళకు కావలసినవి వాళ్లనే సమకూర్చుకోమనాలి. మనకు ముందు ముందు ఎలాంటి అవసరం వచ్చినా ఎవరినీ చేయిజాచే (కొడుకులను కూడా) పరిస్థితి రాకుండా చూసుకోవాలి. నిజంగా పిల్లలకు తల్లిదండ్రులు భారమా? వాళ్ళకు పిల్లల అవసరం ఉండదా? నిజంగా పిల్లలు ఇలా ఆలోచిస్తారా? మనం పిల్లలకు చెప్పించే చదువులు మనకు పెట్టుబడా లేక వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనా? వయసు మీదపడ్డాక పిల్లలు మనను చూసుకోవాలనుకోవడం తప్పా? పనిమనుష్యులమీదా, వృద్ధాశ్రమాలే గతా?

పిల్లలున్న తల్లిదండ్రులూ ,

తల్లిదండ్రులున్న పిల్లలూ,

నిజం చెప్పండి……

ప్రకటనలు

Comments on: "కలసి ఉంటే కలదు సుఖం" (4)

  1. నిజమే పెద్దలు ఎవరినీ చేయి చాచే పరిస్తితి తెచ్చుకోకుండా ముందుగానే అన్ని అమర్చుకోవాలి.కానీ ఇక్కడ డబ్బొక్కటే కాదుగా పెద్దలకి కావలిసింది.కాస్త ప్రేమ,అభిమానం…మరి వాటి పరిస్తితి ఏమిటి?ఎప్పుడో రెండేళ్ళకోసారి వచ్చి రెండువారాలు వుండే కొడుకులు,కూతుళ్ళు, మనవల కోసం మిగిలిన జీవిత కాలమంతా ఎదురుచూస్తూ వాళ్ళు మిగిల్చిన జ్ఞాపకాలతో బ్రతికేయడమేనా? అలా అని వాళ్ళతోనే వుంటూ వాళ్ల మాటలే వింటూ వుండడం కష్టమే.వృద్దాశ్రమాలు మంచి ఆలోచనే.కానీ తరచూ వెళ్ళడం,ఇంటికి తీసుకురావడం ఆప్యాయం గా పలకరించడం,ఫోనుల్లో మాట్లాడడం,యోగ క్షేమాలు చూడడం….ఇవన్ని వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాయని అనుకుంటున్నాను.

  2. వయసులో ఉన్న మనమే పెద్దలను బేబీ సిట్టింగు కోసం తెచ్చుకుంటున్నాము. వయసు మీరాక ఎవరి అవసరం లేకుండా ఏం ఏర్పాటు చేసుకోగలము అంటారు? ఆరోగ్యాలు మన మాట ఎంత వరకూ వింటాయి?

    ఇక్కడికొచ్చిన కొన్నేళ్ళకే ఇక్కడే ఉండిపోదామనుకునే వాళ్ళము, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళాను అన్నీ వదులుకొని వచ్చేయమండం సబబేనా?

    ఇది గంభీరమైన సమస్య. ఈ విషయం పై అందరి ఆలోచనలు తెలుసుకోవాలని ఉంది.

    లలిత.

  3. జ్యోతిగారూ, మీరు చెప్పినట్లు మొదటిపేరాలోని నా వ్యాఖ్యలోని మాటలు అన్నీ నావికావు. అందులోని మాటలు శ్రీరమణగారివి అని చెప్పాను కదా 🙂 ఆయన మాటలను నేను సంపూర్ణంగా అంగీకరించాను, అది వేరే సంగతి.

  4. అవి నీ అభిప్రాయాలని నేననలేదే… కాని ఆలోచింపదగ్గవి అని ఇక్కడ ఇచ్చా. ఆస్థుల కోసం అన్నదమ్ములను, తల్లితండ్రులను చంపుతున్న రోజులివి…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: