నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ప్రకృతి

ప్రకృతిని అనుసరించి సోదరా

జీవన విధానం నువ్ గడపరా

 

మన పూర్వులు బ్రతికినారు నిండుగ నూరేళ్ళవరకు

ఆహారంలోనే మనకు అన్ని మందులున్నవంటూ

మందులు వదలిపెట్టి ఆసుపత్రి దారిపట్టి

ఇంగిలీషు మందులతో ఎంగిలైపోతున్నాము.    ll  ప్రకృతి ll

 

బంతాకుల ముద్ద చేసి మిరియాల చూర్ణమేసి

రేగిగింజంత మాతరంట పూటకొకటి వేసుకొంటే

ఎన్నెన్నో మందులు నువ్ వాడినా తగ్గలేని

పైల్స్ రోగమంటు నీకు లేకుండా తగ్గుతుంది   ll ప్రకృతి ll

 

కీళ్ళనొప్పులంటు నువ్ నడవలేక బాధపడితే

ఆవాలు గసగసాలు వెల్లుల్లి కర్పూరం

పెరుగుతో ముద్ద చేసి పట్టు వేసి కట్టు కడితే

కీళ్ళనొప్పులంటూ నీకు మచ్చుకైన ఉండవయ్యా ll ప్రకృతి ll

 

ఒక గరిటెడు ఆవునెయ్యి పదిగ్రాములు వేయిస్తూ

అందులోనే ఒక ఎండు మిరపకాయ వేసి చూడు

మరిగినాక  మిరపకాయ తీసివేసి ఆవునెయ్యి

నేతిని తింటే నీకు కడుపునొప్పి తగ్గుతుంది    ll ప్రకృతి ll

 

మిరియాలు కండ చక్కెర ఆవునెయ్యిలోన కలిపి

ఆవునెయ్యిలో కొంత మిరియాలపొడిని వేసి

ప్రతిరోజు పరగడుపున కమ్మంగా తింటుంటే

సాయంత్రం కాగానే తడుముకుంటూ తిరుగుతున్న

రేజీకటి యంటు నీకు లేకుండా పోతుంది      ll ప్రకృతి ll

 

రక్తంలో బలహీనతచే కాళ్ళు చేతులుబ్బుతాయి

ఉబ్బు కామెర్ల బోదకాలు నూసిలాడి చెబుతారు

ఇంజక్షన్ మందులలో తగ్గలేని బోదకాళ్ళూ

గోమూత్రం వస కొమ్ముతో తగ్గుతుంది బోదవాపు   ll ప్రకృతి ll

 

వాము, మిరియం, శొంటి సమభాగం చేసుకొని

రెండుపూటలా నువ్వు ఇరవై రోజుల వరకు

పట్టు తేనెలో నువ్వు శుభ్రంగా వాడినచో

దగ్గు, ఆయాసం నీకు తగ్గుతుంది ఖచ్చితంగా   ll ప్రకృతి ll

 

కోడిగుడ్డు సొన సైందవ లవణం నెయ్యిని గలిపి

పేస్టువలె చేసి నువ్ నడుముకు మర్ధించినచో

నిద్రపోవు ముందు కాస్త నడుముకు పట్టేసినచో

నడుమునొప్పి మూడు నాలుగు రోజులలో నయమవును   ll ప్రకృతి ll

 

పల్లేరాకు తెచ్చి నీళ్ళు కలపకుండ దంచి

రసం తీసి, వడపోసి పూటకో ఔన్సులాగా

మోతాదుగా రెండు లేక మూడు పూటలు వాడితే

మూత్ర వ్యాధులన్ని నీకు నిర్మూలంబవును   ll ప్రకృతి ll

ఒక ఆయుర్వేద పత్రికలో చదివినది. ఇవి అన్ని హానికరము కానివి అని పెద్దలు లేదా

మన డాక్టరుగారు(SMILE)  చెప్పాలి.

ప్రకటనలు

Comments on: "ప్రకృతి" (1)

  1. నేనుసైతం said:

    జ్యోతి గారు,

    ప్రకృతి వైద్యం లోని గొప్పతనం చక్కగా చెప్పారు.
    -నేనుసైతం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: