నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అవునండి ఇది నిజం.. యవ్వనంలో దొరకని ప్రేమ ఈ మధ్యవయసులో కలిగింది. ఏం చేయను?. ఎందుకో నా ప్రేమకథను మీతో పంచుకోవాలనిపించింది. తప్పుగా బావించకండి..

అతను నా చిరకాల మిత్రుడు. కాని ఆ స్నేహం ప్రేమగా మారడం ప్రారంభమైంది గత సంవత్సరంగానే…ఎందుకిలా జరిగిందని చాలా ఆలోచించా. చదువుకాగానే మంచి సంబంధం వచ్చిందని, ఆడపిల్లకు తొందరగా పెళ్ళి చేసేస్తే బాధ్యత తీరుతుందని  పెద్దలు పెళ్ళి చేసేసారు. సో ప్రేమలు, దోమలు తెలీదు. భర్తనే ప్రేమిస్తూ, పిల్లలు సంసారం ..ఇలా కాలం గడిచిపోయింది. కాని ఎందుకో జీవితం నిస్సారంగా అనిపించసాగింది.  అప్పుడు ఈ స్నేహితుడు తన ఆప్యాయత, ప్రేమతో నాలో కొత్త ఉత్సాహం కలిగించాడు. జీవితాన్ని అనుభవించే వయసు కాదు అనుకునే సమయంలో ఆనందంగా జీవితాన్ని అనుభవించడానికి వయసు కాదు ముఖ్యం మనసు అని తెలియపరిచాడు ఆ స్నేహితుడు. ప్రేమంటె ఏమిటంటే అది ప్రేమించినాక తెలిసింది. ఇలా అని నేను నా భర్తను, పిల్లలను నిర్లక్ష్యం చేయలేదండి. నా భర్త కూడా మంచివాడే. కాని అలా జరిగిపోయింది. కోపం వస్తుంది కదా నా మీద…ఆగండి. ఇంకా చెప్పాలి. నేను బ్లాగులు అదీ నాకిష్టమైన తెలుగులో రాయడానికి ప్రోత్సాహం ఇచ్చాడు నా స్నేహితుడు. అప్పుడప్పుడు నిరుత్సాహంగా ఉంటే ఎదో మాట్లాడి నన్ను మామూలుగా చేసేవాడు. నేను మౌనంగా ఉండడం అతనికి నచ్చదు. నా పుట్టినరోజుకి నాకిష్టమైన , నా బ్లాగులకోసం కావలసిన పుస్తకాలు వెతికి కొనిచ్చాడు. ఇంతకంటే విలువైన బహుమతి ఉంటుందా? చెప్పడం మరిచా.. అతనికీ పెళ్ళయింది . పెళ్ళీడుకొచ్చిన పిల్లలున్నారు. నా పిల్లలు పెద్దవాళ్ళే .. అయినా ఎవరి సంసారం వారు సక్రమంగా చేసుకుంటూ స్నేహం చేయడం తప్పుకాదేమో. మా స్నేహం వలన మా సంసారంలో ఎటువంటి పొరపాట్లు జరగనివ్వలేదు. నాకు కాని , అతనికి కాని ఎదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుని దానికి తగిన పరిష్కారం కొరకు వెతికేవాళ్ళం. అలా అని రోజు ముచ్చట్లేసుకోవడం, ఊరిమీద పడి తిరగడం లాంటివి లేవండి. కాలేజీ పిల్లలం కాదు గదండి. ఎప్పుడన్నా ఓ సారి మాట్లాడుకోవడం. ఎందుకో అతనితో స్నేహం ప్రేమగా మారిందని తెలుసుకున్నాను ఈ మధ్యే. ఎప్పుడూ అలా పాటలు పాడుకుంటూ ఉండాలనిపిస్తుంది.

అందునా మా ఇద్దరికీ ఇష్టమైన పాత పాటలు. రోజూ రేడియో పెట్టుకుని పాటలు వింటూ ఇంటి పని హాయిగా చేసుకుంటూన్నాను. ఇంట్లోవాళ్ళూ అదేనండీ పిల్లలు మావారు గోల పెడ్తున్నారు. ఊరికే పాటలు పెడతావ్ అని. నా ఇష్టం. మీ చెవిలో దూది పెట్టుకోండి అన్నా. నేనుకూడా అతనికి ఇష్టమైన బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మాటల సందర్భంలో అతనికి జేసుదాస్, ఇళయరాజా పాటలు అంటే చచ్చేంత ఇష్టమని తెలుసుకుని అవి కొనివ్వాలని నిశ్చయించుకున్నా. ఇస్తాను కూడా. ఎలా పంపాలా అని ఆలోచిస్తునా. పేరు రాయకుండా పుష్పగుఛ్ఛంతో పాటు ఈ బహుమతి ఇంటికి పంపిస్తే. వాళ్ళావిడతో ఏ గొడవా ఉండదు.  కాని అది నేనే పంపానని అతను తెలుసుకుంటాడు నాకు తెలుసు. మా ప్రేమ చెప్పుకునేది కాదు మనసుతో తెలుసుకునేది . మరి ఎన్నేళ్ళ స్నేహం. ఒకరిగురించి ఒకరికి ఆ మాత్రం తెలీదా? నేను ఒక నిర్ణయానికొచ్చానండి. మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలని. అమ్మో. కోపంగా ఉన్నారు కదా అందరూ. మా వారు పిల్లలు ఈ బ్లాగులు చూడరు చదవరు, ఇంకా మా బంధువులెవ్వరు కూడా ఇటు వైపు రారు. అదే ధైర్యంతో ఇలా నా మనసులో ఉన్నది నా బ్లాగులో రాసుకుంటున్నా.అతని పేరు వర్ధన్. కావాలంటే ఇక్కడ చూడండి. ఫోటో కూడా పెట్టాను.  నాది తప్పయితే అక్షింతలెయ్యండి. ఒప్పయితే దీవించండి.   పెద్దలయితే ఆశీర్వదించండి.పిన్నలయితే అభినందించండి.

Comments on: "పడ్డానండి ప్రేమలో మరి" (28)

 1. విషయం ముందుగానే ఊహించాను 🙂 నా శుభాకాంక్షలు అందుకోండి.

 2. A successful marriage requires falling in love many times, always with the same person.

  — Germaine Greer
  శుభాకాంక్షలు!

 3. bhale…kaani anta teguvagaa raastunteene anukunnaa kathalo twist untundani….
  venkat
  http://www.24fps.co.in

 4. హహ.. పట్టేశాం జ్యోతి గారూ
  ఇంత పబ్లిగ్గా ఎవరూ రాయరని మాకు తెలుసు.

  హార్దిక శుభాకాంక్షలు.

 5. నాకిది ముందే తెలుసుగా..హా హా హా..రేపు గురించి ఎవరికి తెలుసు..ప్రతీరోజూ ఉత్సవంగా జరుపుకోవాలని మనసారా ఆశిస్తున్నా.
  ఇది చదివినప్పుడు ఫిడ్లర్ ఆన్ ద రూఫ్ సినిమాలో రెబ్ తెవ్యా, గోల్డెను చూసి “గొల్డె డూ యూ లవ్ మీ?” అన్న సన్నివేశం గుర్తుకొచ్చింది.

 6. నాక్కూడా సరిగ్గా వైజాసత్య ఉటంకించిన సంఘటనే గుర్తొచ్చింది.
  ఏ ఒక్క పుట్టిన రోజో, ఇరవయ్యయిదో పెళ్ళిరోజో మాత్రమే ఎందుకు అపురూపం కావాలి? “నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ, నీకోసమే కన్నీరు నించుటకు” మన చుట్టూ మనవారుండే ప్రతి రోజూ అపురూపమైనదే.
  మీ శేషజీవితం “ప్రతి రాత్రి వసంత రాత్రి”గా సాగాలని కోరుకుంటూ ..

 7. అభినందనలు జ్యోతి గారు.
  ఎంతో మంది భార్య భర్తలకు మంచి ఆశను ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడొచ్చని, కావాలంటే మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోవచ్చని. 24 ఏళ్ళ యువ జంటకు Best Wishes. మీరు మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నప్పుడు update చేస్తారు కదు మమ్మల్నందరినీ:-)
  Meanwhile, enjoy the courtship.

 8. అలాంటి లవర్ దొరికాడు గనకనే ఇంత తెగువ! 🙂 పిన్నలైతే అభినందించమన్నారు కదా, హార్దిక శుభాభినందనలు – అదుకోండి.

 9. నేనూ కనిపెట్టేసా.మీ పప్పులు షడ్రుచుల్లో తప్ప ఇక్కడ వుడకవండి.ఆమధ్య ఇలాగె స్వాతిగారు “పునరపి ప్రణయం” అని వాళ్ళ అబ్బాయి గురించి రాసారు.
  శుభాభినందనలు.

 10. మీకు మీ స్నేహితుడికి శుభాభినందనలు. మీ జీవితం లోని ప్రతిరోజు మీకు అపురూపం కావాలని ఆశిస్తూ!!

  One look
  One smile
  One touch
  One embrace
  One kiss
  One love
  Two people
  Two minds
  Two souls
  Two destinies
  One road
  One journey
  One ending
  Together—-(Melissa Higgins)

 11. మీకు మీ స్నేహితుడికి శుభాభినందనలు. మీ జీవితంలో ప్రతి రోజు మీకు అపురూపం కావాలని ఆశిస్తూ!!

 12. oops, champesaaru? pls mee photo pettakande..

  🙂

 13. అక్కలలో జ్యోతక్క వేరయా అని.

  ఇంకో ఇరవై అయిదు కూడుకుని ఇలాంటిదే ఇరవై అయిదు సంవత్సరాల తరువాత కూడా రాయండి. అప్పుడు దీన్ని ఏ అంగారక గ్రహం మీదనో కుజ గ్రహం మీదనో వుండి చదువుకుంటాం.

  శుభాభినందనలు.

  — విహారి

 14. హార్దిక శుభాకాంక్షలు.

 15. హార్దిక శుభాభినందనలు

 16. అక్కిరాజు భట్టిప్రోలు said:

  ఒక సారి చేస్తే పొరబాటు. అదే మళ్ళీ మళ్ళీ చెయ్యాలను కోవడం… చెయ్యడం ఏమిటీ ? 🙂

  (మా ఆవిడ ఈ బ్లాగు చదవదు అని నాకు పిచ్చ నమ్మకం… ధైర్యం!)

  జ్యోతిగారు… అభినందనలు. మీ హాస్య స్ఫూర్తి (sense of humor) నాకు బాగా నచ్చింది.

  -అక్కిరాజు

 17. జ్యోతిగారూ, మీకు మీఆయనకి శుభాకాంక్షలు. మీ పేరు మీద ఈటీవీ లో ఒక పాటవేయించమంటారా? 🙂
  కొత్తపాళీ గారూ, క్షమించాలి. ఇక్కడ మీ శేషజీవితం అన్న ప్రయోగం తప్పు. ముందు ‘వి’ చేర్చండి.

 18. అందరికీ థాంక్సులు…పిల్లలు పెద్దవారయ్యక తల్లితండ్రులు వారితో స్నేహితుల్లాగా ఉండాలి.ఇంట్లో అందరూ కూడా స్నేహితుల్లా ఉంటే బాగుంటుంది. ఇది నేను పాటిస్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పిన ఉంగరపు వ్రేలు టపాలో లాగా చివరివరకు కలిసుండేది భార్యభర్తలే. అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. యాంత్రికంగా మారిన వైవాహిక జీవితంలో కాస్త ప్రేమ అనే అమృతగుళిక కలిపితే బాగుంటుంది అనే నా చిరు ప్రయత్నం. ఇలా ఉన్నప్పుడు పంతాలు,పట్టింపులు, కోపాలు, విసుర్లు అనేవి మనను ఎక్కువ బాధపెట్టవు.

  @ రవి

  నువ్వు చెప్పింది నిజమే. రేపు ఎవరు చూసారు. అందుకే కదా నేను ఈ సంవత్సరం పూర్తయ్యే వరకు ఆగకుండా ఇవాలే మొదలెట్టా.దీనికి డూ యూ లవ్ మీ అని అడగాల్సిన పనిలేదు. మనసులో ఆ ఫీలింగు ఉంటే చాలు.

  @ కొత్తపాళి

  ఊరికే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏముంటుంది. మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలి. పెళ్ళిరోజుకి అందరితో పనిలేదండి. మొగుడూ పెళ్ళాలకే. అది సంవత్సరానికొక్కరోజు ప్రత్యేకంగా జరుపుకుంటే తప్పేంటి. దీనికి వేలు వేలు ఖర్చుపెట్టాల్సిన పని లేదనుకుంటా. తక్కువలో కాస్త వేరైటీగా జరుపుకుంటే చాలు. అది మీకే లాభం మరి భవిష్యత్తులో. ఇది తెలుసుకోరు మగాళ్ళూ.నాగరాజుగారి ఉపనిషత్తులో ఇది లేదనుకుంటా.

 19. కొత్తపాళిగారు నేను రావుగోపాలరావుగారి డవిలాగు చెప్పింది నా గురించండి. కాస్త వెరైటీగా చేసిన చిన్న ప్రయత్నం ఇది..

 20. నల్లమోతు శ్రీధర్ said:

  మీ ప్రేమ కధ చాలా బాగుంది జ్యోతి గారూ!
  -నల్లమోతు శ్రీధర్

 21. ammaa dongaa!!!

  idi krishna movie kaadandoi

  meeku entha dheemaa,mee aayanaa,pillaluu chadavaranii

  okka abyardhana

  meeru mee lover vesukunna duet gurinchi maaku kaasta cheppagalaru

 22. I really impressed with your thoughts – a pure love/first love will definately have similar thinkings as you are mentioned – but may not be expressed with the fear from society – but two hearts will know the feelings even though they are apart……….

 23. పెళ్ళిరోజు శుభాకాంక్షలు జ్యోతి గారు. భార్యా భర్తలు స్నేహితుల్లా ఉండగలిగే అవకాశం, అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి. ఇలాగే ఎన్నో, మరెన్నో పెళ్ళిరోజులు మీరిద్దరూ జరుపుకోవాలని కోరుకుంటూ..వసుంధర.

 24. hi very nice story .u hav gud creativity.
  i am very peaceful after going through ur article

 25. మీదృష్టి, అదృష్టం కూడా అరుదే. ఏంచెప్పమంటారు అభినందించడం తప్ప.

 26. శ్రీహర్ష said:

  వెరైటీ గా ఉంది …………..

 27. ఎప్పుడూ వైవిధ్యం కోరుకునే మీరు ఏది చేసినా బలే తమాషాగా వుంటుంది. లింక్ క్లిక్ చేస్తే గాని అర్ధం కాలేదు. వెరైటీలలో ఇదో వెరైటీ. మీ దంపతులిద్దరికీ నా శుభాభినందనలు జ్యోతి గారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: