నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఎంతో కొంత మంచీ-చెట్టా వుండాలిగాని మరీ ఇంత అల్లరి-చిల్లరిగా ప్రవర్తించడం తగదు సుమా!

మొగుడూ పెళ్ళాల అనుబంధం ఈనాటిదా? తల్లితండ్రులు కాబోతుండగా ఈ రచ్చా-రభసా తగదు. దేనికయినా ఓ హద్దూ-పద్దూ వుండాలిగాని మరీ ఇంత గీర-గర్వం పనికిరాదు. కాస్తయినా బుద్ధీ-జ్ఞానం వుండక్కరలేదా? కాస్తో-కూస్తో, డబ్బూ-దస్కం, భూమి-పుట్రా, వున్నాయిగా. మరీ కక్కుర్తి పడిపోయి గడ్డీ-గాదం, చెత్తా-చెదారం, పోగెయ్యక్కరలేదు. ఏదైనా అనేముందు కాస్త ముందూ-వెనకా చూడొద్దా? కష్టం-సుఖః, పగలూ-రాత్రి లాంటివి కదా!

అయినా ప్రతీ వ్యవహారానికి రాతా-కోతా అని కూర్చుంటే కుదురుతుందా? గుట్టూ-మట్టూ ఉన్నంతవరకే అందం-చందం. పిచ్చాపాటిగా మొదలయి మాటా-మాటా పెరిగి చిట్టచివరికి మాటా-మంతీ లేకుండా బిర్ర బిగుసుకుని కూర్చున్నారు. మీకిదేమన్నా న్యాయం-ధర్మంగా ఉందా? ఏ గొడవైన ఇల్లూ-వాకిలి దాటకుండా వుంటేనే ముద్దూ-ముచ్చటానూ. చెట్టా-పట్టాలు వేసుకుని తిరిగారే దేనికయినా కొద్దో-గొప్పో, పట్టూ-విడుపూ వుండాలి కదా! పాలూ-నీళ్ళులా వుండాల్సిన మీరే నిప్పూ-ఉప్పూలా చిటపటలాడ్డం క్షేమం-లాభం కూడా కాదు. ప్రతీ సమస్యకు ఎదో ఒక దారీ-తెన్నూ వుండకపోదు గదా! పెద్దా-చిన్నా లేకుండా ఎంత తోస్తే అంతేనా? బింకం-పొంకం వున్నంతకాలం ఫర్వాలేదు. మ్ముందు-ముందు  కాలో-చెయ్యో వంగాక? ఈ కోపం-తాపం ఎన్నాళ్ళు. రేపో మీ మావగారు కట్నం డబ్బు ఇచ్చేస్తే ఇంక గొడవా-గొందీ ఏముందీ? అమ్మాయి మీద ఇంతో-అంతో, జాలీ-దయా చూపించూ. పోట్లాటకయినా అంతూ-పొంతూ లేదా తాడో-పేడో తేల్చుకోవాలంటే ఏళ్ళూ-ఫూళ్ళూ కావాలా? నిదానం-ప్రదానం బాబు! మీరిద్దరు కలకాలం సుఖః-సౌఖ్యాలతో వర్ధిల్లాలని మరీ-మరీ కోరుకునే మీ ఇరుగూ-పొరుగూ..పిల్లా_పాపలతో హాయిగా ఉండండి.

ప్రకటనలు

Comments on: "జంట పదాల అల్లరి – చిల్లరి" (2)

  1. ఆహా! జంటపదాలను అద్భుతంగా ఉపయోగించారండి. ఏదో ప్రాస కోసం కాకుండా రాసేదానికి అర్ధం ఉండేలా బాగా రాసారు.

  2. కలా నిజమా?ఇన్ని జంటపాదాలతో ఒక పోస్టా?నవ్వు నవ్వించు అంటూనే నువ్వూ ఆలోచించు అనేలా వుంటున్నాయి మీ పోస్టులు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: