నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

                                           

అందరికీ నమస్కారం. నాదొక విన్నపం. గత వారం రోజులనుండి మా శ్రీవారు కనభడటం లేదు గొడవేం లేదండి. పత్రికలలో ప్రకటన చూసి వారి బట్ట తలపై హృతిక్‌రోషన్‌లా జుట్టు మొలిపించుకోండి. ఇంకా అదేదో సినిమా చూసి నాకూ ఆదివారం సెలవు కావాలి అన్నా అంతే. కోపంతో ధుమధుమలాడుతూ వెళ్ళిపోయారు. ఇలా అడగడం తప్పా చెప్పండి? రెండ్రోజుల్లో తిరిగొస్తారులే అని ఊరుకున్నా. ఎక్కడికెళ్ళారో ఆచూకీ తెలీటంలేదు.ఆయన పేరా? అమ్మో భర్త పేరు ఎలా చెబుతారండి పాపం కాదు. ఆయన ఫోటో సరియైనది లేకపోవడంవల్ల ఆయనకు సంబందించిన వివరాలు ఇస్తున్నాను.

* ఇంట్లో ఎప్పుడూ సీరియస్‌గా ఉన్నా, బయటికెళ్తే మాత్రం అందరితో సరదాగా జోకులేస్తూ,నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు. ఎంటో మరి?
 
* ఎప్పుడైనా వంట బాగాలేకపోతే కోపంతో చిందులు తొక్కుతారు. బాగుంటే మాత్రం ‘ బాగుంది ‘ అనరు. కామ్‌గా తినేసి వెళ్ళిపోతారు.

* నా పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటివి ఆయనకు గుర్తుండవు. పనిపాటాలేని నాలాంటివారే ‘ సెంటిమెంటల్ ఫూల్స్ ‘ గా ఉంటారని ఆయన అభిప్రాయం.

* స్నేహితులతో ఎని గంటలైనా సరదాగా మాట్లాడగలరు, భార్యతో మాత్రం పదినిమిషాలు మాట్లాడటానికి టైం లేనంత బిజీ మనిషి.

* నీకీ చీర బావుంది, నువ్వంటే ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావు లాంటి అనవసరపు మాటలంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు.

* నేను చేసిన పలావ్ నచ్చదు కాని పక్కింటోళ్ళు ఇచ్చిన పచ్చగడ్డి పచ్చడి మాత్రం పరమాన్నంలా మిగల్చకుండా తినేస్తారు.

* కష్టపడి పది రూపాయలు సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ ఇంట్లో తిని కూర్చుని, ఇరుగు పొరుగు అమ్మలక్కలతో సొల్లు కబుర్లేసుకునేవారికి ఏం తెలుస్తుంది లాంటి డైలాగులు రోజుకొకసారైనా అంటుంటారు.

* మొత్తం మీద “తినడానికి”… “పడుకోవడానికి” మాత్రమే ఇల్లు ఉన్నది అన్నట్టు ప్రవర్తిస్తారు.
పై లక్షణాలున్న వ్యక్తి కనబడితే పట్టుకొచ్చి నాకు అప్పచెప్పండి. ప్లీజ్. మీకు రానుపోనూ ఆటో కాని బస్ చార్జీలు కాని ఇస్తాను.
ఇట్లు

వీర వెంకట అలమేలు మంగతాయారు దీక్షితులు

హైదరాబాదు

తొలి ప్రచురణ పొద్దులో….

ప్రకటనలు

Comments on: "కనపడుటలేదు – 1" (4)

  1. మీరు చెప్పిన లక్షణాలతో బోలెడు మంది (పెళ్ళైన మగ వాళ్ళందరూ…ప్లససార్ మైనస్ ఒకరో ఇద్దరో) కనిపిస్తున్నారు. ఇంత మందిలో మీవారినెలా గుర్తు పట్టగలరు?
    🙂

    సిరి

  2. పురాణం సీత లాగా, లల్లదేవిలగా జ్యొతిగారి మొగుడు గారు కాదు కాదా ఇది రాసింది?

  3. మంగతాయారుగారి మొగుడుగారు రాసిన జవాబు కూడా చదవండి దీని తర్వాతే ఉంది.పాపం సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి ఏం చేస్తాం

  4. nenu 1st time chustunnanu, asalu naku time teleatledu. i am very happy. Thank u

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: