నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

 అసలు నేను తోటి బ్లాగర్లను పుస్తక సమీక్ష ఎందుకడిగానంటే…….

చిన్నప్పటినుండి నాకు పుస్తకాలు చదవడం అలవాటు. మా అమ్మ నాకా అలవాటు చేసింది. చందమామ, బాలమిత్ర ….పెద్దయ్యాక స్వాతి,యువ,ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి మొదలగు వారపత్రికలు. కాలేజీ కొచ్చాక నవళ్ళు. చిన్నప్పుడైతే కామిక్స్ , బుల్లి జానపద కథల పుస్తకాలు నేను మా తమ్ముళ్ళూ పోట్లాడుతూ మరీ చదివేవాళ్ళం. అప్పుడు మధుబాబు షాడో పుస్తకాలు చాలా వచ్చేవి . కాని మా అమ్మ వాటిని కన్నెత్తి చూడనిచ్చేది కాదు. చెడిపోతారని. ఈనాడులో తెలుగులో కామిక్ స్ట్రిప్స్ రోజూ వచ్చేవి. అవి రోజూ కత్తిరించి కథ పూర్తయ్యాక కుట్టు మిషన్ మీద కుట్టేదాన్ని. అప్పుడు తెలుగు కామిక్స్ లేవుగా.  సెలవుల్లో ప్రభుత్వ లైబ్రరీలో పుస్తకం తెచ్చుకుంటే గంటలో అవగొట్టేయడం. మళ్ళీ మరుసటి రోజు వరకు ఎదురుచూడడం దానిని మార్చడానికి. కాని వేరే పుస్తకాలు అద్దెకిచ్చే లైబ్రరీ కెళ్ళి తెచ్చుకోవడం …పెళ్ళయ్యాక ఈ అలవాటు ఎక్కువైంది. మావారితో కలిసి ప్రతి పుస్తక ప్రదర్శనకు వెళ్ళడం. ఎవరికి కావల్సిన పుస్తకాలు వారు తీసుకోవడం. అలాగే ఒకసారి ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వారి ఇంట్లోనే లైబ్రరీ పథకంలో చేరి నెలకొక నవల కొనడం. బయటా కొనడమే. అలా కనీసం రెండొందల పైనే నవళ్ళూ. కాలేజీ రోజుల్లో ఐతే యద్ధనపూడి సులోచనరాణీ హీరో లాంటి అబ్బాయిలకోసం కలలు కనేవారంట అమ్మాయిలు. ఆర్.సంధ్యాదేవి నవళ్ళు కూడా విభిన్నంగా ఉండేవి. కాని ఆవిడ ప్రతి నవలలోని హీరో పేరు చివర కృష్ణ అని ఉండేది. నా నవళ్ళు ముప్పై ఏళ్ళకు పైగా భద్రంగా దాచి కొద్ది కాలం క్రింద ఇచ్చేసాను. చెదలు పడతాయి అని.. కాని వాటిని ఎవరికి బడితే వారికివ్వలేదు. పుస్తకాల విలువ తెలిసినవాళ్ళకే ఇచ్చాను.  కాని నేను చదవని పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయని మళ్ళి కొనాలనిపిస్తుంది. చూద్దాం………….

నేను కూడా నాకు నచ్చిన కథల గురించి రాస్తాను.

ప్రకటనలు

Comments on: "పుస్తక సమీక్ష" (8)

 1. మరి నేనూ నా చిన్నప్పటి అనుభవాల గురించి చెప్పనా? (నిండా పాతికేళ్ళు లేవు..దానిలోనే నాకు చిన్నప్పుడు,పెద్దప్పుడు! ఐదేళ్ళవాడు కూడా చిన్నప్పుడు,పెద్దప్పుడు అంటాడు..చూసారా వింత?) – చందమామ,బాలమిత్ర,బాలజ్యోతి,బొమ్మరిల్లు – వంటి తెలుగు మేగజీన్లు, టింకిల్,అమర్ చిత్ర కథ, మిక్కీ దోనాల్డ్ కథలు, అప్పుడప్పుడు – చంపక్, గోకులం(అస్సలు నచ్చదు ఈ చివరిది నాకు)..వగైరా. చందమామలూ, టింకిళ్ళూ ఇప్పటికి మా బంధువిలింటికి వెళితే చదువుతా. కానీ, పాతవే నచ్చుతాయి నాకు. ముసలి వాళ్ళు ఎప్పుడూ మా కాలం లో ఎంత బాగుండేదో అన్నట్లు! అప్పుడప్పుడూ మా అత్త వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ పాత యువ వగైరా మేగజీన్లను చూసి అవి పరిచయం అయ్యాయి. బాబై ఇంట్లో 50లలో వచ్చిన శశి తదితర పత్రికల గురించి తెలిసింది. ఈ విధంగా నేను 50ల నుండి వస్తున్న పత్రికల గురించి తెలుసుకోడమూ, చందమామ వంటివి అయితే 50ల నాటి పత్రికలు కూడా చదవడమూ జరిగింది… మూడు తరాల చందమామ చదువరుల కుటుంబం లో పుట్టినందుకు 🙂

 2. వ్యాఖ్య లా మొదలెట్టి మినీ టపా రాసేసాను. ఇంకా రాయాలని ఉంది కానీ మీ టపా ని మించుతుంది ఏమో అని రాయలేదు…

 3. alaa jyOti gaari daggara nuMDi pustakaalu poMdina adRshTavaMtuDini nEnE!

 4. మహిళా బ్లాగులు (http://deeptidhaara.blogspot.com/2007/05/blog-post_26.html) అనే టపాలో, వెన్నెల్లో ఆడ పిల్ల పుస్తకం గురించి, యెండమూరి నవలా నాయికల గురించీ రాయటానికి, జ్యోతక్క నాకు బహుమతిగా ఇచ్చిన పుస్తకాలు ఉపయోగ పడ్డాయి.

 5. నో ప్రాబ్లం సౌమ్య,,,చిన్నప్పటి సంగతులు, పుస్తకాల ముచ్చట్ట్లు ఎంత చెప్పిన తరగవు..చెప్పు…లేదా నీ బ్లాగులోనే రాసేయి..తప్పులేదు..

 6. నా పేరు రాంబాబు.

 7. నేను కూడా అంతే! చిన్నతనంలో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు, ట్వింకిల్ వంటివి క్రమం తప్పక చదివేవాడిని. చందమామ అయితే ఇప్పటికీ చదువుతున్నాను.
  కాస్త పెద్దయ్యి, కాలేజి రోజులకొచ్చాక- వార, మాసపత్రికలు, యండమూరి, మల్లాది, యద్దనపూడి నవలలు తెగ చదివేవాడిని.
  చిన్నప్పుడు చదివిన పుస్తకాల వల్ల, రాయడము, అనువదించడము అలవడ్డాయి.
  నా దగ్గర ఇప్పుదు కనీసం 200 పుస్తకాలున్నాయి.

 8. నేను ప్రస్తుత తరపు రచయితలు రాస్తున్న కధలను అనువదిస్తున్నాను.
  నా కధలు విపుల, వార్త ఆదివారం అనుబంధం, నవ్య వీక్లీ, ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబందం, ఇంకా తేజా వారపత్రిక లోను ప్రచురితమైనయి.
  నా అనువాద కధలలో కొన్నింతిని ఈ link లో చదవగలరు
  http://somasankar.googlepages.com/mytranslations
  మీ అభిప్రాయం తెలియజేయండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: