నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మీకు తరచుగా విసిగించే ఫోన్ కాల్స్ వస్తున్నాయా!!!  స్కీమ్‍లు, సెల్ ఫోన్ ప్రకటనలు,  ఇన్స్యురెన్స్, లోన్‍లు గట్రా…..అయితే ఈ చిట్కాలు ప్రయోగించి చూడండి. మీరు హాయిగా మీ పనులు చేసుకోవచ్చు………….

 1. టెలి కాలర్స్  అమ్మాయైనా అబ్బాయైనా మాట్లాడటం అయిపోయాక  నన్ను పెళ్ళి చేసుకుంటారా    అని      అడగండి..

2.  టెలి కాలర్స్ సోది మొదలెట్టగానే సారీ అండి నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. మీ ఇంటి నంబరు ఇవ్వండి.  

     నేనే కాస్త వీలు చిక్కగానే మీకు ఫోన్ చేస్తాను  అని చెప్పండి.

3.  వాళ్ళు చెప్పడం అయ్యాక నాకు అర్ధం కాలేదు మళ్ళీ చెప్పండి అని పదే పదే చెప్పించండి. చస్తే మళ్ళీ         

     చేయరు.

4.  ఫోన్  చేసినప్పుడు నేను భోజనం చేస్తున్నాను. కాస్త ఆగండి అని ఫోన్ పక్కన పెట్టి హాయిగా       

     లొట్టలేస్తు ,కూరల గురించి గొప్పలు చెప్పుకుంటూ తీరిగ్గా తినండి.

5.  వాళ్ళకి మీ బిజినెస్ అంతా మీ ఏజెంట్ చూసుకుంటాడు అని ఫోన్ మీ ఐదేళ్ళ బుడుగుకి ఇవ్వండి.

6.  మీకు కాస్త తక్కువగా వినిపిస్తుంది అని వాళ్ళని గట్టిగా మాట్లాడమని చెప్పండి మళ్ళీ మళ్ళీ….

7.  మీరు చెప్పినదంతా రాసుకుంటున్నాను మెల్లిగా ఒక్కో పదం చెప్పమనండి.

8. మీరెలా ఉన్నారు అని మొదలెట్టగానే  నాకు చాలా సంతోషంగా ఉంది నా గురించి ఇలా అడిగినందుకు.       

     ఇవీ  నా సమస్యలు అని ఉన్నవి లేనివి అన్నీ చెప్పండి.

9. ఫోన్ చేసింది మగవాడైనా హాయ్ డార్లింగ్! ఎలా ఉన్నావు. అని ప్రేమికుడిలా సుత్తి కొట్టండి.

     హెస్ ఎస్ బి సి  కాల్ సెంటర్ నుండి ఫోన్ చేస్తే నా ఆఫీసు నంబరుకి చేయండి అని ఈచిచి ఐ  కాల్ సెంటర్

      నంబరు ఇవ్వండి. వాళ్ళూ వాళ్ళూ కొట్టుకు చస్తారు.

10. ఇది రోజు మనను విసిగించే కాల్స్ తో వచ్చే పిచ్చి ఆలోచనలు.

ప్రకటనలు

Comments on: "కాల్చేసే చిట్కాలు…" (6)

 1. Hi,

  Jyothi Kalchese Chitkaalu…

  ane topic bagundhi ”Purreko buddhi Jihvako ruchi” annatlu gaa undhi… keep it up…

  bye.

 2. chalaa baagunnaayamdii. oka saari prayatnimchi choodaali.

 3. చాలా నవ్వు తెప్పించాయండి, ట్రై చేసి చూసి ఫలితం మీతో మల్లి ముచ్చటిస్తా

 4. ఇంకో చిన్ని చిట్కా…
  “జుస్ట్ ఎ మినట్…” అని స్పీకర్ ఫోన్ లో పెట్టి …మీ పని మీరు చెసుకోండి…
  భరద్వాజ

 5. చక్కటి అవిడియాలు !, నాకు చాలా వుపయోగం , కాని నాకు ఐదేళ్ళ బుడుగు లేడు వాడు వచ్చేసరికి ఏడు ఏళ్ళు పట్టోచ్చు 😦

 6. మంచి సలహలు ఇచ్హారు. అన్ని అమలు పరచవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: