నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

తెలుగు నిఘంటువులు చాలా వచ్చాయి. అయితే అన్నింటిలోనూ గ్రాంధిక, కావ్యభాషా పదాలే అధికంగా వుంటాయి. ప్రత్యేక నిఘంటువులు, పదకోశాల్లో పారిభాషిక పదజాలానికి, వృత్తి సంబంధమైన పదాలకు, పద బంధాలకూ కూడా అర్ధాలుదొరుకుతాయి. నానార్ధ పదకోశాలు, పర్యాయపద నిఘంటువులు,మాండలిక పద నిఘంటువులు, వృత్తికోశాలు, పాత్రికేయ పదకోశాలు ఈ కోవకు చెందుతాయి. కాని వాడుక తెలుగును వీటి నుంచి ఆశించలేం.  అది నిజంగా పెద్ద లోటే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి వాడుక తెలుగు కోశాన్ని రూపొందించారు. యిందులో తక్కిన వాటిలో లభ్యంకాని పదాలనేకం దొరకడం సంతోషకరం. అలాగే ఇందులో మన వాడుక భాషలోకి చొచ్చుకు వచ్చిన అన్య భాషా పదాలు, సమాచార రంగంలో ఉపయోగంలో వున్న కొన్ని పదాలకు కూడా స్థానం లభించింది. అయితే వాడుక తెలుగు పదకోశం అనే పేరుతో వచ్చిన ఈ పుస్తకం ప్రస్తుత కాలంలో వాడుకలో లేని  అంఘ్రి, అంపాచారం, అంబుశీకరం, అకీర్ణం, ఇంద్రలుప్తకం, ఇద్దుగ, ఉపసర్జనం, ఉపాకృతం, ఔకాపు, ఔజసం, కంకతం, కింపచానుడు, క్రేవ, క్రేపు, క్రకరం..(ఇవి మచ్చుకు మాత్రమే) వంటి అనేక పదాలు చోటు చేసుకోవడమే ఆశ్చర్యకరం.

వాడుక తెలుగు పదకోశం

కూర్పు: ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి

సహాయకులు: డా.ఎం.నరసింహారెడ్డి,పి.రాజేశ్వరరావు

పేజీలు : ౩౦౦ వెల రూ.౧౨౦

ప్రతులకు : విశాలాంధ్ర్ర బుక్ హౌస్

అన్ని బ్రాంచీలు…..

ప్రకటనలు

Comments on: "పుస్తక పరిచయం" (2)

  1. పేజీలు : ౩౦౦ వెల రూ.౧౨౦
    – ilaa raayadam lo aamtaryam emiti?
    in my humble opinion, sticking to any one notation of numerals is better…either arabic numerals or telugu numerals….

  2. ur right soumya ..while typing telugu i wrote numbers also ..forgot to change them.. i ll be cautious in coming posts..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: