నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

వాహ్ తాజ్ !!!!….

               tajmahal.jpg

ఈ తాజ్‍మహల్ గొడవేంటి బాబు!! ఎస్.ఎమ్.ఎస్ లు చేయమంటారు. ఫోన్లు చేయమంటారు..అసలు ప్రపంచంలో ఏడు వింతలే ఎందుకు? ఎక్కువ ఉండకూడదా?. కొత్త కొత్త వింతలు ఎన్నో పుట్టుకొస్తుంటాయి.. మన తాజ్‍మహల్‍ను ఆ వింతలలో నిలబెట్టడానికి ఇంత బలవంత తాపత్రయం ఏంటంట. రేడియోలలో,టీ.వీ ప్రోగ్రాములలో ఇప్పటికే ఎస్.ఎమ్.ఎస్ ల గోలతో తల వాచిపోతుంది. ఇప్పుడు ఈ తాజ్‍మహల్ కోసం..

 

 

అసలు తాజ్‍మహల్ ఆ ఏడు వింతలలో లేకపోతే మునిగిపోయేది ఏంటంట? వింత కాకుంటే జనం తాజ్ ను చూడటానికి రారా?? ఐనా మన దేశంలో తాజ్‍మహల్ తప్ప వింతలు, అద్భుతమైన కట్టడాలే లేవా?? వింతలలో చేర్పించడానికి ఇంత ప్రచారం ఎందుకో అర్ధం కాదు. అదే ఆ తాజ్‍మహల్‍ను వాతావరణ కాలుష్యం నుండి, అధికారులు, మంత్రుల నుండి కబ్జా కాకుండా కాపాడదామని ఒక్కడైనా ప్రయత్నిస్తున్నారా?? మన అద్భుత కట్టడాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకునేది లేదు కాని ఏడు వింతలలో చేర్చడానికి వోటు చేయమని ఒకటే గోల….

ప్రకటనలు

Comments on: "వాహ్ తాజ్ !!!!…." (3)

 1. అవునండి , నేను కూడా ఈ గోల భరించలేక నా బ్లాగులో గోడు వెళ్ళబోసుకోన్నాను,
  ఏమిటో ఈ పిచ్చి ఈ వెర్రి జనాలకి 😦

 2. Just imagine the cost involved in getting Taj in the new seven wonders list
  additional Votes required 30,00,00,000
  cost per SMS Rs 5 (international SMS)
  Total cost of SMS Rs1,500,000,000

  By utilising this Rs1.5bn we can atleast try to clean the Taj surroundings and make Agra a clean city. This would attract more tourists

 3. జ్యోతి గారు,
  నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే గోల. తాజ్ మహల్ కి ఓటెయ్యండి అంటూ. నిజమే. అదొక అద్భుతమైన కట్టడమే. కానీ దానిని ఏడు కొత్త వింతల జాబితాలో చేర్చడానికి ఓటెయ్యకపోతే దేశ ద్రోహం గా మాట్లాడుతున్నారు.
  దీని కన్నా మన దేశం లో ఉన్న అద్భుతమైన కట్టడాలను పరిరక్షించే ఉద్యమం ఏదైనా మొదలయితే బాగుంటుంది.
  ఎర్రకోటని వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ వార్తకి పెద్దగా ప్రచారం ఇవ్వకుండా, ఎంత సేపు తాజ్ మహల్ గురించే మాట్లాడుతోంది మీడియా.
  సోమ శంకర్

  http://www.kollurisomasankar.wordpress.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: