నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఆదాబర్సే…..

                         hyderabadi.jpg

 

ఇది హైదరబాదీయుల మధురమైన భాష. వినడానికి తికమకగా ఉన్నా ఎంతో ఆత్మీయంగా ఉంటుంది. ఇందులో హిందీ , ఉర్దూ కలగలసి ఉంటుంది

 

యహీచ్ హై :  ( ఇక్కడే ఉంది ). హైదరాబాదులో ముఖ్యంగా పాతబస్తీలో దారికోసం ఎవ్వరినడిగినా తెలీదు అనరు . యహీచ్ హై సీదా జాకే దాయే ముడ్‍నా( ఇక్కడే ఉంది. నేరుగా వెళ్ళి కుడివైపుకి తిరుగు) అని చెప్తారు . ఆ స్థలం కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే అది సందు మూలలోనే ఉందన్నట్టు చెప్తారు. నిజమే కదా అనుకుంటాడు అడిగిన వాడు.

 

క్యా హై కి :  ( ఏమిటంటే ). ఈ పదం ఏ సంభాషణ ముందు కాని తర్వాత కాని వాడటం సర్వసాధారణం. క్యా హై కి బస్ కె పీచే బాగ్ రహా థాఎంటంటే బస్సు వెనకాల పరిగెడుతున్నాడు అని. దానికి దీనికి ఏమన్నా సంబంధముందా. ఉండదు.

 

హౌ : (ఔను) ఇది ఇంగ్లీషు పదంలా అనిపిస్తుంది కాని ఔను అనేదానికి హౌ అని అనడం సాధారణం.

 

నక్కో: (వద్దు) . ఎదైనా వద్దు లేదా నచ్చనప్పుడు నక్కొ అంటారు తల కూడా అడ్డంగా ఊపుతూ.ఒకోసారి అది అవునా కాదా అని సందేహం కూడా వస్తుంది కొత్తవాళ్ళకి..

 

బోల్తూన్ : (చెప్తాను) మనం ఎదైనా ఎవరికైనా చెప్పమంటే సరే చెప్తాను అనడమే బోల్తూన్. కాని అది మర్చిపోకుండా చెప్తాడో లేదో తెలీదు.

 

పర్‍సూన్: (మొన్న లేదా ఎల్లుండి)  ఇది సరిగ్గా మొన్నా లేదా ఎల్లుండి అనే కాదు. గతించిన ఏ రోజైనా లేక రాబోయే ఏ రోజైనా ఇలానే అనడం అలవాటు హైదరాబాదీయులకు.

 

అభీచ్..( ఇప్పుడే) ఈ పదం పర్‍సూన్ కి దగ్గరి చుట్టం. ఎక్కువ వాడకంలో ఉంది. అది వ్యక్తి మాట్లాడే సంధర్భం బట్టి అర్ధం మారుతూ ఉంటుంది.

 

ఆయే తో ఆతూ నహీ తో నహీ ఆతూ( వస్తే వస్తాను లేకపోతే రానూ) ఇది వింతగా ఉండొచ్చు కాని నిక్కచ్చిగా చెప్పేయడం ఇక్కడి జనాలకు అలవాటు మరి. నేను బ్రతికుంటే బ్రతికున్నట్టు లేకపోతే చచ్చినట్టు లాగా….

 

కై కూ : (ఎందుకూ)  ఈ పదం యొక్క స్వరాన్ని బట్టి ఆ వ్యక్తికి మనం ఎంత దగ్గరివారమో తెలుస్తుంది.

 

అభీ ఆతూ: (ఇప్పుడే వస్తాను).. ఇలా అన్నాడంటే ఇక ఆ వ్యక్తి  గురించి మర్చిపోవడమే మేలు. ఎందుకంటే హైదరాబాదీ సమయపాలన అంతగా పట్టించుకోడు. తొందరపడడు. అభీ ఆతూ అని వెళ్ళాడంటే రావచ్చు లేదా అట్నించటే పారిపోవచ్చు. మనం అతడిని మర్చిపోవచ్చు.

 

పానీ నహా లో :  (నీళ్ళతో స్నానం చేయి) అందరు స్నానం చేసేది నీళ్ళతోనే కదా? కాని ఇది ఇలానే అంటారు. ఊరికే నహాలో (స్నానం చేయి) అనరు మరి.

 

ఘర్ పే బోల్ కే ఆయా క్యా: (ఇంట్లో చెప్పొచ్చావా) రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా మనను దాటి వేగంగా వెళ్తే అనే సాధారణమైన వాడుక పదం. ఇంట్లో చెప్పొచ్చావా మళ్ళీ తిరిగొస్తానని ,చావు ప్రోగ్రామ్ పెట్టుకున్నావా అనే ఉద్దేశ్యంతో అంటారు.

 

ప్రకటనలు

Comments on: "ఆదాబర్సే….." (1)

  1. జ్యోతి గారూ,
    చాలా బాగుంది. నేను హైదరబాదు కి కొత్తగా వచ్చాను. నాకిది ఉపయోగపడుతుంది. ఇంకా ఇటువంటివి , ఇంకా హైదరాబాద్ సంస్కృతీ విశేషాలు తెలియజేయండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: