నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

*నియమావళి…. ఇందులో బ్లాగులవలన బాధపడ్డవాళ్ళందరూ చేరవచ్చు . ప్రవేశం ఉచితం బ్లాగులలాగే. ఆడామగా బేధంలేదు. కాని ఇందులో సభ్యుల భార్యలు లేదా భర్తలు విధిగా బ్లాగరులై ఉండాలి .ఈ సంఘం మొదలెట్టడానికి గల పరిస్థితుల గురించి వివరిస్తాను. నేను ప్రెసిడెంటుని కదా !.

మా వారు ఇప్పుడు ప్రముఖ బ్లాగరు. ఈ సమస్యలు మాకు ( అంటే నాలాంటి మరికొందరు భార్యలు అన్నమాట) గత ఆరునెలల నుండి మొదలయ్యాయి. ముందు నా సంగతి చెప్తున్నాను. మావారికి తెలుగు అంటే ఇష్టం ..సరే ..బానే ఉంది. ఆరునెలల క్రింద వరకు మా వారు ఆఫీసు నుండి రాగానే హాయిగా కబుర్లు చెబుతూ నేను చేసిన పకోడీలు తింటూ టీ త్రాగి పేపర్ ఓసారి తిరగేసి ..వంట చేస్తున్న నాతో కబుర్లాడుతూనే పిల్లల హోంవర్క్ చేయించేవారు. రాత్రి భోజనం అయ్యాక కాసేపు టీవీ చూసి లేదా అలా వాకింగుకి వెళ్ళి వచ్చేవాళ్ళం . అప్పుడప్పుడు సెకండ్ షోకి కూడా వెళ్ళేవాళ్ళం. కాని ఇప్పుడు???.

అసలు ఎవడు చూపించాడో కాని ఈ తెలుగు రాయడం . బ్లాగు రాయడం. ముందు నెట్ సెంటర్ కెళ్ళి రెండు మూడు గంటలు కూర్చునేవారు. తరువాత వాయిదా పద్ధతిలో కంప్యూటర్ కొన్నారు. రాగానే బట్టలు మార్చుకుని మొహం కడిగి ఏమోయ్ టీ అంటూ ఆర్డరేసి దాని ముందు సెటిల్ అయ్యేవారు. కొత్తలో అది ఎలా వాడాలో నేర్చుకుని మెల్లగా తెలుగు టైపింగ్ ఎలా చేయాలో తెలుసుకుని బ్లాగులు చదవడం మొదలెట్టారు. ఒక మంచిరోజు చూసి బ్లాగు మొదలెట్టి రాయడం మొదలెట్టారు. నేను వంటతో సతమతమవుతూ పిల్లల హోంవర్క్ చేయించేదాని. పోనీలే మన మాతృభాష కదా మంచిదే అని…టిఫిన్ లేకుండానే టీ ఇచ్చినా అలాగే కూర్చునేవారు. చూద్దాం అడుగుతారో లేదో అని నేను ఎన్ని రోజులు చూసా! ఊహూ…సర్లే నాకే పని తప్పింది అని ఊరకున్నా.

ఆఫీసులో అన్ని బ్లాక్ చేసి ఉంటాయంట. అందుకే ఇంటికి రాగానే ముందుగా కంప్యూటర్ స్విచ్చి ఆన్ చేస్తూ చెప్పులు విప్పుతారు. ముందుగా తను రాసిన టపాకు వచ్చిన కామెంట్స్ చదవడం , తర్వాత కూడలి, తేనేగూడు ఇలా అన్ని మెయిల్స్ చూసేసరికి రెండుగంటలు. అయన వెనకాల ఇంట్లో ఏం జరుగుతుందో , ఎవరెలా ఉన్నారో ఎమీ పట్టదు. ప్చ్ ….ఇవన్నీ నాకెలా తెలుసనుకుంటున్నారా? ఆడవాళ్ళం ఒకసారి ఒకే పని చేయం కదండీ. నా పని చేస్తూనే ఆయన మీద ఓ కన్నేసి చూస్తుంటా. ఎవరైనా ఆడాళ్లతో చాటింగ్ గట్రా చేస్తున్నారేమో అంత ధీర్ఘంగా కూర్చుంటే అని సందేహం కూడా కలిగింది. పోనీలే పోనీలే అని ఊరుకుంటే ఈ బ్లాగ్పిచ్చి పెరుగుతూనే ఉంది. పైగా ఇంటికొచ్చిన ప్రతి వారితో బ్లాగులగురించి ముచ్చట్లు. మా తమ్ముడికి కూడా చెప్పబోతుంటే వాడిని పంపేసా వెళ్ళరా మీ ఆవిడ ఎదురుచూస్తుందని. నా కష్టాలు తెలిసి తెలిసి వేరొకరిని పడనిస్తానా.

ఇవన్నీ చేసి నా వ్రేళ్ళు లాగుతున్నాయి కాస్త జండూబామ్ రాయవే అంటారు రాత్రి ..తిక్క రేగి నేను పెట్టను అని పడుకుంటా .మీరే చెప్పండీ. ఇదేమన్నా బావుందా. ఆ కంప్యూటర్ నాకు సవతి అయినట్టుంది . ఎప్పుడో దాని కనెక్షన్లన్నీ పీకి పడేస్తాను. కాని అన్నేసి వేలు పోసి కొన్నది కదా మనసు రాదు. రాసుకోండి, చదువుకోండి నేనొద్దనను. మరీ అలా నన్ను పిల్లలను గాలికొదిలేసి అందులోనే మునిగిపొమ్మన్నారా? ఇలాగే మా కాలనీలో నాలాంటి బాధితులు ఓ పదిమంది దొరికారు. సరే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే మేమందరం ఏకమై ఆలోచించాలి. అని సంఘం పెట్టుకున్నాము.

ఓ రోజు ఒకతను వచ్చి “నేను కూడా బ్లాగ్బాధితుడినే . నన్ను చేర్చుకోండి మీ సంఘంలో” అన్నారు . ఆశ్చర్యపోయాము. ఆడాళ్ళవల్ల కూడా బాధింపబడే మొగుళ్ళూన్నారా అని. అతను చెప్పింది విని వెంటనే చేర్చుకున్నాం ..ఇంతకీ ఏమన్నాడో తెలుసా?? “నేను ఆఫీసుకెళ్ళాక బోరు కొడుతుందంటే నా కంప్యూటర్ నేర్పించా … మెల్లిగా బ్లాగు రాయడం నేర్చుకుంది. ప్రొద్దున లేచి మొహం కడుక్కుని టీ తాగుతూ కూడలి చూస్తుంది. అప్పటికింకా ఎవరూ లేవరు . తర్వాత వంట పనీ అదీ త్వరగా పూర్తి చేసి నేను ఆఫీసుకెల్లేది ఆలస్యం మళ్ళీ ఆన్ చేసి అన్నీ చదువుతూ కూర్చుంటుంది. ఇల్లు సర్దేది లేదు . దుమ్ము దులిపేది లేదు. మద్యాహ్నం కాస్త పడుకుంటుందేమో. తన బ్లాగులో కొత్త కొత్త విషయాలు రాయడానికి పుస్తకాలు కొనిమ్మని నాతో పోరు .నేను తెచ్చినవి నచ్చలేదంటే తననే తీసికెళ్ళి దుకాణంలో వదిలేసి చూసుకో నేను బిల్లు కడతా అని పేపర్ చదువుతూ కూర్చున్నా. పోనీలే మాతృభాషాభిమానం కదా అని . ఇప్పుడు పలు రకాల టిఫిన్లు చేయదు. ఎక్కడికన్నా వెళదామంటే మీరెళ్ళండి నేను రాసుకోవాలి . అంటుంది. ఒక్కడిని పార్కుకో సినిమాకో వెళ్ళనా. ఏం చేయాలో తోచటం లేదు . కాస్త మీరన్నా ఉపాయాలు చెప్పండి. మా సంసారాన్ని నిలబెట్టండి.” అంటు వాపోయాడు .

ఇది చదివే వాళ్ళంతా మా సంఘం గురించి మీ భార్యలకు కాని, భర్తలకుకాని చెప్పరని తెలుసు. కాని వారి వద్దకు ఎలా చేరాలో మాకు తెలుసు కాని మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మేము దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాము . బ్లాగులు రాసుకోండి ఎవరూ వద్దనరూ. అందులోను మన తేనెకన్నా తీయనైన మాతృభాష. కాని కాస్త మీ భార్యలు , భర్తలు, పిల్లల గురించి పట్టించుకోండి. ఇలాగే ఉన్నారనుకోండి . పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు.

పద్మజ
ప్రెసిడెంట్…

పొద్దు సౌజన్యంతో…

ప్రకటనలు

Comments on: "బ్లాగ్బాధితుల సంఘం" (3)

 1. వెల్, మీరొక్కరే కాదు లెండి. బహుశా బహుశా బ్లాగుబాధిత తాతయ్యలు, అమ్మమ్మలు కూడ ఉండి ఉంటారు. అయినా ఈ పిచ్చి మన నాయకులకు ఎందుకు పట్టదో ? వాళ్ళు చేసేది ఎలాగు ఏమీ ఉండదు. వాళ్ళు గాని అడిక్ట్ అయితే, ఈ భూకబ్జాలు, టెండర్ల గోలలు, వి.ఐ.పి ట్రాఫిక్ జాములు తగ్గుతాయెమో. బహుశా కొన్ని నేరాలు కూడా తగ్గచ్చేమో ?

 2. పద్మజ గారు

  భలే నవ్వు తెప్పించారండి. బ్లాగర్లందరికీ పెళ్ళిచూపులకెళ్ళినప్పుడు అడగాలి “మాకో బ్లాగు వ్యసనం ఉంది, మీకేమన్నా ఇబ్బందా ?”, అని. ఇంటర్నెట్టు అంటే నిజంగా ఒక జాడ్యం, త్వరలో హైస్పీడు కనెక్షన్లు, వీడియో బ్లాగులు, వీడియో చాటులు, ఆ పై వర్చువల్ రియాలిటీ చాటులు.. మానవాళిని ఎప్పుడో అంతం చేసేస్తుందిది.

  శని, ఆదివారాలపాటు కంప్యూటరు వద్ద కూర్చోకూడదని నేనొక శపథం చేశాను, ఎంతకాలం సాగుతుందో తెలీదు 🙂 ఇలాంటి రూలేదో పెట్టండి మీవారికి 😀

 3. పద్మజ గారు
  మీ బ్లాగుల సంఖ్య చూస్తుంటే ఎందుకో మీరు చెప్పిన కథలో మీ స్థానంలో మీ వారు, మీ వారి స్థానంలో మీరు ఉన్నారేమో అని అనిపిస్తునంది.
  కాని మీ సంఘం వలన మా లాంటి అబ్బయిలకు చాలా మేలు జరిగింది లేండి. ఇప్పటినుంచి అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటాం.
  భవిష్యత్తు పెళ్ళీ చూపుల్లో (అవి అంటూ ఉంటే) అమ్మాయికి JAVA లాంటివి వచ్చా అనే ప్రశ్నతో పాటు భ్లాగింగ్ ఎక్కువగా చేసే అలవాటు ఉందా అని కూడా అడగాలేమో….. 🙂

  -హరీష్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: