నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

గత నెల తెలుగు బ్లాగర్ల సమవేశంలో సురేష్ కొలిచాలగారు మా అబ్బాయిని మీ మమ్మీ రాసే బ్లాగులు నువ్వు చదువుతావా అని. కాని వాడికి నేను కంప్యూటర్ పై ఏం చేస్తానో తెలీదు. ఎదో వంటలు ,పాటలు రాసుకుంటాను అనుకుంటాడు.ఇంటికొచ్చి నన్ను అడిగాడు మమ్మీ నువ్వు ఎన్ని బ్లాగులు ఏమేమి రాస్తావు. నవ్వొచ్చింది. కాని నాకు కంప్యూటర్ నేర్పింది వాడే. అలా నేర్పి తప్పు చేసాను నాకు సిస్టం దొరకటం లేదు అన్నాడు.అప్పుడు సురేష్ గారు అన్నమాట మన ఇంట్లో పిల్లలకు తెలుగు గురించి తెలపడం ముఖ్యం అన్నారు. అప్పటి నుండి ఎన్నో విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను.

 

నేను ప్రముఖ బ్లాగరును. ఎన్నో విషయలు రాస్తున్నాను. కాని మా పిల్లలకు తెలుగు అంటే ఆమడ దూరం పారిపోతారు. స్కూల్లో ఉన్నప్పుడు చందమామ కొనేదాన్ని. అలా అన్నా తెలుగు  పుస్తకాలు చదవటం అలవాటవుతుందని. కాని  వాళ్ళకి స్కూలు పుస్తకాలు, హోమ్‍వర్క్, పరీక్షలతోనే సరిపోయేది. చందమామ నేనే చదవాల్సొచ్చేది. అరగంటలో అది ఐపోయేది. తర్వాత మానేసా. పదో తరగతి వరకు ఎదో గుండెల మీది కుంపటిలా తెలుగు చదివారు. స్పెషల్ ఇంగ్లీషు తీసుకుంటా నంటే తిట్ట చదవండి. కాని ఇంటర్ వచ్చాక తెలుగు అటకెక్కింది.  తెలుగు పేపర్ చదువుతారు కాని తక్కువ. ఇక నేను రాసే బ్లాగులు ఏం చదువుతారు. అంతా ఇంగ్లీషు చదువులు. తెలుగు మీద ప్రత్యేక అభిమానం ఉంటే కాని పిల్లలు తెలుగు పుస్తకాలు చదవరు. ఇలాంటి వాళ్ళను చాలామందిని చూశాను. పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు కాని తెలుగు చదవడం తప్ప రాయడం రాదు. అడిగితే ఏం చేయమూ అంటారు. ఎంతో మంది గృహిణులు ఉన్నారు. పుస్తకాలు చదువుదాము, నెట్‍లో ఏమున్నాయో నేర్చుకుందాము అనుకోరూ. అందరూ ముప్పై ఏళ్ళలోనే ఉన్నారు. కొందరు మాత్రమే కుట్లు అల్లికలు చేస్తారు. కాని వారిని తెలుగు బ్లాగులు రాయడం వదిలి చదవమంటే చచ్చేంత బద్ధకం. నేను రాసే బ్లాగులు కూడా మా ఇంట్లోకాని మా చుట్టాలకు గాని తెలీదు. చెప్పినా ఇలా విని అలా వదిలేస్తారు. టీ.వీ సీరియల్స్ మీద ఉన్నట్టు తెలుగు చదవడం రాయడం మీద అస్సలు ఆసక్తి ఉండదు. కాని పెద్ద వయసు వారు మాత్రం తెలుగు చదవడం , పౌరాణికాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారు.

 

 

ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా?? మనకు ఇష్టం ఉంది కాబట్టి మనం తెలుగు బ్లాగులు రాసుకుంటున్నాము. ఆసక్తి ఉన్నవారు చదువుతున్నారు. కాని ఇలా ఇంట్లో సమయం వృధా చేసేవారు, తెలియని వారిని మనం అంతర్జాలంలో తెలుగు ఎంత వ్యాప్తి చెందిందో . అది వారికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలి. వారిని వెంట ఉండి తెలుగు అలవాటు చేయాలి. చాలా మంది ఇంటర్‍నెట్ అంటే సదభిప్రాయం లేదు. అలాంటి వారిని కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి నేర్పించాలి. ఒక ఏడాది క్రింద నేను మా అబ్బాయి తో ఇలానే నేర్చుకున్నా ..తర్వాత వాళ్ళే తెలుగుపై మమకారం పెంచుకుంటారు. మన బ్లాగరు రామక్రిష్ణ అదేనండి క్రిశ్ రీమ్ అతడు మా అబ్బాయి తోటివాడే కాని తెలుగులోనే ఎంత బాగా రాస్తాడు. నాకైతే ముచ్చటేస్తుంది. మన చదువరిగారు,వరూధినిగారు కూడా  వాళ్ళ పిల్లలకు తెలుగు పుస్తకాలు చదవడం బాగా అలవాటు చేసారు. నేను చేయలేకపోయాను అని బాధపడుతుంటాను.

 

 

నేను చెప్పేది ఒకటే మనం బ్లాగులు రాయటంతో పాటు మన ఇంట్లోని అమ్మను, భార్యను,నాన్నను , రిటైరై ఇంట్లో వున్న వాళ్లకు అంతర్జాలము ఎలా ఉపయోగించాలి. తెలుగు ఎలా రాయాలి,చదవాలి అనే విషయాలు నేర్పించాలి. వాళ్ళకు కూడా మంచి టైమ్ పాస్. టీ.వీ. సీరియల్స్ , సొల్లు కబురులు అన్ని బంద్.

 

అందుకే తెలుగు వ్యాప్తిని ఇంటినుండే మొదలెట్టండి……………….

ప్రకటనలు

Comments on: "ఇంటి నుండి మొదలెడదామా….." (6)

 1. గుర్రాన్ని నీళ్ళ దగ్గిరికి తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు బలవంతంగా తాగించలేం అన్నాడు ఇంగ్లీషు వాడు దవడ నిమురుకుంటూ. లోకో భిన్న రుచిః అన్నారు మన శాస్తుల్లు గారు జంధ్యంతో వీపు గోక్కుంటూ. వాళ్ళ అభిరుచికి తగినదేదో అందులో కనబడాలి వాళ్ళకి ఆసక్తి పుట్టాలంటే. అప్పుడుకూడా బద్ధకపు బలాన్ని తక్కువ అంచనా వెయ్యలేం.

 2. ముందు వారికి ఇష్టమయిన టాపిక్లు రాసే వారి బ్లాగులు పరిచయం చెయ్యండి.
  పిల్లలన్నాక కనీసం సినిమాలయినా ఇష్టం కాబట్టి ఏ క్రిష్ గారిదో ఎవరిదో బ్లాగు పరిచయం చెయ్యండి.

  ఆ తర్వాత నెమది నెమ్మదిగా వారికి నచ్చినవి చూసుకుంటూ వారే చదువుతారు.

 3. అవునవును బాగా గుర్తు చేశారు..మా ఆవిడకి తెలుగు చదవటం నేర్పే ప్రణాళిక ప్రారంభించాలి.

 4. ఒక ప్రమిదలో దీపం వెలిగిస్తే, ఆ దీపం వెలుగు నలు దిక్కులా వ్యాప్తి చెందుతుంది. కానీ దీపానికి అతి సమీపములో ఉన్న ప్రమిద కింద మటుకు, ఆ ప్రమిద నీడ పడి చీకటిగానే ఉంటుంది.

  అదే విధంగా, మనం చేసే పనులను మన హితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మొదట్లో పెద్దగా పట్టించుకోరు. ఎవరి ద్వారానో తెలిసిన తరువాత “ఓహో” అంటారు.

 5. మీ బ్లాగు చాలా బాగున్నది, మీకు ఇష్టం ఉంటె తెలుగు సెర్చ్ మీ బ్లాగుకి చెర్చండి, మీ బ్లాగులో ఉన్న ముక్యమయిన విషయాలను వెంటనే వెతకవచ్చును. వివరాలకు ఈ క్రింది బ్లాగుని సంప్రదించండి.

  http://gultus.blogspot.com/

  ఈ క్రింది బ్లాగులను పరిశీలించ గలరు.

  http://kadhalu-kaburlu.blogspot.com
  http://ramya-ramyam.blogspot.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: