నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

tewiki3.png                               

రండి రండి రండి దయచేయండి
తమరి రాక అందరికీ సంతోషం సుమండీ

బ్లాగులు రాసేవారికి, రాయనివారికి, చదివేవారికీ అందరికీ ఇదే ఆహ్వానం. 

ఏంటండి సినిమా పాట పాడుతున్నా అనుకుంటున్నారా? బ్లాగులోకొచ్చాక కూడా ఇంకా రండి అంటున్నానంటారా.. నేను రమ్మని అన్నది తెలుగు వికీపీడీయాలోకి. అందరూ టపటపా బోలేడు టపాలు రాసేస్తున్నారు. సంతోషం. అదే చేత్తో తెవికీలోకి కూడా అడుగెట్టి అక్కడ కూడా రాయండి.ఏం రాయాలి అంటారా? పదిమందికి ఉపయోగపడుతుంది అనే విషయం ఏదైనా రాయొచ్చు.వికీలో రాసింది అందరికీ ఉచితంగా మరియు స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలి.

అందుకని కాపీహక్కులున్న సమాచారాన్ని వికీలో చేర్చకూడదు

సినిమా
వంటలు
కూరగాయలు,పండ్లు
చందస్సు
సామెతలు
జాతీయాలు
పురాణగాధలు
జానపద కళలు
మీ ఊరి గురించి

ఇలా కాదేది కవితకనర్హం అన్నట్టు తెవికీలో  పనికొచ్చేది  రాయొచ్చు. కాని రాయడానికి పుస్తకాలు కొనాలేమో అనుకోకండి. మీ దగ్గర ఉంటే సరి లేదా మీ పిల్లల స్కూలు పుస్తకాలు తీసుకుని చదివి మీకు అర్ధమైంది ఇంకాస్త వివరంగా రాసేయండి. తెలుగు చందస్సు,ఉపవాచకములోని కథలు, వేరే ఏ విషయమైనా తెలుగులో రాసేయండి. బ్లాగు రాయడానికే సమయం సరిపోవడం లేదు ఇక వికీలో ఎలా రాసేది అంటారా.వారానికి ఓ గంట తెవికీ కి కేటాయించండి. లేదా రోజు కొంచం కొంచం రాయండి మీ తీరిక సమయంలో. మీ కుటుంబ సభ్యులకు చెప్పండి , పిలలకు కూడా వాళ్ళ క్లాసు పుస్తకాల నుండి ఎదో విషయం కాని, లేదా పుస్తకం కొనిచ్చి రాయమనండి. కాస్త అలవాటైతే వదలరు. అలా వాళ్ళు తెలుగు మరిచిపోకుండా ఉంటుంది. సేకరణల బ్లాగుల వాళ్ళు తమ బ్లాగులలో ఉన్న విషయాలు  పదిమందికి పనికొస్తాయి అని అనుకుంటే వికిసోర్సులో రాయండి. కీర్తనలు లాంటివి.తెవికీలో రాయడం చాలా సులువు. దానికి ఎటువంటి సాధనాలు కానీ, మృదులాంత్రాలు కాని అవసరం లేదు. మీరు మామూలుగా చిన్న చిన్న మార్పులతో ఇంగ్లీషులో టైప్ చేసుంటే అక్కడ తెలుగులో వచ్చేస్తుంది. చాలా ఈజీ.మీకు ఏ సందేహమైనా సహాయమైనా ఇవ్వడానికి వికీ సభ్యులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. .

http://groups.google.com/group/teluguwiki?hl=te 

 మరి తొందరగా వచ్చేయండి.

ప్రకటనలు

Comments on: "రండి రండి దయచేయండి…." (4)

  1. తెవికీకి అందరినీ ఆహ్వానిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇంతకీ ఆ మొదటిపేజీ చిత్రం ఎక్కడ దొరికింది మీకు? రెండేళ్ల క్రితం తెవికీ మొదటి పేజీ అలా ఉండేది. పొద్దులో నేను తెవికీపై రాసిన వ్యాసాన్ని కూడా చూడండి. http://poddu.net/?p=311

  2. మీలాంటివారు ఇలా మధ్యమధ్యలో జ్ణాపకం చేయడం ఎంతయినా అవసరమే.

  3. నేను వ్రాద్దామని వ్రాయలేకపోయిన టపా వ్రాసినందుకు చాలా సంతోషం వేసింది. చెప్పదలుచుకొన్నది…వెరైటీగా సరదా శైలిలో వ్రాయడం బాగుంది. నేను కూడా నా ఒట్టును గట్టు మీద పెట్టి, నా బ్లాగు ద్వారానో తెవికీ-మైకు ద్వారానో జనాలకు తెవికీలోనికి వెరైటీ ఆహ్వానం పంపిస్తున్నా…:)

  4. మిమ్మల్ని తెవికీ HRగా ప్రకటించేస్తున్నాను నేను…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: