నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఎవరు ముఖ్యం??

ఇది నిజంగా జరిగిన కథ…

రామశర్మగారు భారత, భాగవతాలు క్షుణ్ణంగా చదివినవాడు.అతని కొడుకు

కులాంతర వివాహం చేసుకున్నాడు. అలా చేయడం వల్ల శర్మగారి

తండ్రులు,తాతలు,ముత్తాతలు, వారి తాతలు అందరికీ దోషం కలుగుతుంది .. ఈ

విషయం భాగవతంలో స్పష్టంగా ఉందని ఆయన అభిప్రాయం.అందువల్ల తన

కుమారుడు తన అంత్య క్రియలు చేయడం ఇష్టం లేదు.

 

నా సందేహం ఏంటంటే??

 

కులాంతర వివాహం చేసుకుంటే తాతలు,ముత్తాతలకు దోషమని చెప్పిన

భాగవతంలో శ్రీకృష్ణుడు అన్ని కులాల కన్యలను భార్యలుగా చేసుకున్నాడు అని

కూడా ఉందిగా. మరి అది తప్పు అని ఆ దేవదేవుడికి తెలీదా. అలా చేసుకోవడం

వల్ల అన్ని కులాల వారు ఒకటే అని నిరూపించారంటారే…

 

బ్రతికి ఉన్న మన పిల్లల సుఖం మనకు ముఖ్యమా లేక ఎలా ఉంటారో తెలీని

తాతలు,ముత్తాతలు వారి తాతలకు దోషమని ఉన్నవాళ్ళని వదులుకోవాలా. మరి

మన పిల్లలను అలా నిర్లక్ష్యం చేయడం, వాళ్ళు మనకు అంత్యక్రియలు

చేయకూడదు  అని నిర్ణయాలు చేయడం తప్పు కాదా..కన్న బిడ్డల సుఖం

అక్కరలేదు కాని అంత్యక్రియలు చేయాలో లేదో నిర్ణయించుకోవడమేనా.

కన్నకొడుకును కాదని వేరేవాళ్ళతో చేయించుకుంటే పెద్దలు సంతోషిస్తారా.

బ్రతికున్నప్పుడు చేయాల్సిన మంచి ఆలోచించాలా? లేక చచ్చినవాళ్ళ

మనశ్శాంతి గురించి పట్టింపులు ముఖ్యమా??

 

ఇదే విషయంగా మా వారితో కూడా చర్చ జరిగింది కాని నాకు సంతృప్తి

కలగలేదు.  

ప్రకటనలు

Comments on: "ఎవరు ముఖ్యం??" (7)

 1. ఇటువంటి పరిస్థితులు పురాణాల్లోనూ చాలానే కనిపిస్తాయి. చెప్పడానికే శ్రీరంగనీతులు!!!

  మా మిత్రుడొకాయనున్నాడు.. (చాలా మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం వున్న మనిషి). నేను ఈయన్ని తిట్టట్లేదండోయ్. ఈయన చేసింది తప్పు అనడం లేదు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని చెప్పట్లేదు. ఒక్కోసారి మనుషులు greatest of their principle ని కూడా వదిలేస్తారు అని చెప్పడానికి ఒక perfect example ఇస్తున్నా. బ్రాహ్మలతో తప్పితే ఎవ్వరితో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడడు. అటువంటాయన, ఒక రెడ్డి అమ్మాయిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు ఆవిడతో జీవితాంతం కలిసి జీవిస్తాడు.

 2. నమ్మకాల్ని ప్రశ్నించడం కష్టం. చాలా మంది after life ని గురించి, మనిషి చనిపోయిన తరవాత జరగాల్సిన తతంగాల గురించి చాలా లోతుగా నమ్ముతారు – ఇది అన్ని మతాల్లోనూ ఉంది. ఆ నమ్మకాన్ని లాజిక్ తో జయించడం కష్టం.

 3. let them pass in peace.
  వారు “బ్రతికున్నప్పుడు చేయాల్సిన మంచి ఆలోచించాలా?”
  ..లి.
  అందుకే, అలాంటి కోరికలు కోరుకుంటే అది చేస్తాను అని చెప్పడం ఒక పద్దతి.
  ధయిర్నం ఉంటే మీ నమ్మకాన్ని బట్టి చెయ్యండి.
  లేదంటే ..అందరితొ పాటే మనం అని వారు కోరుకున్న పద్దతిలొ చెయ్యడం మరొక పద్దతి.
  ఎందుకు అని అడగడం నేర్చుకొవాలి.
  ఎందుకు అని తెలుసుకొవాలి.
  మీరు ఇప్పుడు చేస్తున్నదదే!
  మీ బ్లాగులొ ప్రశ్న ద్వారా మిగతవారు నేర్చుకునేదదే.

 4. అజిత్ కుమార్ said:

  మీరు సోక్రటీస్ లా యదార్ధవాదులు. సాంప్రదాయవాదులూ , యదార్ధవాదులూ ఏ విషయం పైన అయినా ఏకాభిప్రాయానికి రాలేరు. మీరు ప్రశ్నించినందుకు నేను బాగా ఆనందిస్తున్నాను.

 5. ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకునే హక్కు కొడుకుకు ఉన్నప్పుడు,తనకు నచ్చిన పద్దతిలో నచ్చిన వారితో కర్మకాండ చేయించుకునే హక్కు అధికారము తండ్రికి ఉంటుంది కదా.

 6. అసలు నేను శర్మగారిని తప్పు పట్టడం లేదు. ఏమో నా పిల్లలు అలాగే చేస్తే నేను కూడా అలాగే అంటానేమో? కాని భాగవతంలో చెప్పారని అనడం అర్ధం కాలేదు. కులాంతర వివాహం వలన ముత్తాతలు,వారి తాతలకు దోషం ఐతే కృష్ణుడు ఎలా చేసుకున్నాడు??

  మన పిల్లల చేసిన తప్పులకు మన ముత్తాతలకు దోషమైతే , వారిచేత అంత్యక్రియలు చేయించకుండా వేరే వాళ్ళతో చేయిస్తే దోషమంటదా వారికి….మన బాధ్యత ఐన పిల్లల గురించి అలా చేయడం సబబేనా అని. ఇది నాకు కలిగిన సందేహం.

 7. నమ్మకమున్నవారికి “అంటుతుంది”.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: