నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అందరికీ ఒక విజ్ఞప్తి …మన ఆంధ్ర దేశంలో వివిధ ప్రాంతాలలో తెలుగు వివిధ యాసలలో మాట్లాడతారు. కాని ఏ ప్రాంతంలో ఎలా మాట్లాడతారో సరిగ్గా తెలీదు! చెప్తారా! దీనికి ఒక సంఘటన ఇస్తాను. ఇదే సంఘటనను వివిధ ప్రాంతాలు,యాసలలో చెప్పండి. ప్లీజ్…….

” ఏవండి! వచ్చేనెల మా తమ్ముడి పెళ్ళి ఉంది. మీరు ఓ పదిరోజులు సెలవుపెట్టి బ్యాంకు నుండి డబ్బులు తీసుకురండి. అందరికీ బట్టలు కొనాలి.రైలు టికెట్లు కొనాలి. నాకు ఒక మంచిపట్టు చీర కావాలి. అన్నీ పాతబడ్డాయి.వింటున్నారా.”

ప్రకటనలు

Comments on: "తేనె కన్నా తీయనిది తెలుగు…" (7)

  1. ఇప్పుడు ఎక్కడైనా ఒకే యాసండీ:
    ఏవండి! వచ్చేనెల మా బ్రదర్ మ్యారేజ్ ఉంది. మీరు ఓ పదిరోజులు లీవ్ పెట్టి బ్యాంకు నుండి మనీ తీసుకురండి. అందరికీ న్యూ క్లోత్స్ కొనాలి.ట్రైన్ టికెట్లు కొనాలి. నాకు ఒక మంచిపట్టు శారీ కావాలి. అన్నీ ఓల్డయిపోయాయి. వింటున్నారా.”

  2. అవకాశవాద రాజకీయాలలో తప్ప యాసలు ఇప్పుడెక్కడ లేవండి. ప్రస్తుతమంతటా వున్నది “తెంగ్లిషే” .

    …వల్లూరి.

  3. మా ఊర్లో ఐతే – “ఏంబ్బా..! వొచ్చే నెల్లో మా తమ్ముని పెండ్లిబెట్టుకున్న్యాం. నువ్వొగ పద్దినాలు శలవబెట్టి బ్యాంకులోనుంచీ లెక్కద్యావాల. అందరికీ గుడ్డలుగొనాల, రైల్‌టికెట్లుగొనాల, నాకొగ మంచి పట్టుచీరగావాల. ఉండేటియ్యన్నీ పాతబణ్ణాయి. యింటాండావా?”

  4. మీరు రాసింది మాత్రం స్వచ్చమైన గుంటూరు,కృష్ణా(కోస్తా) యాస, am I correct? యాస ఏదైనా ఆ తియ్యదనం మాత్రం ఒకటే

  5. అటుగాని, ఇటుగాని ప్రదేశంలో ఉన్న మా యాసకూడా కలగాపులగం. (మేం రాయలసీమ ఉత్తరపంచున, కొంచెం కొస్తా, కోంచెం నెల్లూరు, కొంచెం మహబూబ్ నగర్ ప్రభావాలు వెరసి..స్థూలంగా చూస్తే రాయలసీమ యాసే) కష్టం కానీ ప్రయత్నిస్తా

    “ఏమయ్యో!/ఏమండీ (వ లేదని గమనించాలి) పైనెల మా తమ్ముడి పెల్లి మాట్లడ్‌కున్నాం. నువ్వొక పద్రోజులు సెలవు బెట్టుకోని బ్యాంకు నుండి డబ్బుల్దీస్కోన్రావాలి. అందరికి బట్టల్బెట్టాలి, రైల్‌టిక్కట్లుకొనాలి, పన్లోపని నాకోక మంచి పట్టుచీరదీస్కోన్రా. ఉండేట్యన్నీ పాతగైఫోయినయ్. ఇంటున్నావా?”

  6. హైదరాబాదు,నల్గొండ, మెదక్ ప్రాంతాలలో ఇలా అంటరు..

    ఇగో! ఏమయ్యో. ఇంటున్నావా! వచ్చేనెల మా తమ్ముని పెండ్లి పెట్టుకున్నరంట. మా నాయిన పదిరోజుల ముందే రమ్మన్నడు. నువ్వు ఆఫీసుల లీవు తీస్కొ. అట్లనే బాంకుకెళ్ళి పైసల్దీసుకురా. మా అమ్మోలింట్ల ఆఖరి పెండ్లి అందరికీ బట్టల్ పెట్టాలె.గట్లనే నేనూ ఒక పట్టుసీర కొనుక్కుంట.పిల్లలకు కూడా అప్పుడు తాతీల్లు ఉన్నవంట. మరి జల్దీ రైల్ టికట్లు తేవాల.మర్సిపోకు.

  7. మదనపల్లె భాషలో ప్రయత్నిస్తా (నా యాస మరచిపోయి 10 యేండ్లు ఐతాంది)
    ఏమండి! వచ్చేనెల మా తమ్ముని పెండ్లి ఉంది. మీరు ఓక పదిరోజులు సెలవుబెట్టి బ్యాంకీ నుంచి డబ్బు తీసకరావల్ల. అందరికీ బట్టలు కొనల్ల. రైలు టిక్కెట్లు కొనల్ల. నాకు ఒక మంచిపట్టు చీర త్యావల్ల. అన్నీ పాతబణ్ణాయి. ఇంటాండారా.”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: