నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

                                                  jyo.jpg 

గతవారం బెంగుళూరు బ్లాగర్ల సమావేశంలో అంతర్జాలంలో గృహిణులు తమ సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోగలరో చర్చించారు మన మిత్రులు.
ఈ రోజుల్లో అందరు మహిళలు చదువుకునే ఉంటున్నారు. పెళ్ళయ్యాక పిల్లలు , ఇంటి భాధ్యతలు అంటూ తమ చదువు, తమ అభిరుచులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. భర్త సంపాదిస్తున్నాడుగా మేమేం చేయాలి అని. ఉద్యోగాలు చేసేవారు వేరే. నేను చెప్పేది ఇంట్లో ఉండే గృహిణుల గురించి. భర్త, పిల్లలు ఆఫీసులకు స్కూళ్ళకు వెళ్ళిపోయాక ఇంటి పని తీర్చుకుని కాస్త కునుకేసి టీవీలో వచ్చే చెత్త సీరియల్సు, ఇరుగమ్మ పొరుగమ్మతో కబుర్లు, లేకపోతే కిట్టిపార్టీలు. ఇదంతా వారు తమ తీరిక సమయాలలో ఏం చేయాలో తెలీక. ఇటువంటి పనుల వల్ల కొంత రోజులు గడిచిపోయినా వాళ్ళలో ఉండే అసంతృప్తి అలానే ఉంటుంది. కాని చాలా మంది కుట్లు, అల్లికలు, పెయింటింగులు అవి చేస్తున్నారు. కాని సమయం వృధా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూసా. ఇంతకంటే ఏం చేస్తాం. మాకేం వస్తుంది అంటారు.

అసలు ఇంటర్‌నెట్ అంటే మంచిది కాదు అని చాలా మంది అభిప్రాయం. ఇక ఆడాళ్ళు నెట్‌లో ఉన్నారంటే చాలా తక్కువ భావంతో చూస్తారు. అది అందరికి తెలుసు. అందుకే ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటర్‌నెట్ వైపు వెళ్ళరు. మనమందరము తెలుగుని వ్యాప్తి చేయాలి, బ్లాగులు, వికీ గురించి ప్రచారం జరగాలి అని చెప్తున్నాము. కాని ఈ పని మన బ్లాగర్లే తమ ఇంటినుండి మొదలెట్టాలి. ఎందుకంటే అందరికీ కంప్యూటర్లు ఉంటాయి. అది ఎలా  ఉపయోగించాలో స్త్రీలకు నేర్పించండి. దాని ఉపయోగాలు, నష్టాలు, జాగర్తలు అన్నీ తెలియజెప్పాలి. పెళ్ళైన వాళ్ళూ తమ భార్యలకు నేర్పించండి. కానివాళ్ళూ అమ్మలకు , అక్క చెళ్ళెళ్ళకు చెప్పండి. ఈనాటి యువతరానికి నెట్ వాడకం తెలుసు కాని తెలుగు రాయవచ్చు సులభంగా అని చాలా మందికి తెలీదు. గృహిణులు అంతర్జాలంలో తమకు ఏ విష్యం గురించైనా తెలుసుకోవచ్చనె నిజం తెలియజెప్పాలి. అది ముఖ్యం.

కుట్లు,అల్లికలు, పాటలు, సాహిత్యం, పండగలు, వంటలు, భక్తి గీతాలు ఇలా ఎన్నో విషయాలు  తెలుసుకోవచ్చని చూపించాలి. దానితో కొంత ఆసక్తి కలిగి వారంత వారే నెట్ ఉపయోగించుకోగలుగుతారు. అప్పుడు తెలుగు రాయడం నేర్పించి ఆవిడకిష్టమైతే బ్లాగు మొదలెట్టించండి.మీ బ్లాగు లోనే మీ టపాలు రాయించండి.తర్వాత మీరు సరిచేసుకోవచ్చు. ఎదైనా విషయం చెప్పి దాని సమాచారమో పుస్తకమో ఇచ్చి వికీలో రాయించండి. తర్వాత ఆవిడే తన స్నేహితురాళ్ళకి పరిచయం చేయకుంటే చూడండి.

అంతర్జాలము వల్ల ఉపయోగాలు చెప్తే అర్ధం కావు. స్వయంగా తెలుసుకుంటే అర్ధం అవుతుంది ఇంకో ఇద్దరికి చెప్పగలరు. కాని ఇది అందరు గృహిణులతో సాధ్యం కాదు. చదవడం అలవాటుండి, రాయాలనే కుతూహలం ఉంటేనే సుమా..

బ్లాగర్లే ఎందుకు మొదలెట్టాలని అన్నానంటే. మనకు అంతర్జాలంలో తెలుగు,బ్లాగులు,వికి ఎలా రాయాలో తెలుసు కాబట్టి.

ఇలా ఎవరైనా మొదలెడితే వాళ్ళు కిట్టీపార్టీలకు, కాల్చేయడానికి వాడే డబ్బు మిగిలిపోతుంది. అదే డబ్బుతో ఆవిడకే చీర కొనివ్వండి బహుమతిగా…పుణ్యం పురుషార్ధం రెండూ అవుతాయి.   

 ప్రతీ ఆడదానిలో ఒక ప్రత్యేకత, టాలెంట్ ఉంటుంది. పట్టుదల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే తను సాధించలేనిది లేదు..

ప్రకటనలు

Comments on: "ఇల్లాలు – ఇంటర్నెట్" (8)

 1. మంచి మాట చెప్పారు.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. 78% (మంచి ఉపాయము, ఉపయోగపడునట్టి సలహా చెప్పినందులకు)

 3. 100%(మంచి ఉపాయము, ఉపయోగపడునట్టి సలహా చెప్పినందులకు)

 4. 100% [మంచి ఉపాయము, ఉపయోగపడునట్టి సలహా చెప్పినందులకు)

 5. nice posting, pls increase the font size….

 6. ఇప్పటికే ఆడోళ్ళు సీరియల్స్ తో టి,వి,లకు అతుక్కుపోతున్నారు.
  ఇక కంప్యూటర్ కూడా అలవాటు చేసేసి ఒక బ్లాగుకూడా ఇచ్హేస్తే …..?

  దేవుడా మొగుళ్ళను పిల్లల్ని ఇంటిని నువ్వే బచాయియించాలే.

 7. జ్యోతిగారూ,
  బాగుందండి. 2కె.లో కూడా ఇంకా ఆడవాళ్లు కంప్యూటరుజోలికి రాకపోడంగురించి మీరు చెప్పింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: