నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

 నేను మొదటిసారిగా హిందూ దినపత్రిక వాళ్ళు పెట్టిన వంటల

పోటీలో పాల్గొన్నాను. నాకు చాలా ఇష్టమైన వంటకం. తెలంగాణా

స్పెషల్. హైదరాబాదీ టచ్‍తో. పంపి చూద్దాం అని   గత వారం

మెయిల్ చేసి మర్చిపోయా కూడా. వస్తుందనే నమ్మకం లేదు. .  

కాని విచిత్రంగా దానికి బహుమతి ఇచ్చారు జడ్జిగారు . ప్చ్… 

ఇది ఇంగ్లీషులో ఉంది. బాగుందంటే చెప్పండి. తెలుగులో రాసి

రేపు షడ్రుచులులలో పెడతా. 

ఇంత చిన్న విషయానికి బ్లాగులో రాయాలా!!  గొప్పలు కాకపోతే

అని అనుకోకండి. మొదటిసారి కదా నా సంతోషాన్ని దాచుకోలేక

మీ అందరితో పంచుకోవాలని ఇలా నా బ్లాగులో రాసుకుంటున్నా.

 అంతే  అల్పసంతోషిని బాబు. ఏం చేద్దాం !!!!

http://www.hindu.com/mp/2007/08/04/stories/2007080452040400.htm

ప్రకటనలు

Comments on: "మొదటి ప్రయత్నం – మొదటి బహుమతి" (31)

 1. ఇది చిన్న విషయమేమి కాదండి. బహుమతి సాధించిన సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 2. congrats andi

 3. అభినందనలు.
  శాఖాహారమైతే..ఈ రోజే ఇంట్లో ప్రయత్నించేవాడిని 🙂
  మాంసం బదులు ఇంకేమి కలపవచ్చు?

 4. . ఏ మాంసం వంటకములోనైనా మాంసం బదులు సోయా చంక్స్ వాడొచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అవి.

 5. బ్లాగులున్నదే మన సొంత డబ్బా కొట్టుకోవడానికి…

 6. అక్కా, హృదయపూర్వక శుభాకాంక్షలు.

  పనిలో పనిగా కూరళొ “బ్లాగు” కలపాలి అనుంటే మన బ్లాగులు ప్రాచుర్యం పొందెవీ ఖాడ?

  –ప్రసాద్
  http://blog.charasala.com

 7. అయ్యో! caps lock చూసుకోలా!
  అక్కా, హృదయపూర్వక శుభాకాంక్షలు.

  పనిలో పనిగా కూరలో “బ్లాగు” కలపాలి అనుంటే మన బ్లాగులు ప్రాచుర్యం పొందెవి కదా?

  –ప్రసాద్
  http://blog.charasala.com

 8. జ్యోతక్కకు,

  శుభాభినందనలు. మొదటి ప్రయత్నమే మొదటి బహుమతి వహ్యా.. వహ్యా..

  బహుమతి కోసం మీరు ఫోను చేయకండి:-) నేనే ఫోను చేసి ఇక్కడికి తెప్పించుకొని వుంచేసుకుంటా. వాళ్ళేదయినా గ్రీటింగ్ కార్డో, కాగితం ముక్కో పంపిస్తే అది మీకిచ్చేస్తా 🙂

  — విహారి

 9. అక్కా,
  అందుకో మా తమ్ముళ్ళ శుభాభినందనలు…హైదరాబాద్ లో ఉంటే మీ ఇంటికి వచ్చి మీ చేతి వంట తినే భాగ్యం కలిగేదేమొ ఎప్పుడైనా…ప్చ్…ప్రాప్తం లేదు ఏమిచేద్దాం…

  అన్నట్లు…బహుమతి జాగ్రత్త అక్కా…అసలే విహారి కన్ను పడింది అప్పుడే.

 10. ఒక ప్రముఖ హొటెల్ – చెఫ్ ఆమోదం, ఒక అంతర్జాతీయపత్రికలొ ప్రచురణ మామూలు విషయాలు కాదు. మీ recipe ని చాలా మంది చదువుతారు. కొంతమంది try చేస్తారు కూడా. ఒకల్ళొ ఇద్దరో మిమ్మల్ని కాంటక్ట్ చెయ్య్డానికి ప్రయత్నం కూడా చేస్తారు. మొన్న బ్లాగు..నేడు వంటకం. రెండూ ఆమోదయోగ్యాలే! హర్షణీయాలే!

  అందరూ భోంచేసేవి కాకుండా BP, Diabetes, Heart patients కి కూడా పనికివచ్చే వంటకాలు అందరికి అందుబాటులో లేవు. అవి ఏవైనా బ్లాగొచ్చుకదమ్మా?

  చేసినా చెయ్యకపొయినా, అలుపేరగని మీ ఉత్సాహానికి జోహార్లు!

  అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా..మరి వారి ప్రోత్సాహం లేకపొతే ఈ టపాలెక్కడివి?

 11. “తెలుగులో రాసి రేపు షడ్రుచులులలో పెడతా. ”
  చెయ్యమ్మ!
  నోరుకారుతొంది!

 12. అభినందనలు. చాలా సంతోషం!!

 13. మొత్తానికి తెలుగు కీర్తి ఘుమఘుమల్ని అందరికీ రుచి చూపించినందుకు అభినందనలు. కానీ నేను శాఖాహారినైపోతిని కనుక, ఓ మాంఛి వెజిటేరియన్ డిష్ నొక దాన్ని మాకూ రుచి చూపించండి.

 14. జ్యోతి గారూ శుభాకాంక్షలు, మీకు మీరే సాటి అన్ని రంగాలలో, దూసుకుపోండి.
  -నల్లమోతు శ్రీధర్

 15. శుభాకాంక్షలు జ్యోతి గారూ. ఏ పోటీలో అయినా గెలవటం చిన్న విషయం కాదండీ.

 16. చాలా సంతోషం…
  మీ వంటలకు తగిన గుర్తింపు లభించింది.

 17. అభినందనలు జ్యోతి గారు 🙂

 18. విజయం విజయమే! చిన్నా పెద్దా తేదా ఉండదు. అభినందనలు.

 19. మీ విజయం అమోఘం, మీ వంటలు అనితర సాధ్యం. అందుకోండి మా బ్లాగ్లోక అభినందనలు.

 20. అభినందనలు.ఇన్నాళ్ళకి మీ వంటల కి తగిన ప్రతిఫలం లభించింది[ఇంట్లో వాళ్ళూ,మీ గరిట వంట తిన్నవాళ్ళ అభినందనలు ఇవన్నీ సర్వసాధారణం కదా.అందుకు అవి లెక్కలోకి రావు] త్వరగా బ్లాగులో పెట్టండి.మేము తయారు చేసి చూస్తాము.ఇన్నాళ్ళూ వంటల్లో నాకే అనుమానం వచ్చినా అమ్మా… అంటూ ఫోను పట్టుకుంటే నువ్వు చేసే ఆ వంటకం రేటు కన్నా ఫోను బిల్లు ఎక్కువవుతుంది అని మావారు బాధపడేవారు.మీ బ్లాగు పుణ్యమా అని మా వారు హేపీస్.

 21. వింజమూరి విజయకుమార్ said:

  జ్యోతి మేడమ్! నేనొక బాధ్యతాయతమైన కథ రాస్తూ, ఆలస్యంగా అభినందిస్తున్నా. మరోలా భావించకండి. బహుమతి అనేది ఏదైనా అద్భుతమైనదే. ఆనందించండి! మీకు మరిన్ని బహుమతులూ, అభినందనలూ రావాలని అభిలషిస్తున్నాను.

 22. చాలా ఆలస్యంగా చూసినా…ఆనందంగా ఉంది..నాకిప్పుడీ మటన్ దాల్ తినాలనిపిస్తుంది వాఁ వాఁ వాఁ

 23. ఇంత ఖ్యాతి గడించిన తరువాత ఇక తప్పదు, ఈసారి హైదరాబాదు పర్యటనలో మీ ఇంటికి ఒకసారి భోజనానికి రావాలనుకుంటున్నాను… 🙂

 24. ఇవాళ వెళ్ళి బహుమతి తెచ్చుకున్నా. వెయ్యి రూపాయల గిఫ్ట్ చెక్ . 24 letter mantra అనే దుకాణం నుండి .. వాళ్ళే స్పాన్‍సర్ చేసింది.

  ఇక ఆరోగ్యానికి సంబందించినా వంటకాలు కూడా రాయాలని కాస్త పరిశోధన చేస్తున్నా. త్వరలో మొదలు పెడతా.

  నన్ను మనసారా అభినందించిన అందరికి ధన్యవాదములు.

  కాని ఇది నాకు అంత సంతోషానివ్వటంలేదు. ఇంకా ఎదో సాధించాల్సింది ఉంది అనిపిస్తుంది. ఏంటో అది మరి. ఎక్కడికో ఈ ప్రయాణం???

 25. వెయ్యిన్నూట పదార్లు ఐతే బాగుండేది!
  కదా!?
  “ఇక ఆరోగ్యానికి సంబందించినా వంటకాలు కూడా రాయాలని కాస్త పరిశోధన చేస్తున్నా. త్వరలో మొదలు పెడతా.”
  సంతోషమే సగం బలం !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: