నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

నస్లీమా కేసులో హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు చూస్తుంటే న్యాయం
ధర్మం ఇంకా బ్రతికే ఉన్నాయనిపిస్తుంది. ఉల్టా చోర్ కోత్వాల్ కో
డాంటే అని హిందీ సామెత ఉంది. దొంగ పోలీసుని నిలదీసాడంట.
తస్లీమాపై సిగ్గు లేకుండా దాడిన చేసిన ప్రజాప్రతినిధులపై కేసుపెడితే
వాళ్ళను అరెస్ట్ చేసి గంటలో వదిలేసారు మన ఘనత వహించిన
పోలీసులు. పైగా ఆ నాయకులు చెప్పినట్టు తస్ల్లీమాపైనే కేసుపెట్టారు.
కాని హైకోర్టులో పెట్టిన కేసులో న్యాయస్థానం ప్రభుత్వం,పోలీసులపై
విరుచుకుపడింది. ప్రజలందరి మనస్సులో ఉన్న మాటలన్ని అడిగి
దులిపేసింది. భేష్.దాడి చేసిన శాసన సభ్యుల గురించి ప్రభుత్వం
ఇంతవరకు   ఎటువంటి ప్రకటన కాని చేయలేదు, తీసుకోవాల్సిన
చర్యలు గురించి   కాని నోరెత్తలేదు. ఎదో చీమలు దోమలు
కొట్టుకున్నాయి మాకెందుకు అన్నట్టుగా ఊరకుండి  ప్రతిపక్షాలపై
విరుచుకుపడడం, భూములు కబ్జా చేయడంలో బిజీగా ఉంది.
ఎవరైనా మనకు నచ్చని పని చేశ్తే నిరసించాలిగాని ఇలా దాడి చేయడం
 అమానుషం. మన తల్లి, చెల్లి కూడా ఇలా విభేదిస్తే ఇలానే చేస్తామా.
రేపు హైకోర్టులో న్యాయవాదులపై, అసెంబ్లీపైగాని,డాక్టర్లపైగాని
ఇలానే దాడి చేస్తే మీరేం చేస్తారు అని పోలీసులను బాగా వాతలు
పెట్టింది.తస్లీమా మళ్ళీ  హైదరాబాదు వస్తే చంపేస్తాం అన్న
శాసనసభ్యుడిపై ఇంతవరకు చర్య తీసుకోలేదు మన పోలీసులు.
ఇప్పుడైనా కదులుతారో లేదో. తోలు మందం అని గాలికొదిలేస్తారా??
ఇది ఇక్కడివరకే ఆగకుండా దోషులు శిక్షింపబడాలి అని కోరుకుందాం. అప్పుడే ముందు ముందు మనకు జరిగిన ఏదైనా అన్యాయం గురించి పోలీసులను, న్యాయస్థానికి ఫిర్యాదు చేయగలుగుతాం.

ప్రకటనలు

Comments on: "న్యాయదేవత మేల్కొనే ఉంది." (3)

 1. పంది మీద బురద పోస్తే ఏమౌతుంది?
  పెంట తినే కుక్కను తిడితే ఏమౌతుంది?
  ఓండ్రపెట్టే గాడిద ముందు అరిస్తే ఏమౌతుంది?

 2. చూడాలి కనీసం కోర్టుకు సమాధానం చెప్పడం కోసమైనా పోలీసులు “న్యాయం” చేస్తారేమొ!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. పేడ మీద రాయేస్తే పేడ కేమి నష్టం?
  ఎం ఐ ఎం వీరంగం తెచ్చింది కొత్త కష్టం
  మజ్లిసోళ్ళందరూ మతోద్ధారకులా?
  ఊరుకుంటే పోలా?రౌడీతనమేలా?
  తస్లిమాను తన్నాలా?
  ఎందుకో ఈ లాభం లేని గోల?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: